"రేవంత్‌కు 99 శాతం బెయిల్ ఇవ్వకూడదు, కానీ ఇస్తారని అనుకున్నాం"

హైదరాబాద్: ఓటుకు నోటు కేసులో ప్రధాన నిందితుడైన తెలంగాణ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే రేవంత్‌ రెడ్డికి మంగళవారం హైకోర్టు బెయిల్‌ ఇవ్వడాన్ని సవాల్‌ చేస్తూ సుప్రీం కోర్టుకు ఆప్పీల్‌కు వెళ్తామని తెలంగాణ అడిషనల్‌ అడ్వకేట్‌ జనరల్‌ రామచందర్‌రావు చెప్పారు. రేవంత్‌ బెయిల్‌పై ఆయన మంగళవారం మీడియా వద్ద స్పందించారు.

ఓటుకు నోటు కేసు ప్రాథమిక దశలో ఉండగానే హైకోర్టు బెయిల్‌ ఇచ్చిందని, చట్టం ప్రకారం 99 శాతం బెయిల్‌ ఇవ్వకూడదని అన్నారు. రూ. 50 లక్షలు ఎక్కడి నుంచి వచ్చాయి, ఇంకా రూ. 4.5 కోట్లు ఎలా తెస్తామన్నారో తేలాల్సి ఉందని రామచందర్‌రావు అన్నారు.

Revanth reddy should not be given bail: Ramachandar Rao

అయితే, రేవంత్ రెడ్డికి బెయిల్ వస్తుందని తాము ముందే ఊహించామని ఆయన అన్నారు. బెయిల్ వస్తుందని ఊహించే ఈ కేసుకు సంబంధించిన పత్రాలను ఇప్పటికే సుప్రీంకోర్టులో ఉన్న తమ న్యాయవాదులకు పంపించామని చెప్పారు. ఈ కేసులో నిందితులకు బెయిల్ మంజూరు చేయడం బాధాకరమని అన్నారు. కేసు విచారణలో ఉండగానే నిందితులకు బెయిల్ ఇవ్వడం సరి కాదని అభిప్రాయపడ్డారు.

ఈ కేసులోని నిందితులను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కాపాడే ప్రయత్నం చేస్తోందని ఆయన విమర్శించారు. ఓటుకు నోటు కేసులో నిందితుడైన మత్తయ్య, సండ్ర వెంకట వీరయ్య విచారణకు సహకరించడం లేదని చెప్పారు. ఈ విషయాన్ని కూడా సుప్రీంకోర్టుకు నివేదిస్తామని చెప్పారు. రేవంత్ రెడ్డికి ఇచ్చిన బెయిల్‌ను రద్దు చేయాలని కోరుతూ రేపు లేదా ఎల్లుండి సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామని ఆయన చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+