రాజీనామా: అన్నీ చేశారు కానీ, రేవంత్ తెలివిగా తప్పించుకుంటున్నారా?

Posted By:
Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: కొడంగల్ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి రాజీనామా వ్యవహారంపై చర్చ సాగుతోంది. రాజీనామాపై ఆయన చిత్తశుద్ధితో ఉన్నారా అనే చర్చ సాగుతోంది. ప్రభుత్వంపై నుంచి విమర్శల నుంచి రాజీనామా వరకు రేవంత్ దూకుడుగా వ్యవహరిస్తున్నారు.

అప్పటి దాకా సైలెన్స్: ఓ వైపు సీనియర్లతో రేవంత్, ఇక విజయశాంతి ప్రచారం

తాను రాజీనామా చేశానని రేవంత్ కూడా ప్రకటించారు. కానీ ఆ రాజీనామా పత్రం ఎక్కడి వరకు వచ్చింది? ఎప్పుడు కదలిక వస్తుంది? ఏ లోగా రాజీనామా ఆమోదం పూర్తి అవుతుంది? అనే ప్రశ్నలకు సమాధానం లేదు.

 రాజీనామా పత్రం అక్కడ ఇచ్చారు

రాజీనామా పత్రం అక్కడ ఇచ్చారు

అయితే, రాజీనామా ఆమోదిస్తే ఉప ఎన్నికలు వస్తాయా? వస్తే ఎవరు గెలుస్తారు? అనే చర్చ అందరిలోను కొనసాగుతోంది. రేవంత్ తన రాజీనామా పత్రాన్ని ఏపీ సీఎం చంద్రబాబు పర్సనల్ సెక్రటరీకి అందించారు. గన్‌మెన్లను ఉపసంహరించుకున్నారు. పర్సనల్ సెక్రటరీని ప్రభుత్వానికి సరెండర్ చేశారు. కానీ అక్కడి నుంచి ముందుకు కదలడం లేదు. శీతాకాల సమావేశాలకు వెళ్లడం లేదు.

 ఇదీ రేవంత్ రెడ్డి సన్నిహితుల మాట

ఇదీ రేవంత్ రెడ్డి సన్నిహితుల మాట

ఇక్కడే అసలు కథ మొదలయిందని అంటున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు బీ ఫారం ఇస్తేనే రేవంత్‌ గెలిచారని, అందుకే రాజీనామా లేఖను కూడా చంద్రబాబుకే అందజేశారని ఆయన సన్నిహితులు అంటున్నారు. అయితే రేవంత్‌ రాజీనామాకు సంబంధించి తమకు ఎలాంటి లేఖ అందలేదని స్పీకర్‌ కార్యాలయం చెబుతోంది. కానీ రేవంత్ మాత్రం రాజీనామా ఆమోదింప చేసుకునే దిశగా ముందుకు కదలడం లేదంటున్నారు.

 ముందుకు రావడం లేదా

ముందుకు రావడం లేదా

రాజీనామా ఆమోదింప చేసుకునే ఉత్సాహం ఆయనకు లేదా? లేక కాంగ్రెస్ పార్టీ ఆయన ఉత్సాహంపై నీళ్లు చల్లుతుందా? కొడంగల్‌లో వరుసగా రేవంత్ రెడ్డి అనుచరుల షాక్ నేపథ్యంలో పునరాలోచన చేస్తున్నారా? తెలియాల్సి ఉంది.

 ఇదీ నిబంధన

ఇదీ నిబంధన

నిబంధనల ప్రకారం ఎమ్మెల్యే రాజీనామా చేయాలంటే వ్యక్తిగతంగా కానీ, తన ప్రతినిధి ద్వారా కానీ స్పీకర్‌కు రాజీనామా లేఖ అందించారు. రాజీనామా లేఖ కూడా స్పీకర్‌ ఫార్మెట్‌లోనే ఉండాలి. రాజీనామా సహేతుకమని స్పీకర్‌ భావిస్తే ఆమోదించవచ్చు. లేదంటే తిరస్కరించే అధికారం స్పీకర్‌కు ఉంది.

అలా వ్యూహాత్మకంగా వ్యవహరించారు

అలా వ్యూహాత్మకంగా వ్యవహరించారు

కానీ రేవంత్ రెడ్డి విషయంలో పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉంది. రాజీనామా లేఖ చంద్రబాబు వద్దే ఉండిపోయింది. రేవంత్‌ రాజీనామా ఇచ్చానని చెబుతున్నారు. సాంకేతికంగా ఆయన రాజీనామా ఆమోదం పొందలేదు. అయితే, ఒక్క వ్యాఖ్యంలో రాజీనామా, గన్‌మెన్‌లను వెనక్కి పంపించి... ఇలా అన్నింటితో చిత్తశుద్ధి నిరూపించుకున్న రేవంత్.. ఇక్కడ మాత్రం వ్యూహాత్మకంగా వ్యవహరించారని అంటున్నారు.

 చంద్రబాబు చేతిలో పెట్టి తప్పించుకున్నారా?

చంద్రబాబు చేతిలో పెట్టి తప్పించుకున్నారా?

రేవంత్‌ తన రాజీనామా లేఖను చంద్రబాబు చేతిలోపెట్టి తెలివిగా తప్పించుకున్నారనే విమర్శలు వస్తున్నాయి. రాజీనామా చేయాలనుకుంటే నేరుగా స్పీకర్‌ను కలిసి లేఖను అందజేయాలి కానీ చంద్రబాబుకు ఇస్తే ఏం ప్రయోజనం అంటున్నారు.

విమర్శలు చేయలేదు, అందుకే

విమర్శలు చేయలేదు, అందుకే

తన రాజీనామా లేఖలో ఎక్కడా రేవంత్‌ టీడీపీని విమర్శించలేదు. అధినేత, పార్టీ నాయకులు తనకు చేసిన సాయానికి కృతజ్ఞతలు తెలిపారు. సాధారణంగా పార్టీని వీడే నాయకులు విమర్శలు చేస్తారు. కానీ రేవంత్‌ అలా చేయలేదు. చంద్రబాబు, పార్టీశ్రేణుల సానుభూతి పొందేలా రాజీనామా లేఖరాయడంతో ఒకరిద్దరు టీడీపీ నేతలు తప్ప మిగిలినవారెవరూ రేవంత్‌పై విమర్శలు కూడా చేయలేదు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Kodangal MLA Revanth Reddy resignation at Andhra Pradesh Chief Minister Nara Chandrababu Naidu.
Please Wait while comments are loading...