వైద్యం కోసం వస్తే భర్తకు మత్తు మందు ఇచ్చి భార్యపై అత్యాచారం
హైదరాబాద్: వైద్యో నారాయణో హరి అన్నారు మన పెద్దలు. అలాంటి పవిత్రమైన వైద్య వృత్తికే మచ్చ తెచ్చే విధంగా ప్రవర్తించాడో వైద్యుడు. వైద్యం కోసం తన వద్దకు వచ్చిన వివాహితపై ఓ ఆర్‌ఎంపీ అత్యాచారానికి ఒడిగట్టాడు. ఈ సంఘటన వరంగల్ జిల్లా మరిపెడ మండల కేంద్రంలో గురువారం రాత్రి వెలుగుచూసింది.
వివరాల్లోకి వెళితే... ఖమ్మం జిల్లా తిరుమలాయపాలం మండలం కాకరవాయి శివారు తేనెకుంట తండాకు చెందిన దంపతులు పిల్లలు పుట్టకపోవడంతో మండల కేంద్రంలోని ఆర్‌ఎంపీ వద్దకు వచ్చారు. బుధవారం వారిద్దరికి పరీక్షలు నిర్వహించిన వైద్యుడు తిరిగ గురువారం వారిద్దరిని మరోసారి రమ్మన్నాడు.

దీంతో భార్య భర్తలిద్దరు గురువారం సాయంత్రం ఆసుపత్రికి వచ్చారు. దీంతో సదరు వైద్యుడు వారిద్దరిని వేరు వేరు గదుల్లో ఉంచి వైద్య పరీక్షలు నిర్వహించాలని చెప్పిన వైద్యుడు ఓ గదిలోకి తీసుకెళ్లి ట్రీట్‌మెంట్‌లో భాగమని యువకుడికి మత్తు ఇంజక్షన్ ఇచ్చాడు.
అతడి భార్యకు కూడా మత్తు మందు ఇచ్చి ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. అనంతరం అక్కడి నుంచి పారిపోయాడు. కొద్దిసేపటి తర్వాత ఆమె తనపై అత్యాచారం జరిగిందని గుర్తించింది. ఈ విషయాన్ని భర్తతో పాటు కుటుంబ సభ్యులకు తెలిపింది. దీంతో ఆమె కుటుంబ సభ్యులు వైద్యుడు మోహన్‌కు దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు.
దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.












Click it and Unblock the Notifications