చీరకట్టులో పీవీ సింధు: లాల్‌దర్వాజ అమ్మవారికి మొక్కులు
హైదరాబాద్: రియో ఒలింపిక్స్‌లో భారత్‌కు రజత పతకం సాధించిన తెలుగు తేజం పీవీ సింధు శనివారం ఉదయం నగరంలోని లాల్‌దర్వాజ మహంకాళి అమ్మవారిని దర్శించుకున్నారు. కుటుంబ సభ్యులతో ఆలయం వద్దకు చేరుకున్న సింధు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకుంది.

చీరకట్టులో అచ్చమైన పదహారణాల తెలుగింటి అమ్మాయిలా ముస్తాబై తన తల్లితో కలసి ఆలయానికి వచ్చిన సింధు, తలపై పళ్లెంలో అమ్మవారికి పట్టుబట్టలను తీసుకువచ్చింది. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన సింధు ప్రతి ఏటా మహంకాళి అమ్మవారిని దర్శించుకుంటానని, ఒలింపిక్స్‌కు వెళ్లే ముందు అమ్మవారిని దర్శించుకున్నానని తెలిపింది.
రియోలో మెడల్ సాధిస్తే మరోసారి వస్తానని మొక్కుకున్నాని తెలిపారు. మెడల్ సాధించడంతో తిరిగి అమ్మవారి ఆశీస్సులు తీసుకోవాడనికి కుటుంబ సమేతంగా అమ్మవారిని దర్శించుకున్నాని తెలిపారు. తల్లి ఆశీస్సులు తనకు ఎప్పుడు మెండుగా ఉండాలని, మళ్లీ మళ్లీ ఇక్కడికి వస్తానని చెప్పారు. ఒలింపిక్స్‌కు వెళ్లే ముందు సింధు అమ్మవారికి బంగారు బోనం సమర్పించింది.
-
Red Alert: వడగళ్ల వాన, రాబోయే రెండు గంటల్లో భారీ వర్షం -
ఎల్బీ నగర్ - హయత్ నగర్ డబుల్ డెక్కర్ ఎలివేటెడ్ కారిడార్! -
హైదరాబాద్ లో పెట్రోల్ బంకుల వద్ద అదేం రష్ రా అయ్యా- సిటీలో పెట్రోల్ కొరత? -
హైదరాబాద్ To బ్యాంకాక్.. తక్కువ ధరకే ఫారిన్ టూర్.. బీచ్ లో చిల్ అవుతూ.. -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
శర్వానంద్ 'బైకర్' ఫస్ట్ రివ్యూ.. దేశంలోనే తొలి ప్రయత్నం.. -
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్












Click it and Unblock the Notifications