Accident: డివైడర్‍ను ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు.. పలువురికి గాయాలు..
సూర్యాపేట జిల్లా కొర్లపాడు టోల్ ప్లాజా వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ఆర్టీసీ డీలక్స్ బస్సు టోల్ ప్లాజా డివైడర్ ను ఢీకొట్టింది. ఈ ఘటనలో డ్రైవర్ తో 12 మంది గాయపడ్డారు. వారిని వెంటనే ఏరియా ఆస్పత్రికి తరలించారు. ఆ తర్వాత హైదరాబాద్ తలించారు. మణుగూరు డిపోకు చెందిన డీలక్స్ బస్సు మణుగూరు నుంచి హైదరాబాద్ బయల్దేరింది. సోమవారం రాత్రి 8 గంటల 40 నిమిషాలకు కొర్లపాడు టోల్ ప్లాజా వద్ద రాగానే డివైడర్ ను ఢీకట్టింది. ప్రయాణికులు సూర్యాపేట బస్సు డీపోకు సమాచారం ఇవ్వగా.. మరో డ్రైవర్ వచ్చి బస్సును హైదరాబాద్ కు తీసుకొచ్చారు.
టోల్ ప్లాజా డివైడర్ కు ఉన్నట్లు ఎలాంటి సూచిక లేదు... కనీసం రేడియం స్టిక్కర్లు కూడా అతికించలేదు. డ్రైవర్ కు డివైడర్ కనబడగా ఢీకొట్టినట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై పోలీసులు ఎలాంటి ఫిర్యాదు అందలేదు. ప్రమాదం సమయంలో భారీ శబ్దం వచ్చినట్లు చెబుతున్నారు. ప్రమాదం తర్వాత ఆర్టీసీ అధికారులు సకాలంపో స్పందించారని చెప్పారు. వారం క్రితం కరీంనగర్-వరంగల్ జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది.

శంకరపట్నం మండలం తడికల్ వద్ద ఆర్టీసీ బస్సును లారీ ఢీకొట్టింది. వరంగల్ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు.. హుజూరాబాద్ నుంచి కరీంనగర్ వైపు వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ప్రమాద సమయంలో బస్సులో 46 మంది ప్రయాణికులు ఉన్నారు. గాయపడ్డిన వారిన ఆస్పత్రికి తరలించారు. బస్సు డ్రైవర్ అప్రమత్తతో వ్యవహరించడంతో పెద్ద ప్రమాదం తప్పిందని ప్రయాణికులు చెబుతున్నారు. కేసు నమోదు చేసుకున్న విచారణ జరుపుతున్నారు.












Click it and Unblock the Notifications