పొలిట్‌బ్యూరో షాకింగ్: బాబు రాకకు ముందే రేవంత్‌పై వేటు?

Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: తెలంగాణ టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సిద్ధమవుతున్నట్లు ప్రచారం జరుగుతుండటంతో ఆయనపై వేటు వేసేందుకు సిద్ధమైంది తెలంగాణ టీడీపీ. ఇప్పటికే రేవంత్ ను పదవి నుంచి తొలగించాలని పొలిట్ బ్యూరో తీర్మానించినట్లు సమాచారం.

Revanth Reddy Says Goodbye To TDP రేవంత్‌తో పాటు 25మంది ? | Oneindia Telugu
 అపాయింట్‌మెంట్ వద్దంటూ బాబుకు లేఖ

అపాయింట్‌మెంట్ వద్దంటూ బాబుకు లేఖ

ఈ మేరకు టీడీపీ అధినేత చంద్రబాబునాయుడుకు పొలిట్ బ్యూరో లేఖ రాసింది. పార్టీ గౌరవానికి భంగం కలిగేలా ప్రవర్తించిన రేవంత్ రెడ్డికి అపాయింట్‌మెంట్ కూడా ఇవ్వరాదంటూ లేఖలో కోరింది.

కవిత, జగన్‌‌లతో రేవంత్, కేసీఆర్ భేటీ, ఢిల్లీ చిట్టా విప్పుతా: పయ్యావుల సంచలనం

 టీటీడీపీ తీర్మానం..

టీటీడీపీ తీర్మానం..

కాంగ్రెస్‌లో చేరబోతున్నారనే వార్తలను కూడా రేవంత్ ఇంతవరకు ఖండించలేదని.. అతనిపై కఠిన చర్యలు తీసుకోవాల్సిందేనని పేర్కొన్నట్లు తెలిసింది. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారనే వార్తల నేపథ్యంలో టీటీడీపీ పొలిట్ బ్యూరో ఈ మేరకు తీర్మానించింది.

 చంద్రబాబు రాకకు ముందే..

చంద్రబాబు రాకకు ముందే..

చంద్రబాబు విదేశీ పర్యటన ముగిసేలోగానే రేవంత్‍‌పై వేటు పడవచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అయితే, మరికొందరు నేతలు మాత్రం చంద్రబాబు వచ్చిన తర్వాత ఆయనతో మాట్లాడి చర్యలు తీసుకుంటే మంచిదని అంటుండటం గమనార్హం.

 ఇంకా భరించలేం..

ఇంకా భరించలేం..

ఇటీవల రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనకు వెళ్లిన విషయం తెలిసిందే. ఈ పర్యటనలో కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ సహా ఇతర కాంగ్రెస్ పెద్దలను కలిసినట్లు ప్రచారం జరిగింది. దీంతో కాంగ్రెస్ పార్టీలోకి రేవంత్ వెళ్లడం ఖాయమని తేలిపోయింది. రేవంత్ రెడ్డి కూడా ఈ ప్రచారాన్ని ఖండించకపోవడంతోపాటు ఏపీ నేతలపై తీవ్ర విమర్శలు చేయడంతో ఆయన పార్టీ నుంచి సస్పెండ్ చేయడమే మంచిదని టీటీడీపీ నిర్ణయించింది.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Telugudesam Party sources said that Revanth Reddy should be suspended from party soon.
Please Wait while comments are loading...