Revanth Reddy:రేవంత్ సెల్ఫ్ గోల్..సీఎం ఆశలపై నీళ్లు..?
హైదరాబాద్: టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డికి షాకులు మీద షాకులు. తెలంగాణ కాంగ్రెస్ నుంచి దళిత సీఎం నినాదం...ఖంగుతిన్న రేవంత్. ఇదే సమయంలో దళిత వ్యతిరేకిగా సొంత పార్టీ నేతలే ఆరోపణలు.ఇప్పటికే ఆయనపై పలువురు సీనియర్ కాంగ్రెస్ నేతలు అసంతృప్తితో ఉండగా... తాజాగా మరో కాంగ్రెస్ నేత బక్క జడ్సన్ ఏకంగా హైకమాండ్‌కే రేవంత్ పై ఫిర్యాదు చేశారని సమాచారం. ఇంతకీ జడ్సన్ రేవంత్ పై ఫిర్యాదు ఎందుకు చేశారు..?
ఇప్పటికే గ్రూపు రాజకీయాలతో తెలంగాణ కాంగ్రెస్ బలహీనం అవుతోంది. కొందరు సీనియర్ నేతలు రేవంత్ రెడ్డిపై బాహాటంగానే విమర్శలు చేసి పార్టీని వీడి మరో పార్టీ తీర్థం పుచ్చుకుంటున్నారు. కాంగ్రెస్ హైకమాండ్ వద్ద రేవంత్ రెడ్డిపై ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. అయితే హైకమాండ్ నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంపై నేతలు ఒక్కింత నిరాశకు గురవుతున్నారు.

తాజాగా ఆదిలాబాద్ జిల్లా కాంగ్రెస్ నేత బక్క జడ్సన్ టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిని టార్గెట్ చేశారు.ఏప్రిల్ 26వ తేదీన ఆదిలాబాద్‌లో జరిగిన నిరుద్యోగ నిరసన సభలో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఇక్కడే అసలు సమస్య వచ్చింది. రేవంత్ రెడ్డి దళిత సామాజిక వర్గానికి చెందిన నేతలను చిన్న చూపు చూశారంటూ దళిత నేతలు ఆరోపించారు. తమను అవమానించారంటూ మండిపడ్డారు.
సభా స్థలికి చేరుకున్న రేవంత్ రెడ్డి డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విగ్రహానికి పూలమాలలు వేయకపోవడాన్ని దళిత నేతలు తీవ్రంగా తప్పుబట్టారు. రాజ్యాంగ రూపకర్త అంబేడ్కర్ విగ్రహం తన ఎదుటే ఉన్నా... కనీసం పూలమాల వేద్దామన్న ఇంకిత జ్ఞానం రేవంత్ రెడ్డికి లేకపోయిందని ఆగ్రహం వ్యక్తంచేస్తూ స్థానిక అంబేడ్కర్ చౌక్ వద్ద నిరసన తెలిపారు.
అంతేకాదు అక్కడ సభలో వేదికపై లంబాడా సామాజిక వర్గానికి చెందిన కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి నరేష్ జాదవ్‌ను రేవంత్ నెట్టివేయడంపై ఆ సామాజిక వర్గం కూడా గుర్రుగా ఉంది. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇక టీపీసీసీ రాష్ట్ర జనరల్ సెక్రటరీ గండ్రత్ సుజాతా పేరును ప్రస్తావించకపోవడంపై బీసీ వర్గాల వారు కూడా రేవంత్ పై అసంతృప్తి వ్యక్తం చేశారు.
ఈ క్రమంలోనే కాంగ్రెస్ నేత బక్క జడ్సన్ ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు లేఖ రాసినట్లు సమాచారం.లంబాడా సామాజిక వర్గానికి చెందిన కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి నరేష్ జాదవ్‌ను తోసివేశాడని పేర్కొంటూ అందుకు సంబంధించిన వీడియో లింకులను ఖర్గేకు పంపినట్లు ఢిల్లీ వర్గాల సమాచారం.ఈ వీడియో వైరల్ కావడంతో సోషల్ మీడియాలో ట్రోల్స్ పెరిగిపోయాయంటూ ఖర్గే దృష్టికి జడ్సన్ తీసుకొచ్చినట్లు వినికిడి. జరిగిన ఘటనపై విచారణ జరిపి రేవంత్ రెడ్డిపై చర్యలు తీసుకోవాల్సిందిగా లేఖలో కోరినట్లు ఢిల్లీ వర్గాల్లో వార్త ప్రచారంలో ఉంది.
అధికారంలోకి వస్తే దళితుడిని సీఎం చేస్తానని కేసీఆర్ హామీ ఇచ్చారు కానీ తానే సీఎం అయ్యాడు. కేసీఆర్‌ను డిఫెన్స్‌లో పడేసేందుకు కాంగ్రెస్ దళిత సీఎం కార్డు బయటకు తీస్తోంది. తాజా ఎపిసోడ్ రేవంత్‌కు భారీ షాక్‌గా మారనుంది. ఈ సమయంలోనే జడ్సన్ లేఖ ఏఐసీసీకి చేరింది.ఇప్పుడు కాంగ్రెస్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది రేవంత్ క్యాంప్‌లో టెన్షన్ పుట్టిస్తోంది.
-
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్












Click it and Unblock the Notifications