సేఫ్ గేమ్ ఆడుతున్నారా?: 'రేవంత్ సూపర్, కేసీఆర్! గుణపాఠం నేర్చుకో'

Posted By:
Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: టీడీపీ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరిన రేవంత్ రెడ్డిని చూసి అయినా తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు బుద్ధి తెచ్చుకోవాలని కాంగ్రెస్, లెఫ్ట్ పార్టీలు డిమాండ్ చేస్తున్నాయి.

రియల్ మెగాస్టార్ ఆఫ్ కాంగ్రెస్: బాస్ ఈజ్ హియర్: వర్మ మార్ఫింగ్ ఫోటోలు

టీడీపీ నుంచి కాంగ్రెస్‌లో చేరినందున, అంతకుముందే రేవంత్ తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. అంతేకాదు గన్‌మెన్‌ను, పీఏను వెనక్కి పంపించారు. ఎమ్మెల్యే క్వార్టర్‌ను ప్రభుత్వానికి అప్పజెప్పనున్నారు.

'రేవంత్ వేరేవ్యక్తి కాదు, మా అల్లుడే': అలా షాకిచ్చిన కాంగ్రెస్ నేత

ఇది తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు చిక్కులా తయారయిందని అంటున్నారు. గత మూడేళ్లుగా టీడీపీ, కాంగ్రెస్ ఇతర పార్టీల నుంచి ఇరవై మందికి పైగా ఎమ్మెల్యేలు టీఆర్ఎస్‌లో చేరారు. వీరిచే కూడా రాజీనామా చేయించాలనే డిమాండ్లు టీఆర్ఎస్‌కు తలనొప్పులు తెస్తున్నాయి.

ఆ కుట్రలో భాగంగానే, చుక్కలు చూపిస్తాడు: రేవంత్‌పై దుమ్మెత్తిపోశారు

రేవంత్ నుంచి గుణపాఠం నేర్చుకోండి

రేవంత్ నుంచి గుణపాఠం నేర్చుకోండి

రేవంత్ ముందుగా తన శాసన సభ్యత్వానికి రాజీనామా చేశారని, గన్‌మెన్‌, క్వార్టర్స్‌ను ప్రభుత్వానికి అప్పజెప్పి మంచి సంప్రదాయానికి శ్రీకారం చుట్టారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట రెడ్డి అన్నారు. రేవంత్‌ నుంచైనా కేసీఆర్‌ గుణపాఠం నేర్చుకోవాలన్నారు.

 ఎవరి బలమెంతో తేలుతుంది

ఎవరి బలమెంతో తేలుతుంది

ఇతర పార్టీల ఎమ్మెల్యేలను తన పార్టీలోకి ఆకర్షించిన కేసీఆర్‌, ఆ 30 మంది ఎమ్మెల్యేలతో రాజీనామాలు చేయించి ఉప ఎన్నికలకు వెళ్తే ఎవరి బలమెంతో తేలుతుందనే డిమాండ్లు వినిపిస్తున్నాయి. అందుకు కేసీఆర్ సిద్ధమేనా అని కాంగ్రెస్ పార్టీ కూడా ప్రశ్నిస్తోంది.

 105 సీట్లలో గెలుస్తావా, సవాల్‌కు సిద్ధమా

105 సీట్లలో గెలుస్తావా, సవాల్‌కు సిద్ధమా

రాష్ట్రంలో ఎన్నికలు నిర్వహిస్తే తాము 105 సీట్లు సాధిస్తామని కేసీఆర్‌ చెప్తున్నారని, గెలుపుపై అంత ధీమా ఉంటే రేవంత్ బాటలో టీఆర్ఎస్‌లో చేరిన ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి ఎన్నికలకు సిద్ధం కావాలని కాంగ్రెస్ సహా విపక్షాలు సవాల్ విసురుతున్నాయి.

 డీకే అరుణ సవాల్

డీకే అరుణ సవాల్

కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే డీకే అరుణ కూడా అదే డిమాండ్ చేశారు. ఇతర పార్టీల నుంచి గెలిచి టీఆర్ఎస్‌లో చేరిన ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి ఎన్నికలకు సమాయత్తం కావాలని సవాల్ విసిరారు.

 అలా వెంటనే ఆమోదించే అవకాశం

అలా వెంటనే ఆమోదించే అవకాశం

ఎమ్మెల్యే పదవీ కాలం ముగియకుండానే రాజీనామా చేస్తే స్పీకర్ ఆమోదించడానికి ఓ విధానం ఉందని అంటున్నారు. ఎమ్మెల్యే పదవికి నిర్ణీత పార్మాట్లో రాజీనామా చేసిన లేఖను రేవంత్ స్వయంగా స్పీకర్‌కు అందచేసి ఆమోదించాలని కోరితే వెంటనే ఆమోదించే అవకాశాలుంటాయని అంటున్నారు.

 అలా చేస్తే ఆమోదిస్తారు

అలా చేస్తే ఆమోదిస్తారు

వ్యక్తులు లేదా పోస్ట్ లేదా ఫ్యాక్స్ ద్వారా రాజీనామా లేఖ అందితే రాజీనామా చేసిన ప్రజాప్రతినిధిని స్పీకర్ పిలిచి మాట్లాడుతారు. ఆ రాజీనామా లేఖ మీదేనా, తొందరపడి లేదా ఆవేశంలో లేదా ఒత్తిడిలో చేశారా అని అడుగుతారు. ఇష్టపూర్వకంగా చేశానని చెబితే ఆమోదిస్తారు.

స్పీకర్ నిర్ణయం తీసుకోకుంటే కోర్టును ఆశ్రయించవచ్చు

స్పీకర్ నిర్ణయం తీసుకోకుంటే కోర్టును ఆశ్రయించవచ్చు

తన రాజీనామాపై స్పీకర్ నిర్ణయం తీసుకోకుంటే కోర్టును ఆశ్రయించే వెసులుబాటు కూడా ఉంది. రాజీనామాను ఆమోదిస్తే అసెంబ్లీ సచివాలయం నోటిఫికేషన్ విడుదల చేస్తుంది. ప్రతిని ఎన్నికల సంఘానికి పంపిస్తుంది. దానిపై ఈసీ నిర్ణయం తీసుకొని, ఆరు నెలల్లో ఉప ఎన్నికకు నోటిఫికేషన్ విడుదల చేస్తుంది.

తలసాని విషయంలో సేఫ్ గేమ్

తలసాని విషయంలో సేఫ్ గేమ్

ఇక రేవంత్ రాజీనామా పత్రం స్పీకర్‌కు చేరుతుందా? టీఆర్ఎస్‌లో చేరిన వారిచే కూడా రాజీనామా చేయించాలని డిమాండ్లు వస్తాయి కాబట్టి టీఆర్ఎస్ సేఫ్ గేమ్ ఆడుతుందా లేదా రేవంతే రాజీనామాపై సేఫ్ గేమ్ ఆడుతున్నారా అనేది ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే తలసాని శ్రీనివాస్ యాదవ్ రాజీనామా విషయంలో ప్రభుత్వం సేఫ్ గేమ్ ఆడుతోంది.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Kodangal MLA Revanth reddy, who joined Congress on Tuesday, irked Telangana Chief Minister K Chandrasekhar Rao and Talasani Srinivas Yadav.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి