తెలంగాణలో కాంగ్రెస్ దూకుడు.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా పోరు బాట : నేతలతో రేవంత్ రెడ్డి
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై పోరుకు తెలంగాణ కాంగ్రెస్ సిద్ధమైంది. బీజేపీ, టీఆర్ఎస్ ప్రజలను మోసం చేస్తూ పబ్బం గడుపుకుంటున్నాయని కాంగ్రెస్ నేతలు దుయ్యబట్టారు. ఇద్దరి మధ్య లోపాయికారి ఒప్పందం ఉందని ఆరోపణలు గుప్పించారు. ప్రజా సమస్యలను పక్కదారి పట్టించేందుకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం, రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ రోజుకో కొత్త డ్రామాను తెరపైకి తెస్తున్నారని విమర్శించారు. ధాన్యం కొనుగోలులో ఒకరిపై ఒకరి ఆరోపణలు చేసుకుంటూ తెలంగాణ రైతాంగాన్ని గందరగోళంలోకి నెడుతున్నారని మండిపడ్డారు.

తెలంగాణలో హస్తం దూకుడు..
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలపై మరింత దూకుడుగా వ్యవహరించాలని కాంగ్రెస్ పార్టీ నేతలు నిర్ణయించారు. ఉద్యమ కార్యాచరణలో భాగంగా తెలంగాణ కాంగ్రెస్ నేతల జూమ్ మీటింగ్ జరిగింది. ఈ సమావేశంలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, సీఎల్సీ నేత భట్టి విక్రమార్క, ఎమ్మెల్సీలు జీవన్ రెడ్డి, ఏఐసీసీ కార్యదర్శలు బోసురాజు , శ్రీనివా్ కృష్ణన్ , టీపీసీసీ కార్యవర్గం సభ్యులు, డీసీసీ అధ్యక్షులు పాల్గొన్నారు. భవిష్యత్తు కార్యాచరణపై చర్చించారు. కేసీఆర్ మాయ మాటలను ప్రజలు నమ్మే పరిస్థితి లేదని నేతలు అభిప్రాయం వ్యక్తం చేశారు.

ప్రతి గింజ కొనేవరకు పోరాటం
ఈ సందర్భంగా టీపీసీపీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రజల పక్షాన పోరాటం చేస్తుందన్న విశ్వాసం వారిలో కల్పించాలని పార్టీ శ్రేణులకు నిర్దేశించారు. పెట్రోల్, డీజిల్ , గ్యాస్ ధరల తగ్గించేవరకు పోరాటం చేస్తామని చెప్పారు. ధరల పెరుగుదలతో సామాన్యులు కుదేలవుతున్నారని మండిపడ్డారు. రైతులు పండించిన ప్రతి గింజను కొనుగోలు చేసేవరకు కాంగ్రెస్ పార్టీ పోరాటాలు కొనసాగుతాయని స్పష్టం చేశారు. కేసీఆర్ ప్రభుత్వం విద్యుత్ చార్జీలు పెంపు ప్రజలకు మరింత భారంగా మారిందని దుయ్యబట్టారు.

వరంగల్ కు రాహుల్ గాంధీ రాక
ఇందులో భాగంగా విద్యుత్ చార్జీలు తగ్గించాలని డిమాండ్ చేస్తూ గురువారం విద్యుత్ సౌద, పౌరసరఫరా కార్యాలయల ముట్టడికి తెలంగాణ కాంగ్రెస్ నాయకత్వం పిలుపునిచ్చింది. పెద్ద ఎత్తున పార్టీ శ్రేణులు, కార్యకర్తలు పాల్గొని విజయవంతం చేయాలని సూచించింది. టీఆర్ఎస్ ప్రభుత్వం తమ ఉద్యమాలను, నిరసనలను అడ్డుకుంనేందుకు కుట్రలు చేస్తోందని రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసీలు ఎక్కడ్దుకుంటే అక్కడే రోడ్లపై బైటాయించి, ధర్నాలు చేయాలని నిర్దేశించారు. పోలీస్ స్టేషన్లలో కూడా ఉద్యమాన్ని కొనసాగించాలని స్పష్టం చేశారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఈనెలాఖరున వరంగల్ లో జరిగే కార్యక్రమానికి కాజరుకానున్నారని స్పష్టం చేశారు.
-
ప్రపంచంలో సంతోషకరమైన దేశం ఇదే.. మారిన లెక్కలు.. -
వృషభరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, మకర రాశులకు ఏప్రిల్ 19 నుంచి మాలవ్య రాజయోగం -
కేంద్రీయ విద్యాలయాల్లో అడ్మిషన్ల జాతర! వెంటనే అప్లై చేయండి -
వైసీపీలోకి రీ ఎంట్రీ పై తేల్చేసిన బాలినేని, ఆయన నాయకుడు మాత్రమే కాదు..!! -
చర్లపల్లి నుంచి ఏపీ మీదుగా కొత్త అమృత్ భారత్-హాల్ట్ లు ఇవే, ఆ రోజు నుంచే..! -
LPG కొరత తీవ్రం-కేంద్రం ప్రకటన-వినియోగదారులకు కీలక సూచనలు..! -
రైతు భరోసా నిధుల విడుదల వేళ మరో ట్విస్ట్, కీలక మార్పులు..!! -
మనసు మార్చుకున్న బాలినేని, నెక్స్ట్ ఇక...!? -
పల్నాడు, సింహాద్రి ప్రయాణీకులకు రైల్వే గుడ్ న్యూస్, ఇక నుంచి..!! -
ఇంటర్ ఫలితాల ముహూర్తం ఖరారు : వేసవి సెలవుల పై తాజా ఉత్తర్వులు..!! -
పడింది దెబ్బ: మోత మోగిన పెట్రోల్ ధరలు- లీటర్ కు ఎంత పెరిగిందంటే? -
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం












Click it and Unblock the Notifications