ఎల్ఆర్ఎస్‌పై మంత్రి పొంగులేటి కీలక ఆదేశాలు
కొత్త రెవెన్యూ చట్టాన్ని తీసుకురాబోతున్నామన్నారు ఆ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. శనివారం లేఅవుట్ రెగ్యులరైజేషన్‌పై కలెక్టర్లతో రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. రాష్ట్రంలో నాలుగేళ్లుగా పెండింగ్‌లో ఉన్న లే అవుట్ రెగ్యులరైజేషన్ (ఎల్ఆర్‌ఎస్) ప్రక్రియను మూడు నెలల్లో పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. భూపాలపల్లి పర్యటనలో ఉన్న రెవెన్యూ మంత్రి శ్రీనివాస్ రెడ్డి అక్కడి కలెక్టరేట్ నుంచి జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
నిబంధనలకు లోబడి ఎల్‌ఆర్‌ఎస్ దరఖాస్తులను క్రమబద్ధీకరించాలని, ప్రభుత్వ భూములను పరిరక్షించాల్సి ఉందని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ దరఖాస్తుదారుల పరిష్కారం కోసం నాలుగేళ్లుగా వేచిచూస్తున్నట్లు తెలిపారు. వీటి పరిష్కారం కోసం అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని కలెక్టర్లను మంత్రి ఆదేశించారు.

నిబంధనలను దృష్టిలో ఉంచుకుని భూముల క్రమబద్ధీకరణలో అక్రమాలకు తావులేకుండా ఎల్ఆర్ఎస్ ప్రక్రియను మూడు నెలల్లో పూర్తి చేయాలని అధికారులకు మంత్రి స్పష్టం చేశారు. ఈ ప్రభుత్వం మీద ప్రజలు ఎన్నో ఆశలు పెట్టుకున్నారని.. దళారుల ప్రమేయం లేకుండా సాధారణ ప్రజానీకానికి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని మంత్రి పొంగులేటి సూచించారు.
కాగా, గత ప్రభుత్వం 2020 ఆగస్టు 31 నుంచి అక్టోబర్ 31 వరకు ఎల్ఆర్ఎస్ దరఖాస్తులను తీసుకుంది. అప్పట్లో 25.70 లక్షలు రాగా అందులో హెచ్‌ఎండీఏ పరిధిలో 3.58 లక్షలు, జీహెచ్‌ఎంసీ పరిధిలో 1.06 లక్షలు, మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీల పరిధిలో 13.69 లక్షలు, గ్రామ పంచాయతీల్లో 6లక్షలు, అర్బన్ డెవలప్మెంట్ అథారిటి పరిధిలో 1.35లక్షలు లెక్కన ఉన్నట్లు తెలుస్తోంది.
ఈ నేపథ్యంలో మూడు నెలల్లో ఎల్ఆర్ఎస్ దరఖాస్తులను పరిశీలించి అర్హమైన వాటిని క్రమబద్ధీకరించాలని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయించింది. ఆగస్టు మొదటి వారం నుంచే ఈ ప్రక్రియ ప్రారంభించాలని అధికారులను ఆదేశించింది. ఈ మేరకు పురపాలకశాఖ ముఖ్యకార్యదర్శి మార్గదర్శకాలను జారీచేశారు. ప్లాట్ల అప్లికేషన్లను మూడు దశల్లో, లేఅవుట్ల దరఖాస్తులను నాలుగు దశల్లో పరిశీలించాలని మార్గదర్శకాల్లో పేర్కొన్నారు. అనంతరం వాటిలో అర్హమైన వాటిని నిర్ణీత ఫీజులు వసూలు చేసి క్రమబద్ధీకరించడం జరుగుతుంది.












Click it and Unblock the Notifications