వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చంద్రబాబుకు అసంతృప్తి: 26 తర్వాత ఎప్పుడైనా రేవంత్ కీలక ప్రకటన, నెక్స్ట్ స్టెప్‌పై

తెలంగాణ తెలుగుదేశం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి మరో రెండు మూడు రోజుల్లో తాను పార్టీ మారే విషయాన్ని అధికారికంగా ప్రకటించనున్నారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్/అమరావతి: తెలంగాణ తెలుగుదేశం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి మరో రెండు మూడు రోజుల్లో తాను పార్టీ మారే విషయాన్ని అధికారికంగా ప్రకటించనున్నారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

చంద్రబాబుకు నో చాన్స్: వ్యూహాత్మకంగా రేవంత్ రెడ్డి రాజీనామా?చంద్రబాబుకు నో చాన్స్: వ్యూహాత్మకంగా రేవంత్ రెడ్డి రాజీనామా?

ఏపీ సీఎం, టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడు గురువారం రాత్రి లండన్ నుంచి ఢిల్లీకి రానున్నారు. అనంతరం ఇక్కడకు వస్తారు. చంద్రబాబు వచ్చాక ఆయనను రేవంత్ కలిసే అవకాశాలున్నాయి.

ఇమేజ్ డ్యామేజ్, ఎదురుగాలి: రేవంత్‌కు కాంగ్రెస్ దిమ్మతిరిగే షాక్, రాంగ్‌స్టెప్?ఇమేజ్ డ్యామేజ్, ఎదురుగాలి: రేవంత్‌కు కాంగ్రెస్ దిమ్మతిరిగే షాక్, రాంగ్‌స్టెప్?

రేవంత్ కాంగ్రెస్‌లో చేరడం దాదాపు ఖాయమైంది. ఈ నేపథ్యంలో ఏపీ నేతలపై చేసిన విమర్శలకు ఆధారాలు ఆయన ముందు ఉంచుతారా? వెళ్తానని సూటిగా చెప్పేస్తారా? అనే చర్చ సాగుతోంది. టిడిపి నేతలు చంద్రబాబుకు తెలిసే తనపై మాటల దాడి పెంచుతున్నారని రేవంత్‌కు కూడా అర్థమైందని అంటున్నారు.

అంతా రేవంత్ రెడ్డి వల్లే, ఎదురుదాడి: ఇరకాటంలో నేతలు, జీర్ణించుకోలేని బాబుఅంతా రేవంత్ రెడ్డి వల్లే, ఎదురుదాడి: ఇరకాటంలో నేతలు, జీర్ణించుకోలేని బాబు

తన అసంతృప్తిని చంద్రబాబుకు చెప్పనున్న రేవంత్ రెడ్డి

తన అసంతృప్తిని చంద్రబాబుకు చెప్పనున్న రేవంత్ రెడ్డి

చంద్రబాబు విదేశాల నుంచి తిరిగి వచ్చాక తాను ఆయనను కలుస్తానని రేవంత్ రెడ్డి ఇటీవల చెప్పిన విషయం తెలిసిందే. బాబును కలిస్తే పలు విషయాలు ఆయన దృష్టికి తీసుకు వెళ్లనున్నారు. టిఆర్ఎస్‌తో ఏపీ నేతల దోస్తీపై తన అసంతృప్తిని వ్యక్తం చేయడంతో పాటు ఇక తాను పార్టీలో ఉండేది లేదని తేల్చి చెప్పనున్నారని తెలుస్తోంది.

రెండు మూడు రోజుల్లో రేవంత్ రెడ్డి ప్రకటన చేసే అవకాశం

రెండు మూడు రోజుల్లో రేవంత్ రెడ్డి ప్రకటన చేసే అవకాశం

చంద్రబాబును కలిసి వివరణ ఇస్తారని చాలామంది భావిస్తుండవచ్చు. పలు విషయాలను ఆయన దృష్టికి తీసుకు వెళ్లడంతో పాటు కాంగ్రెస్ పార్టీలో చేరే విషయాన్ని చెప్పనున్నారని అంటున్నారు. రేవంత్ ఈ నెల 26 వ తేదీ తర్వాత ఎప్పుడైనా కాంగ్రెస్ పార్టీలో చేరే విషయాన్ని ప్రకటించనున్నారని తెలుస్తోంది.

రేవంత్ రెడ్డి రాజీనామాపై చర్చ

రేవంత్ రెడ్డి రాజీనామాపై చర్చ

రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరితే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తారా అనే చర్చ కూడా సాగుతోంది. 2014లో టిడిపి నుంచి గెలిచి తెరాసలో చేరిన ఎమ్మెల్యేలపై రేవంత్ రెడ్డి కోర్టు గడప తొక్కారు. ఇప్పుడు ఆయనే కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశముంది. ఈ నేపథ్యంలో ఆయన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి చేరుతారా, లేదా అనేది చర్చనీయాంశంగా మారింది.

అందుకే కాంగ్రెస్ వైపు మొగ్గు

అందుకే కాంగ్రెస్ వైపు మొగ్గు

వచ్చే ఎన్నికల్లో తెరాసకు ధీటుగా ఉండేందుకు కాంగ్రెస్‌తో పొత్తుతో ముందుకు వెళ్లాలని రేవంత్ భావిస్తున్నారు. కానీ ఇతర తెలంగాణ టిడిపి నేతలు అందుకు సుముఖంగా లేరు. టిఆర్ఎస్‌తో కలిసే అవకాశాలున్నాయనే ఇతర నేతల వ్యాఖ్యలు రేవంత్‌కు ఏమాత్రం ఆమోదయోగ్యంగా లేవు. ఈ కారణంగా ఆయన కాంగ్రెస్ వైపు మొగ్గు చూపుతున్నారు.

తదుపరి అడుగు కోసం సన్నిహితులతో భేటీ

తదుపరి అడుగు కోసం సన్నిహితులతో భేటీ

ఈ నెల 26వ తేదీన టిడిఎల్పీ భేటీ కానుంది. రేవంత్ టిడిపి ఎమ్మెల్యే కాబట్టి ఆయన హాజరుకానున్నారు. ఆ తర్వాత 27 లేదా 28న చంద్రబాబుతో భేటీ కానున్నారు. ఆ సమయంలో ఆయన తన నిర్ణయం ప్రకటించే అవకాశముంది. మరోవైపు, తన తదుపరి అడుగు కోసం రేవంత్ రెడ్డి తన సన్నిహితులతో భేటీ అవుతున్నారని తెలుస్తోంది.

English summary
Telangana Telugu Desam working president Revanth Reddy, who continues to create a sort of confusion among the party leaders about his political moves, is all set to announce his decision to join the Congress after October 26.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X