కేసీఆర్ కులాల కుంపటి; బీజేపీ మతాల చిచ్చు; రాష్ట్రంలో గుజరాత్ దేశదిమ్మరులు: రేవంత్ రెడ్డి
ఒకపక్క తెలంగాణ రాష్ట్రంలో జాతీయ సమైక్యత వజ్రోత్సవాలు టిఆర్ఎస్ పార్టీ నిర్వహిస్తుంటే, మరోపక్క కేంద్రంలోని బిజెపి తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహిస్తోంది. ఇక ఇదే సమయంలో గాంధీభవన్లో తెలంగాణ విలీన వేడుకలను నిర్వహించారు కాంగ్రెస్ పార్టీ నాయకులు. టీపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గాంధీభవన్లో తెలంగాణ విలీన దినోత్సవ వేడుకలను నిర్వహించారు. జాతీయ జెండాను ఎగురవేసి తెలంగాణ గీతంగా జయ జయహే తెలంగాణ గీతాన్ని ఆలపించారు. ఈ కార్యక్రమంలో రేవంత్ రెడ్డితో పాటు దామోదర రాజనర్సింహ, శ్రీధర్ బాబు, పొన్నాల లక్ష్మయ్య తదితర కాంగ్రెస్ పార్టీ ప్రముఖులు పాల్గొన్నారు. జవహర్ లాల్ నెహ్రూ, వల్లభాయ్ పటేల్ విగ్రహానికి రేవంత్ రెడ్డి తో పాటు కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతలు నివాళులు అర్పించారు.

దేశాన్ని విభజించేది బీజేపీ.. ఐక్యంగా ఉంచేది కాంగ్రెస్ : రేవంత్ రెడ్డి
ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ టిఆర్ఎస్ ప్రభుత్వాన్ని, బిజెపి ప్రభుత్వాన్ని టార్గెట్ చేశారు. మన దేశంతో పాటు తెలంగాణకు స్వాతంత్రం తీసుకువచ్చింది కాంగ్రెస్ పార్టీనేనని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. కెసిఆర్ పెట్టిన కులాల కుంపటిని బిజెపి అందిపుచ్చుకుని మతాల మధ్య చిచ్చు పెడుతోంది అంటూ రేవంత్ రెడ్డి ఆరోపించారు. దేశాన్ని ఐక్యంగా ఉంచేది కాంగ్రెస్ పార్టీ మాత్రమేనని పేర్కొన్న రేవంత్ రెడ్డి, దేశాన్ని విభజించే పార్టీ బీజేపీ అంటూ ధ్వజమెత్తారు.

కులాల మధ్య, మతాల మధ్య కుంపటి పెడుతున్నారు
కాంగ్రెస్ ముక్త్ భారత్ అని చెబుతున్న వాళ్ళు రాష్ట్రంలో కులాల మధ్య, మతాల మధ్య చిచ్చు పెడుతున్నారని మండిపడ్డారు. గుజరాత్ నుంచి కొంతమంది దేశ దిమ్మరులు హైదరాబాద్ వచ్చారని పేర్కొన్న రేవంత్ రెడ్డి, మోడీ ఆదేశాలతో హైదరాబాద్ వచ్చారా? లేదా మీకు మీరే హైదరాబాద్ వచ్చారా? అంటూ కేంద్ర హోంమంత్రి అమిత్ షా ను టార్గెట్ చేశారు. దేశంలో ప్రజాస్వామ్యాన్ని నెలకొల్పడం కోసం రాహుల్ గాంధీ కన్యాకుమారి నుండి కాశ్మీర్ వరకు పాదయాత్ర చేస్తున్నారని రేవంత్ రెడ్డి ఈ సందర్భంగా పేర్కొన్నారు.

ఎందరో మహానుభావులు వీరోచిత పోరాటాలతో నాటి పెత్తందార్లను తరిమికొట్టారు
విలీన వేడుకల సందర్భంగా రేవంత్ రెడ్డి తెలంగాణ తల్లి విగ్రహ నమూనాను ఆవిష్కరించారు. తెలంగాణ బిడ్డల ఆత్మగౌరవాన్ని ప్రతిబింబించేలా జెండాను తయారు చేస్తామని రేవంత్ రెడ్డి తెలిపారు. తెలంగాణ సాయుధ పోరాటం లో నల్గొండ కీలక పాత్రను పోషించిందని రేవంత్ రెడ్డి వెల్లడించారు. ఎందరో మహానుభావులు తమ వీరోచిత పోరాటాలతో నాటి పెత్తందార్లను తరిమికొట్టారని రేవంత్ రెడ్డి చెప్పారు. హైదరాబాద్ విమోచన కల్పించిన సర్దార్ వల్లభాయ్ పటేల్ కు నివాళి అర్పించే అర్హత బిజెపికి లేదని మండిపడ్డారు.

కేసీఆర్ కి సొంత చరిత్ర రాసుకోవాలనే తాపత్రయం
కెసిఆర్ సొంత చరిత్ర రాసుకోవాలని చూస్తున్నారని రేవంత్ రెడ్డి మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే అందెశ్రీ గేయమైన జయజయహే తెలంగాణా గేయాన్ని రాష్ట్ర అధికారిక గేయంగా మారుస్తామని రేవంత్ రెడ్డి ప్రకటించారు. కెసిఆర్ సృష్టించిన తెలంగాణ తల్లి దొరల కోసమని పేర్కొన్న రేవంత్ రెడ్డి సబ్బండ వర్గాల తెలంగాణా తల్లి నమూనాను విడుదల చేస్తున్నామని పేర్కొన్నారు. రాష్ట్ర జెండాపై సీనియర్ నేతల నుండి సలహాలు తీసుకుని అందరి సలహాలతో జెండాను సిద్ధం చేస్తామని రేవంత్ రెడ్డి తెలియజేశారు.
-
మార్కాపురం ప్రమాద ఘటన: చంద్రబాబు దృష్టికి ప్రమాద కారణం, సీఎం రేవంత్ దిగ్భ్రాంతి! -
Red Alert: వడగళ్ల వాన, రాబోయే రెండు గంటల్లో భారీ వర్షం -
MMTS సర్వీసుల సంఖ్య పెంపు..? సీఎం రేవంత్ గుడ్ న్యూస్..! -
మందుబాబులకు బిగ్ షాక్.. రేపు వైన్ షాప్ లు బంద్.. -
తెలంగాణలో పెట్రోల్, గ్యాస్ కొరత లేదు: క్లారిటీ ఇచ్చిన కమిషనర్! -
ఎల్బీ నగర్ - హయత్ నగర్ డబుల్ డెక్కర్ ఎలివేటెడ్ కారిడార్! -
హైదరాబాద్ లో పెట్రోల్ బంకుల వద్ద అదేం రష్ రా అయ్యా- సిటీలో పెట్రోల్ కొరత? -
ఇకపై రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !!












Click it and Unblock the Notifications