రేవంత్ కు ఢిల్లీ పిలుపు - పదవులపై కొత్త ఫార్ములా, విస్తరణ..!!

తెలంగాణలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 15 నెలలు పూర్తయింది. ఇప్పటి వరకు మంత్రివర్గ విస్తరణ పూర్తి కాలేదు. పార్టీ రాష్ట్ర ఇంచార్జ్ గా మీనాక్షి నటరాజన్ బాధ్యతలు తీసుకున్న తరువాత సమూల ప్రక్షాళన దిశగా నిర్ణయాలు జరుగు తున్నాయి. ఇదే సమయంలో సీఎం రేవంత్ కు ఢిల్లీ నుంచి పిలుపు వచ్చింది. మంత్రివర్గ విస్తరణ కు దాదాపు ముహూర్తం ఖరారైంది. పోస్టుల పై కొత్త ఫార్ములా సిద్దమైంది. ఉగాది వేళ తెలంగాణలో రాజకీయంగా కీలక నియామకాలు జరిగేందుకు కసరత్తు జరుగుతోంది.

ఢిల్లీలో మంత్రాంగం
సీఎం రేవంత్ తో తెలంగాణ కాంగ్రెస్ ముఖ్య నేతలకు అధిష్టానం నుంచి పిలుపు వచ్చింది. దీంతో, ఢిల్లీకి సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి, పీసీసీ చీఫ్ ఈ సాయంత్రం చేరుకోనున్నారు. కేసీ వేణు గోపాల్ తో సమావేశం కానున్నారు. ఇప్పటికే మీనాక్షి నటరాజన్ పార్టీ అధినాయకత్వంతో రాష్ట్రం లో ప్రభుత్వం - పార్టీ పరిస్థితుల పైన చర్చించారు. మంత్రివర్గ విస్తరణ పైన సూత్ర ప్రాయంగా నిర్ణయం తీసుకున్నారు.ఢిల్లీ కేంద్రంగా కీలక మంత్రాంగం కొనసాగుతోంది. ప్రభుత్వంలో మంత్రివర్గ విస్తరణ.. పీసీసీ కొత్త కార్యవర్గం.. నామినేటెడ్ పోస్టుల భర్తీకి తాజా పర్యటనలో రేవంత్ కు గ్రీన్ సిగ్నల్ వస్తుందని చెబుతున్నారు.

కొత్త ఫార్ములా
మంత్రి పదవుల ఖరారు పైన కొత్త ఫార్ములా అమలు చేస్తోంది. అందులో భాగంగా పార్టీ నేతలకు కీలక సూచనలు చేసింది. హైకమాండ్ తాజాగా చోటు చేసుకుంటున్న పరిణామాల పైన ఆరా తీసినట్లు సమాచారం. స్థానిక సంస్థల ఎన్నికలు.. హామీల అమలు గురించి చర్చకు వచ్చినట్లు తెలుస్తోంది. ఇదే సమయంలో మంత్రివర్గం విస్తరణ కోసం ఆశావాహులు చాలా కాలంగా నిరీక్షిస్తున్న విషయం పైన చర్చ జరిగింది. ఇప్పటికే మంత్రివర్గ విస్తరణ.. పదవుల పైన ఢిల్లీ నేతలు ప్రతిపాదనలు కోరగా రాష్ట్ర నేతలు సమర్పించారు. ఇప్పుడు ఆ పేర్ల పైన సామాజిక - ప్రాంతీయ సమీకరణాలతో కూర్పు దిశగా కసరత్తు జరుగుతోంది. రేవంత్ రెడ్డి క్యాబినేట్ లో ముస్లిమ్ మైనారిటీ వర్గం నుంచి ఎవరు ఆమాత్యులుగా లేరు. ఈ సారి మంత్రివర్గంలో మైనారిటీ వర్గం నుంచి ఒకరికి మంత్రి పదవి దక్ ఛాన్స్ కనిపిస్తోంది.

Take a Poll

revanth-to-meet-kc-venu-gopal-to-take-decision-on-cabinet-expansion-and-nominated-posts

ఉగాదికి విస్తరణ
అదే విధంగా ఎస్సీ ల నుంచి మాల, మరో రెడ్డితో పాటు ఒక బీసీలకు దక్కే అవకాశాలు ఉన్నాయి. బీసీ వర్గానికి డిప్యూటీ సీఎం అంశం ప్రస్తుతం తెర మీదకు వచ్చింది. ఇక, పీసీసీ కార్యవర్గం కూర్పులోనూ హైకమాండ్ అభిప్రాయ సేకరణ చేస్తోంది. వర్కింగ్ ప్రెసిడెం ట్స్ నియామకంలో మైనార్టీ- ఎస్సీ- ఎస్టీ సమీకరణం పరిగణలోకి తీసుకుంటున్నట్లు సమాచారం. నామినేటెడ్ పెండింగ్ పదవులను ఖరారు చేయాలని రేవంత్ భావిస్తున్నారు. ఉగాదికి మంత్రివర్గ విస్తరణ ఖాయమని చెబుతున్నారు. దీంతో, ఈ రోజు ఢిల్లీలో పార్టీ అధినాయకత్వంతో జరుగుతున్న మంత్రాంగం పార్టీ - కేబినెట్ లో కీలక నిర్ణయాలు తీసుకునే ఛాన్స్ ఉందని సమాచారం.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+