రివెంజ్ టైమ్: కవితను టార్గెట్ చెయ్యటం వెనుక కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మతలబు ఇదే!!
కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి.. తెలంగాణ రాజకీయాలలో ఈ పేరు తెలియని వారుండరు. మునుగోడు ఉప ఎన్నికలు బిజెపి నుండి అభ్యర్థిగా బరిలోకి దిగి, సీఎం కేసీఆర్ ను టెన్షన్ పెట్టి, గులాబి నేతలకు గట్టిపోటీ ఇచ్చి ఓటమిపాలైన నాయకుడు. మునుగోడు ఉప ఎన్నిక సమయంలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ని టార్గెట్ చేసిన గులాబీ నేతలు ఓ రేంజ్ లో ఆడుకున్నారు. ఇక తనను టార్గెట్ చేసి తీవ్ర ఇబ్బందులకు గురి చేసిన సందర్భాలను గుర్తు చేసుకుంటున్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఇప్పుడు రివెంజ్ తీర్చుకునే పనిలో పడ్డారు. కెసిఆర్ ఫ్యామిలీ లోని కెసిఆర్ కూతురు కవిత ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో ఉన్నారని తనదైన శైలిలో ఆయన టార్గెట్ చేస్తున్నారు.

మునుగోడు ఉప ఎన్నిక ప్రచారం సమయంలో కోమటిరెడ్డిని టార్గెట్ చేసిన గులాబీ నేతలు
మునుగోడు ఉపఎన్నిక సమయంలో, ఉప ఎన్నిక ప్రచారం ప్రారంభమైన నాటి నుండి చివరి వరకు కోమటిరెడ్డిరాజగోపాల్ రెడ్డిని గులాబీ నేతలు టార్గెట్ చేశారు. 18 వేల కోట్ల కాంట్రాక్టులకు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బిజెపికి అమ్ముడు పోయాడని, అందుకే బీజేపీలో చేరారు అంటూ రాజగోపాల్ రెడ్డి ని టార్గెట్ చేశారు. నియోజకవర్గ వ్యాప్తంగా అనేకమార్లు పోస్టర్లు వేశారు.కాంట్రాక్టు పేఅంటూ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని పదే పదే విమర్శించారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆ సమయంలో జరుగుతున్న ప్రచారాన్ని ఎదుర్కోవడం ఆయనను మానసికంగా చాలా ఇబ్బందికి గురి చేసింది.
గులాబీనేతలు ఇచ్చింది తిరిగి ఇచ్చేస్తున్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి
ఇక ఇప్పుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కి గులాబీ నేతలు ఇచ్చింది తిరిగి ఇచ్చే అవకాశం వచ్చింది. కెసిఆర్ కూతురు ఎమ్మెల్సీ కవిత లిక్కర్ కుంభకోణంలో ఇరుక్కుపోవడంతో లిక్కర్ కుంభకోణంలో కవితను టార్గెట్ చేస్తూ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రివెంజ్ తీర్చుకునే పనిలో పడ్డారు. నిన్నటికి నిన్న ఈడీ చార్జిషీట్ లో ఇరవై ఎనిమిది సార్లు లిక్కర్ క్వీన్ కవిత పేరు ఉందని సోషల్ మీడియా వేదికగా పోస్ట్ పెట్టిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కి, ఎమ్మెల్సీ కవిత రాజగోపాల్ అన్న తొందరపడకు.. మాట జారకు 28 సార్లు నా పేరు చెప్పించినా.. 28 వేల సార్లు నా పేరు చెప్పించినా అబద్ధం నిజం కాదు అంటూ సమాధానమిచ్చారు. అయినా వదిలిపెట్టని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కవిత ను టార్గెట్ చేయడం వెనుక ఉన్న అసలు కారణాన్ని చెబుతూ మరోమారు సంచలన వ్యాఖ్యలు చేశారు.

అవినీతిమయమైన మీ కుటుంబం జైలుకు వెళ్ళక తప్పదు
నిజం నిప్పులాంటిది చెల్లెమ్మ. నువ్వు లిక్కర్ స్కాం లో ఉన్నది నిజం, జైలుకి వెళ్లడం ఖాయం అంటూ వ్యాఖ్యలు చేసిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, నిన్ను మీ అన్న, మీ నాయనా ఎవ్వరుకాపాడలేరు అని పేర్కొన్నారు. మునుగోడు ఉప ఎన్నికలలో నన్ను రాజకీయంగా ఎదుర్కోలేక ట్విట్టర్ టిల్లు కేటీఆర్, ఇంకా మీ టిఆర్ఎస్ నాయకులు పారదర్శకరంగాటెండర్ ద్వారా వచ్చిన 18000 కోట్లకోల్ బ్లాక్ టెండర్ విషయం లో నా పై విష ప్రచారం చేసి నా వ్యక్తిత్వాన్నిదెబ్బతీసినందుకు రాబోయే రోజుల్లో అవినీతి మయమైన మీ కుటుంబం అంతా జైలు కి వెళ్లడం ఖాయం అంటూ తనదైన శైలిలో మళ్లీ కవితను టార్గెట్ చేశారు.

తన వ్యక్తిత్వాన్ని దెబ్బతీసేలా విష ప్రచారం చేసింది మర్చిపోయారా? ఇది రివెంజ్ టైమ్
ఇక కవిత ని టార్గెట్ చేయడం వెనుక కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తన వ్యక్తిత్వాన్ని దెబ్బతీసేలా విష ప్రచారం చేశారని, ఇక ఇప్పుడు తనకు అవకాశం వచ్చింది అన్నట్టుగా వ్యాఖ్యలు చేయడం ఆసక్తికరంగా మారింది. మొత్తానికి రివెంజ్ తీర్చుకునే పనిలో బిజీగా ఉన్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ముందు కెసిఆర్ ఫ్యామిలీ ని ఏవిధంగా టార్గెట్ చేయబోతున్నారు అన్నది తెలియాల్సి ఉంది.
-
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
విజయ్ సంచలనం.. టీవీకే అభ్యర్థుల ఫుల్ జాబితా విడుదల.. -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
India Post GDS 2nd merit list 2026: పోస్టల్ జాబ్స్ సెకండ్ మెరిట్ లిస్ట్ పై అప్డేట్..!












Click it and Unblock the Notifications