కాంగ్రెస్ సమావేశం రసాభాస: వీహెచ్‌పైకి ఆదాం సంతోష్ వర్గీయులు
హైదరాబాద్: సికింద్రాబాద్ అసెంబ్లీ నియోజక వర్గంలో జరిగిన కాంగ్రెస్ సమావేశం రసాభాసగా మారింది. ఈ సమావేశంలో మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ కుమారుడు మాట్లాడుతుండగా రాజ్యసభ సభ్యుడు, సీనియర్ నేత వి. హనుమంతురావు అడ్డుకున్నారు.
దీంతో స్ధానిక కాంగ్రెస్ కార్యకర్తల నుంచి వి. హనుమంతురావుకి చుక్కెదురైంది. వీహెచ్ తీరుని నిరసిస్తూ ఆదాం సంతోష్ వర్గీయులు వి. హనుమంతురావుపైకి దూసుకెళ్లేందుకు ప్రయత్నించారు. ఈ సంఘటనతో సమావేశానికి హాజరైన కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు షాక్ తిన్నారు.

ఇరు వర్గాల మధ్య కాసేపు రసాభాస నెలకొంది. ఈ ఘటన తెలంగాణ పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, అసెంబ్లీ ప్రతిపక్ష నేత జానారెడ్డిల సమక్షంలోనే చోటు చేసుకోవడం గమనార్హం. ఊహించని విధంగా ఈ సమావేశం రసాభాసగా మారడంతో నాయకలు సర్ది చెప్పారు.












Click it and Unblock the Notifications