ఆ బాహుబలి హరీష్ రావేనేమో: ఇలా రండి... పవన్ కళ్యాణ్‌కు రేవంత్ పిలుపు

కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత చేసిన బాహుబలి వ్యాఖ్యలు తెలంగాణలో చర్చనీయాంశంగా మారాయి. కాంగ్రెస్ నుంచి వచ్చే ఎన్నికల నాటికి ఓ బాహుబలి పుట్టుకు వస్తారని, తెరాసను ఓడిస్తారని జానా అభిప్రాయపడ్డారు.

హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత చేసిన బాహుబలి వ్యాఖ్యలు తెలంగాణలో చర్చనీయాంశంగా మారాయి. కాంగ్రెస్ నుంచి వచ్చే ఎన్నికల నాటికి ఓ బాహుబలి పుట్టుకు వస్తారని, తెరాసను ఓడిస్తారని జానా అభిప్రాయపడ్డారు.

దీనిపై తెలంగాణ తెలుగుదేశం పార్టీ నేత రేవంత్ రెడ్డి స్పందించారు. కాంగ్రెస్ పారటీని గెలిపించే బాహుబలి ఎవరో జానారెడ్డికే తెలియదని, బహుశా హరీష్ రావు కావొచ్చునని ఎద్దేవా చేశారు.

కవిత ఆధ్వర్యంలో బీజేపీలో కలిస్తే..

కవిత ఆధ్వర్యంలో బీజేపీలో కలిస్తే..

ముఖ్యమంత్రి కేసీఆర్ కేసీఆర్‌ కోటి ఎకరాలకు నీళ్లు ఎక్కడ ఇచ్చారో తెలపాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. తెరాస ఎంపీలను కవిత ఆధ్వర్యంలో బీజేపీలో విలీనం చేస్తే తెలంగాణకు రుణమాఫీ వస్తుందన్నారు. యూపీలో కేంద్రం రుణమాఫీ చేస్తుందని, తెలంగాణలోను కేంద్రమే చేయాలని కవిత వ్యాఖ్యానించారు. దీనికి రేవంత్ పైవిధంగా స్పందించారు.

జగదీశ్వర్ రెడ్డి ఓటమి ఖాయమని..

జగదీశ్వర్ రెడ్డి ఓటమి ఖాయమని..

ప్రభుత్వం రూ.12వేల కోట్లు కేటాయిస్తే పూర్తి రుణమాఫీ అవుతుందన్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో జగదీశ్వర్ రెడ్డి ఓడిపోతారని రేవంత్ జోస్యం చెప్పారు. తెలంగాణ రాష్ట్రంకోసం 1,200 మంది తెలంగాణ బిడ్డలు ఆత్మహత్యలు చేసుకుంటే వారిని పట్టించుకోకుండా ఓటు బ్యాంక్‌ కోసం కులాలవారీగా రాజకీయ చేస్తున్నారన్నారు. కేజీ టు పీజీ ఉచిత విద్య మేనిఫెస్టోలో పెట్టి నేటివరకు ఎక్కడ అమలు చేయలేదన్నారు.

కేసీఆర్! 104 మంది గెలుస్తారా.. జగదీశ్వరే ఓడుతారు

కేసీఆర్! 104 మంది గెలుస్తారా.. జగదీశ్వరే ఓడుతారు

రైతులకు రుణ మాఫీ చేయకపోవడంతో ఆత్మహత్యలు పెరిగాయని రేవంత్ అన్నారు. కేవలం రూ.17 వేల కోట్లను మాత్రమే నాలుగు విడుతలుగా విడుదల చేయడం ద్వారా రైతుల పాస్‌ పుస్తకాలు బ్యాంకుల్లోనే ఉన్నాయన్నారు. కొత్త రుణాలు ఏ ఒక్క రైతుకు ఇచ్చిన పాపాన పోలేదన్నారు. ఇటీవల సీఎం కేసీఆర్‌ రాష్ట్రంలో జరిపిన సర్వేలో 101మంది ఎమ్మెల్యేలు గెలుస్తారని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. సీఎం కేసీఆర్‌ సన్నిహితుడైన మంత్రి జగదీశ్వర్ రెడ్డి సూర్యాపేట నియోజకవర్గంలో గెలిచే పరిస్థితి లేదన్నారు. మంత్రి జగదీశ్వర్ రెడ్డికి ఓడిపోతాననే భయం పట్టుకుందని, సీఎం కేసీఆర్‌ చుట్టూ తిరుగుతూ జపం చేస్తున్నారన్నారు.

పవన్ కళ్యాణ్‌కు రేవంత్ ఆహ్వానం

పవన్ కళ్యాణ్‌కు రేవంత్ ఆహ్వానం

మంత్రి జగదీశ్వర్ రెడ్డి స్వగ్రామంలోనే 76మంది దళితులు భూముల కోసం దరఖాస్తు చేసుకుంటే ఏఒక్కరికి భూమి పంపిణీ చేయలేదని రేవంత్ ఆరోపించారు. కేసీఆర్‌ అసెంబ్లీలో పసుపు చొక్కాలను చూసి భయపడుతున్నారన్నారు. తెలంగాణలో టీడీపీ ప్రచారం కోసం పవన్ కళ్యాణ్‌ను ఆహ్వానిస్తున్నామని తెలిపారు. సీఎం కేసీఆర్‌ పాలనలో నిరుద్యోగులు చిరుద్యోగులుగా మిగిలిపోయారన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+