కేసీఆర్ అహం ఎలా దించాలో తెలుసు: అలీ, ఒళ్లు దగ్గర: రేవంత్ హెచ్చరిక
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు బుధవారం సాయంత్రం ప్రెస్ మీట్ సందర్భంగా చేసిన వ్యాఖ్యలపై టిడిపి నేత రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ నేత షబ్బీర్ అలీలు మండిపడ్డారు.
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు బుధవారం సాయంత్రం ప్రెస్ మీట్ సందర్భంగా చేసిన వ్యాఖ్యలపై టిడిపి నేత రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ నేత షబ్బీర్ అలీలు మండిపడ్డారు.
దళితులను మొదటి నుంచి మోసం చేసింది సీఎం కేసీఆరే అన్నారు. ఆయన అహం ఎలా దించాలో తమకు తెలుసునని చెప్పారు.
కేసీఆర్‌కు రాజకీయ జన్మను ఇచ్చిందే కాంగ్రెస్ అన్నారు. అలాంటి వ్యక్తి కాంగ్రెస్ పార్టీపై రాక్షసంగా మాట్లాడుతున్నారన్నారు. మీరా కుమార్‌ను అవమానించింందుకు క్షమాపణ చెప్పాలన్నారు.

కేసీఆర్ తీరు మయసభలో దుర్యోధనుడిలా ఉందని రేవంత్ రెడ్డి ధ్వజమెత్తారు. భూ, ఇసుక మాఫియాలో కేసీఆర్ బంధువులు, తెరాస నేతలే ఉన్నట్లు బయటపడిందన్నారు.
ప్రజలు లారీలు తగులబెట్టినట్లు ఆధారాలుంటే చర్యలు తీసుకోవాలని రేవంత్ అన్నారు. కమ్యూనిస్టులనుద్దేశించి కేసీఆర్ మాట్లాడిన తీరు బాగోలేదన్నారు.
ఇంత అహంభావం సీఎం కేసీఆర్‌కు తగదన్నారు. ప్రతిపక్షాల గురించి మాట్లాడేటప్పుడు ఒళ్లు దగ్గర పెట్టుకోవాలని హెచ్చరించారు. నేరెళ్లలో చనిపోయిన కుటుంబాలకు రూ.10లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారు.












Click it and Unblock the Notifications