Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

కుక్కలకు ఆకలేసి బాలుడిని తిన్నాయా? కు.ని ఆపరేషన్లు చేయిస్తారా? మండిపడిన రేవంత్ రెడ్డి!!

కుక్కలకు ఆకలేసి బాలుడిని తిన్నాయా? కు.ని ఆపరేషన్లు చేయిస్తారా? మెదడెక్కడ ఉంది? అంటూ రేవంత్ రెడ్డి బాలుడిని కుక్కలు చంపేసిన ఘటనపై మండిపడ్డారు.

హైదరాబాద్లో కుక్కల దాడిలో బాలుడు చనిపోయిన ఘటన తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఈ ఘటనపై ప్రతిపక్షాలు అధికార పార్టీని దుమ్మెత్తి పోస్తున్నాయి. తాజాగా టిపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి రాష్ట్రంలో కుక్కల బెడద గురించి, కుక్కల బెడదను అరికట్టడంలో ప్రభుత్వ తీరు గురించి తనదైన శైలిలో మండిపడ్డారు.

నాలుగేళ్ల బాలుడిని కుక్కలు దాడి చేసి చంపిన ఘటనపై రేవంత్ ఫైర్

భూపాలపల్లి నియోజకవర్గంలో హాత్ సే హాత్ జోడో పాదయాత్ర సందర్భంగా స్థానికంగా పర్యటిస్తున్న రేవంత్ రెడ్డి కోటంచ లక్ష్మీ నరసింహ స్వామిని దర్శించుకున్నారు. అనంతరం రాష్ట్రంలోని తాజా పరిణామాలపై మాట్లాడిన ఆయన నాలుగేళ్ల బాలుడిని కుక్కలు దాడి చేసి చంపిన ఘటనపై స్పందించారు. కుక్కల దాడిలో బాలుడు చనిపోతే మానవత్వం లేకుండా ప్రభుత్వం వ్యవహరిస్తుందని రేవంత్ రెడ్డి అసహనం వ్యక్తం చేశారు.

కుక్కలకు ఆకలేసి బాలుడిని తిన్నాయా.. మేయర్ పై మండిపాటు

కుక్కలకు ఆకలేసి బాలుడిని తిన్నాయా.. మేయర్ పై మండిపాటు


కుక్కలకు ఆకలేసి బాలుడిని తిన్నాయని మేయర్ చెబితే, మంత్రి కేటీఆర్ కుక్కలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేయిస్తామని చెబుతున్నారని, చనిపోయిన బాలుడు కుటుంబాన్ని ఆదుకోవాలనే విషయాన్ని మరిచిపోయారని రేవంత్ రెడ్డి మండిపడ్డారు. మేయర్, మంత్రుల వ్యాఖ్యలు చూస్తే వారి ఆలోచనలు ఎలా ఉన్నాయో అర్థం అవుతుందని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. బాలుడు కుటుంబాన్ని పరామర్శించి వారిని ఆదుకోవలసిన మంత్రి కేటీఆర్ ఆ విషయం పక్కనపెట్టారన్నారు.

మంత్రి మెదడు ఎక్కడ ఉందో?

మంత్రి మెదడు ఎక్కడ ఉందో?


కుక్కలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేస్తామని చెప్పడంతో ఆయన మెదడు ఎక్కడ ఉందో అర్థమవుతుందని వ్యాఖ్యానించారు. అంతేకాదు ఇటీవల హైదరాబాద్లో నిర్వహించిన ఫార్ములా ఈ రేసులను దృష్టిలో పెట్టుకుని ఎఫ్ వన్ రేసులపై ఉన్న శ్రద్ధ కుక్కలు పెడితే లేదా అంటూ ప్రశ్నించారు. మంత్రి కేటీఆర్ తక్షణం మృతి చెందిన బాలుడు కుటుంబాలకు క్షమాపణ చెప్పి, ఆ కుటుంబాన్ని పరామర్శించి వారిని ఆదుకోవాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు.

గండ్ర రమణా రెడ్డి అక్రమ దందాలు నిరూపిస్తాం ఇక ఇదే సమయంలో భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణారెడ్డి పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు రేవంత్ రెడ్డి. భూపాలపల్లి లో పామాయిల్ కంపెనీ పేరుతో ఎమ్మెల్యే గండ్ర పేదల భూములను ఆక్రమించుకున్నారని ఆరోపించారు. రేపు భూపాలపల్లి లో పర్యటించే మంత్రి కేటీఆర్ దీనిపైన విచారణకు ఆదేశించాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి, ఆక్రమణలను, అక్రమ దందాను నిరూపించడానికి కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉందని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.

గండ్ర రమణా రెడ్డి అక్రమ దందాలు నిరూపిస్తాం ఇక ఇదే సమయంలో భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణారెడ్డి పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు రేవంత్ రెడ్డి. భూపాలపల్లి లో పామాయిల్ కంపెనీ పేరుతో ఎమ్మెల్యే గండ్ర పేదల భూములను ఆక్రమించుకున్నారని ఆరోపించారు. రేపు భూపాలపల్లి లో పర్యటించే మంత్రి కేటీఆర్ దీనిపైన విచారణకు ఆదేశించాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి, ఆక్రమణలను, అక్రమ దందాను నిరూపించడానికి కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉందని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.

గండ్ర రమణా రెడ్డి అక్రమ దందాలు నిరూపిస్తాం
ఇక ఇదే సమయంలో భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణారెడ్డి పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు రేవంత్ రెడ్డి. భూపాలపల్లి లో పామాయిల్ కంపెనీ పేరుతో ఎమ్మెల్యే గండ్ర పేదల భూములను ఆక్రమించుకున్నారని ఆరోపించారు. రేపు భూపాలపల్లి లో పర్యటించే మంత్రి కేటీఆర్ దీనిపైన విచారణకు ఆదేశించాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి, ఆక్రమణలను, అక్రమ దందాను నిరూపించడానికి కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉందని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+