చీరెల దొంగపై పిడి యాక్టా? విజయ్ మాల్యా ఎంజాయి చేస్తున్నారన్న సుప్రీంకోర్టు

వందల కోట్ల రూపాయాలను అప్పులు తీసుకొని ఎగ్గొట్టినవారంతా తమ జీవితాన్ని ఎంజాయి చేస్తున్నారని, చీరల దొంగతనం చేసిన వ్యక్తిపై పిడి యాక్ట్ పెట్టడాన్ని సుప్రీం కోర్టు తప్పుబట్టింది.

హైదరాబాద్:వందల కోట్ల రూపాయాలను అప్పులు తీసుకొని ఎగ్గొట్టినవారంతా తమ జీవితాన్ని ఎంజాయి చేస్తున్నారని, చీరల దొంగతనం చేసిన వ్యక్తిపై పిడి యాక్ట్ పెట్టడాన్ని సుప్రీం కోర్టు తప్పుబట్టింది. ఈ కేసు ను బుదవారం నాడు విచారణ చేపట్టనుంది సుప్రీంకోర్టు.

సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ జెఎస్ కెహర్ , జస్టిస్ డివై చద్రచూడ్, సంజయ్ కిషన్ కౌల్ బెంచ్ సోమవారం నాడు తెలంగాణ ప్రభుత్వ తీరును తప్పుబట్టింది.

Rich thieves roam free, poor detained: Supreme Court to Telangana Govt

వందల కోట్లు బ్యాంకుల నుండి అప్పు తీసుకొన్న విజయ్ మాల్యా ఇతర దేశాల్లో ఎంజాయ్ చేస్తున్నాడు. అయితే ఐదు చీరలను దొంగిలించనందుకుగాను అయిలయ్య అనే వ్యక్తిపై పిడి యాక్ట్ ను పెట్టి ఏడాది పాటు జైల్లో నిర్బందించడం సమంజసమా అని సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ జెఎస్ కెహెర్ నేతృత్వంలోని బెంచ్ అభిప్రాయపడింది.

ఈ కేసుకు సంబందించిన తదుపరి విచారణను బుదవారం నాటికి వాయిదావేసింది కోర్టు.అయిలయ్య సతీమణి పిడి యాక్ట్ ను చాలెంజ్ చేస్తూ సుప్రీం కోర్టును ఆశ్రయించింది. అయిలయ్య ఐదు చీరెలు దొంగతనం చేశాడనే నేరారోపణకు సంబందించి రుజువులు లేవని ఆయన లాయర్ వాదించాడు.

పిడి యాక్ట్ అనేది డెకాయిట్లకు, గూండాలకు, అమ్మాయిలను అక్రమంగా తరలించేవారికి, భూ కబ్జాదారులపై బనాయిస్తారు.కాని, ఐదు చీరెలు దొంగిలించాడనే ఆరోపణలపై 2016 మార్చి 19వ, తేదిన పిడి యాక్ట్ ను బనాయించారు.

అయితే అయిలయ్య ఆరు మాసాల్లో ఐదు చీరెల దొంగతనాలు చేశాడని తెలంగాణ ప్రభుత్వం చెబుతోంది. అయితే పిడి యాక్ట్ బనాయించాలని రిటైర్డ్ జడ్జి నేతృత్వంలోని అడ్వైజరీ బోర్డు సలహ మేరకే అయిలయ్యపై పిడి యాక్ట్ ను బనాయించినట్టుగా తెలంగాణ ప్రభుత్వం చెబుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+