కల్వకుంట్ల రాజ్యంలో పరిపాలనలోనూ మాయమైపోయిన తెలంగాణం: రేవంత్ రెడ్డి వ్యాఖ్యల వెనుక!!

తెలంగాణ సీఎం కేసీఆర్ పైన, కెసిఆర్ కుటుంబ పాలనపైన పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తూనే ఉన్నారు. తాజాగా తెలంగాణ రాష్ట్రంలో పలువురు ఐపీఎస్ లకు బదిలీలతో పాటు పదోన్నతి కల్పించడం పై రేవంత్ రెడ్డి ట్విట్టర్ వేదికగా ఓ పోస్ట్ పెట్టారు. ఐపీఎస్ ల పోస్టింగులలో తెలంగాణ అధికారులకు అన్యాయం జరుగుతుందంటూ రేవంత్ రెడ్డి తన పోస్టు ద్వారా చెప్పే ప్రయత్నం చేశారు.

తెలంగాణాలో పరిపాలనలో మాయమైపోయిన తెలంగాణా: రేవంత్ పోస్ట్

తాజాగా తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ డిజిపితో పాటుగా ఆరుగురు సీనియర్ ఐపీఎస్ లకు కీలక పోస్టింగులు ఇచ్చింది. అయితే అందులో ఒకరు కూడా తెలంగాణ మూలాలు ఉన్న అధికారులు లేరని రేవంత్ రెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు. కల్వకుంట్ల రాజ్యంలో నిన్న పార్టీలోనూ నేడు పరిపాలనలోనూ మాయమైపోయిన తెలంగాణం అంటూ రేవంత్ రెడ్డి ఓ పోస్ట్ పెట్టారు. ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో అధికారాన్ని కొనసాగిస్తున్న గులాబీ పార్టీ లో నాడు తెలంగాణ ఉద్యమంలో కీలకంగా పనిచేసిన నాయకులు ఎవరూ లేరని విమర్శలు గుప్పించిన రేవంత్ రెడ్డి, ఇప్పుడు మళ్లీ పరిపాలన లోను తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ మూలాలు ఉన్న అధికారులు లేరని వ్యాఖ్యలు చేశారు.

తెలంగాణా ఇంచార్జ్ డీజీపీగా అంజనీ కుమార్

తెలంగాణా ఇంచార్జ్ డీజీపీగా అంజనీ కుమార్


తెలంగాణ ఇన్చార్జి డీజీపీగా సీనియర్ ఐపీఎస్ అధికారి అంజనీ కుమార్ ను ప్రభుత్వం నియమించింది. ప్రస్తుతం డిజిపిగా ఉన్న మహేందర్ రెడ్డి ఈనెల 31వ తేదీన పదవీ విరమణ చేయనున్న నేపథ్యంలో అంజనీ కుమార్ కు ఇంఛార్జి డిజిపిగా బాధ్యతలు అప్పగించారు. అంజనీ కుమార్ అవినీతి నిరోధక విభాగం డీజీగా ఉన్నారు. ఆయన జనవరి 1వ తేదీ నుంచి తెలంగాణ ఇన్చార్జి డీజీపీగా విధులు నిర్వహించనున్నారు.

కీలక పదవులు ఇచ్చిన ఐపీఎస్ లు.. తెలంగాణా మూలాలు లేవని రేవంత్ రెడ్డి అసహనం

కీలక పదవులు ఇచ్చిన ఐపీఎస్ లు.. తెలంగాణా మూలాలు లేవని రేవంత్ రెడ్డి అసహనం

ఇక అంజనీకుమార్ స్థానంలో ఏసీబీ డీజీగా రవి గుప్తా నియమితులయ్యారు. సిఐడి అదనపు డిజి గా మహేష్ భగవత్, రాచకొండ సీపీగా డి ఎస్ చౌహాన్, హోం శాఖ ముఖ్యకార్యదర్శిగా జితేందర్, లా అండ్ ఆర్డర్ డీజీగా సంజయ్ కుమార్ జైన్ లను నియమిస్తున్నట్లు ప్రభుత్వం ఉత్తర్వులను ఇచ్చింది. ఈ క్రమంలోనే వీరెవరికీ తెలంగాణ మూలాలు లేవని తెలంగాణ రాష్ట్రంలో స్వపరిపాలన సాగిస్తున్నామని చెబుతున్న సీఎం కేసీఆర్, తెలంగాణ మూలాలు ఉన్న అధికారులకు కీలక పదవులలో స్థానం కల్పించడం లేదని రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+