సవాల్ స్వీకరించాలి: రేవంత్ రెడ్డి, నాలుక కోస్తాం: జోగు రామన్న

Posted By:
Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: వచ్చే ఎన్నికల్లో గెలుపుపై కాంగ్రెస్ పార్టీ చేసిన సవాల్‌ను అధికార టీఆర్ఎస్ పార్టీ స్వీకరించాలని కాంగ్రెస్ నేత, కొడంగల్ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి శుక్రవారం డిమాండ్ చేశారు. ఆయన కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డిలో పర్యటిస్తున్నారు.

ఈ సందర్భంగా మాట్లాడారు. కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణకు తీవ్ర అన్యాయం జరిగిందని చెప్పారు. ఇంత జరిగినా ముఖ్యమంత్రి కేసీఆర్ నోరు ఎందుకు మెదపడం లేదో చెప్పాలని ప్రశ్నించారు. తనపై ఉన్న కేసులకు భయపడే ప్రధాని నరేంద్ర మోడీని ప్రశ్నించడం లేదని ఎద్దేవా చేశారు.

Revanth Reddy takes on TRS government

నాలుక కోస్తాం: జోగు రామన్న

కాంగ్రెస్ పార్టీ నేతలు జోకర్లు అని టీఆర్ఎస్ నేత, మంత్రి జోగు రామన్న మండిపడ్డారు. రేవంత్ రెడ్డి పెద్ద జోకర్ అన్నారు. కేసీఆర్, కేటీఆర్‌లను ఏమైనా అంటే నాలుక కోస్తామని హెచ్చరించారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Congress leader and Kodangal MLA Revanth Reddy takes on TRS government.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి