"తెలంగాణలో సైనిక్ స్కూల్ ఏర్పాటు చేయాలి"
సదరన్ కమాండ్ సెంటర్ ప్రధాన కార్యాలయాన్ని హైదరాబాద్ కు మార్చే అంశాన్ని పరిశీలించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆర్మీ ఉన్నతాధికారులను కోరారు. తెలంగాణలో సైనిక్ స్కూల్ ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. దేశంలో వివిధ రాష్ట్రాలలో ఒక్కో రాష్ట్రంలో రెండు నుంచి నాలుగు సైనిక్ స్కూల్స్ మంజూరు చేశారని తెలిపారు. తెలంగాణలో పదేళ్లుగా ఒక్క సైనిక్ స్కూల్ కూడా మంజూరు చేయలేదని గుర్తు చేశారు. గురువారం కమాండ్ కంట్రోల్ సెంటర్ లో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన 'సివిల్ మిలిటరీ లైజన్ కాన్ఫరెన్స్' జరిగిన విషయం తెలిసిందే.
ఈ సమావేశంలో తెలంగాణ రాష్ట్రం తరపున పలు విజ్ఞప్తులను ఆర్మీ ఉన్నతాధికారుల దృష్టికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీసుకెళ్లారు. సదరన్ కమాండ్ సెంటర్ ప్రధాన కార్యాలయాన్ని హైదరాబాద్ కు మార్చే అంశాన్ని పరిశీలించాలని కోరారు. దేశ భద్రతకు సంబంధించిన అంశాల్లో సహకరించేందుకు తెలంగాణ ప్రభుత్వం ముందుంటుందని స్పష్టం చేశారు. ఇందులో భాగంగానే వికారాబాద్ లో ఫ్రీక్వెన్సీ నేవీ రాడార్ స్టేషన్ కు 3 వేల ఎకరాలు కేటాయించినట్లు గుర్తు చేశారు.

ఆర్మీ, తెలంగాణ ప్రభుత్వం మధ్య సమస్యల పరిష్కారం, చర్చలకు సంబంధించి ఆర్మీ వైపు నుంచి కూడా ప్రత్యేక అధికారులను నియమించాలని సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. నిరంతరచర్చల ద్వారానే సమస్యలు పరిష్కారమవుతాయని ఆర్మీ అధికారులకు స్పష్టం చేశారు.












Click it and Unblock the Notifications