పవన్! కేసీఆర్ వేలకోట్ల దోపిడీకి బ్రాండ్ అంబాసిడర్‍‌వా, కేటీఆర్ నిన్ను ఏమన్నారు: రేవంత్

Posted By:
Subscribe to Oneindia Telugu
  పవన్! కేసీఆర్ వేలకోట్ల దోపిడీకి నువ్వు బ్రాండ్ అంబాసిడర్‍‌వా ?

  హైదరాబాద్: జనసేన పార్టీ అధ్యక్షులు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌ను ఉపయోగించుకొని ముఖ్యమంత్రి కేసీఆర్ తన దోపిడీని దుర్వినియోగం చేసే ప్రయత్నాలు చేస్తున్నారని కాంగ్రెస్ నేత, కొడంగల్ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి మంగళవారం ఆరోపించారు. ఆయన గాంధీ భవన్లో విలేకరులతో మాట్లాడారు.

  పవన్ కళ్యాణ్ సీఎం కేసీఆర్ దుర్మార్గాన్ని గుర్తించాలని విజ్ఞప్తి చేశారు. పవన్ ద్వారా ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. పవన్‌కు తాను ఓ మాట స్పష్టంగా చెప్పదలుచుకున్నానని, కేసీఆర్ పాల్పడుతున్న వేల కోట్ల దుర్వినియోగానికి మీరు బ్రాండ్ అంబాసిడర్‌గా ఉంటారా అని ప్రశ్నించారు.

  ఒకరికి ఒకరు: కేసీఆర్ కోసం పవన్ కళ్యాణ్ ఎదురుచూపులు

  కిరణ్ కుమార్ రెడ్డి చెప్పింది వాస్తవం

  కిరణ్ కుమార్ రెడ్డి చెప్పింది వాస్తవం

  మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి విద్యుత్ ఇబ్బందులపై మాట్లాడింది వాస్తవమని రేవంత్ రెడ్డి చెప్పారు. విద్యుత్ సంస్థల విభజన జనాభా ప్రాతిపదికన జరగలేదన్నారు. విభజన నేపథ్యంలో తెలంగాణకు ఎక్కువ విద్యుత్ వచ్చిందని చెప్పారు.

  విభజనలో తెలంగాణకు ఎక్కువ విద్యుత్

  విభజనలో తెలంగాణకు ఎక్కువ విద్యుత్

  తెలంగాణ రాష్ట్రం విడిపోయినప్పుడు 6,573 మెగావాట్ల విద్యుత్ సామర్థ్యం తెలంగాణకు ఉందని, కానీ అది సరిపోలేదని రేవంత్ చెప్పారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు 2,050 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి ప్రాజెక్టు పనులను ప్రారంభించిందని చెప్పారు. ఆ సంస్థలు ఇప్పుడు ఉత్పత్తి ప్రారంభించడంతో విద్యుత్ ఇబ్బందులు లేవన్నారు.

  కేంద్రం స్కీం కింద

  కేంద్రం స్కీం కింద

  కేంద్రం 'ఉదయ్' స్కీం కింద తెలంగాణకు కూడా గృహ అవసరాలకు అవసరమైన అదనపు విద్యుత్ ఇస్తోందన్నారు. ఇది కాకుండా టీడీపీ, కాంగ్రెస్ పార్టీలు అధికారంలో ఉన్నప్పుడు వచ్చిన ప్రయివేటు సంస్థలు ఇప్పుడు ప్రారంభమయ్యాయని, దీంతో విద్యుత్ ఇబ్బందులు లేకుండా పోయాయని చెప్పారు.

  ఇదీ మతలబు

  ఇదీ మతలబు

  కేంద్రం ఉదయ్ పేరుతో 19 రాష్ట్రాల్లో విద్యుత్ ఇస్తోందని రేవంత్ రెడ్డి అన్నారు. అందులో తెలంగాణకు వచ్చిందన్నారు. విద్యుత్ ఇబ్బందులు లేకపోవడానికి మతలబు ఉందని, అందుకు టీడీపీ, కాంగ్రెస్ హయాంలలో ఏర్పాటు చేసిన సంస్థలు ఉత్పత్తి ప్రారంభించడం, కేంద్రం ఉదయ్ స్కీం, ప్రయివేటు సంస్థలు.. ఇలాంటి ఎన్నో కారణాలు ఉన్నాయని గుర్తించాలన్నారు.

  కేసీఆర్ అందమైన అబద్దాలకు పవన్ లోనుకావొద్దు

  కేసీఆర్ అందమైన అబద్దాలకు పవన్ లోనుకావొద్దు

  ప్రయివేటు సంస్థల నుంచి ఇష్టారీతిన విద్యుత్ కొనుగోలు చేసి రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్ అని కేసీఆర్ అందమైన అబద్దాలు ఆడుతున్నారని చెప్పారు. ముఖ్యమంత్రి అందమైన అబద్దాలకు పవన్ కళ్యాణ్ లోను కావొద్దన్నారు. కేసీఆర్ చెప్పింది విని, ఆయనను అభినందిస్తూ మాట్లాడటం సరికాదన్నారు.

  పవన్ కళ్యాణ్‌కు అంతా చెప్పాల్సి ఉంది

  పవన్ కళ్యాణ్‌కు అంతా చెప్పాల్సి ఉంది

  మిత్రుడు పవన్ కళ్యాణ్ విషయం తెలుసుకొని మాట్లాడాలని రేవంత్ రెడ్డి అన్నారు. అవసరమైతే కేసీఆర్ మాయలో పడకుండా మిత్రుడు పవన్‌కు సంపూర్ణ సమాచారం ఇవ్వాల్సిన బాధ్యత తమ పైన ఉందని చెప్పారు. 24 గంటల ఉచిత విద్యుత్ పేరుతో కేసీఆర్ మోసం చేస్తున్నారని చెప్పారు.

  పవన్! ఈ పుస్తకం చదువు

  పవన్! ఈ పుస్తకం చదువు

  24 గంటలు విద్యుత్ ఇవ్వాలంటే ఏం చేయాలి, తెలంగాణలో విద్యుత్ అంశాలు తెలుసుకోవాలంటే తాను విద్యుత్ జేఏసీ నేత రఘు రాసిన పుస్తకం పవన్ కళ్యాణ్‌కు పంపిస్తానని రేవంత్ అన్నారు. దానిని చదవాలన్నారు. పవన్‌కు తనకు కామన్ ఫ్రెండ్స్ ఉన్నారని, వారి ద్వారా పుస్తకం పంపిస్తానని చెప్పారు. ఈ పుస్తకం పూర్తిగా చదివి, అవగాహన కల్పించుకోవాలన్నారు. తెలంగాణలో కేసీఆర్ మాయల మత్తులో, మాటల మత్తులో ఊబిలో కూరుకుపోతే తెలంగాణ సమాజానికి నష్టమని పవన్ తెలుసుకోవాలన్నారు. కేసీఆర్ తన దోపిడీకి పవన్‌ను ఉపయోగించుకోవాలనుకుంటున్నారన్నారు. వేల కోట్ల దోపిడీకి బ్రాండ్ అంబాసిడర్‌గా ఉండవద్దన్నారు.

  ట్విట్టర్‌లో కేసీఆర్ ఏం చెప్పారంటే

  ట్విట్టర్‌లో కేసీఆర్ ఏం చెప్పారంటే

  ఇటీవల మంత్రి కేటీఆర్ ట్విట్టర్‌లో స్పందిస్తూ.. పవన్ కళ్యాణ్ గురించి ఒక్క మాటలో చెప్పాలని ఓ నెటిజన్ అడిగితే, ఎనిగ్మా అన్నారని, అంటే అర్థం కాని వ్యక్తి అని రేవంత్ రెడ్డి అన్నారు.
  నాడు రాత్రిపూట విద్యుత్ పైన నేటి మంత్రి ఈటెల రాజేందర్ విమర్శలు గుప్పించారని రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. రాత్రిపూట విద్యుత్ ఇస్తే మోటార్ వద్ద భర్త, ఇంట్లో భార్య ఉంటే వారి సంసారం ఎలా సాగుతుందని కాంగ్రెస్ హయాంలో ఈటెల ప్రశ్నించారన్నారు.

  ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

  English summary
  Congress leader and Kodangal MLA Revanth Reddy takes on KCR and suggested Jana Sena chief Pawan Kalyan.

  Oneindia బ్రేకింగ్ న్యూస్
  రోజంతా తాజా వార్తలను పొందండి