అమానుషం, టివిఎస్ ను ఢీకొట్టి రెండు కిలోమీటర్ల పాటు మహిళ మృతదేహన్ని ఈడ్చుకెళ్ళారు
మహాబూబ్ నగర్ జిల్లా అడ్డాకులవద్ద కారు, టివిఎస్ ను ఢీకొట్టిన ప్రమాదంలో మహేశ్వరమ్మ అనే మహిళ చనిపోగా, ఆమె భర్త సిద్దిలింగం చావుబతుకుల మద్య కొట్టుమిట్టాడుతున్నారు. టివిఎస్ పై కూతురు ఇంటికి వెళ్తుండగా వె
మహబూబ్ నగర్ :మహబూబ్ నగర్ జిల్లాలో జరిగిన ప్రమాదంలో మహిళ మృతిచెందగా, ఆమె భర్త చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నాడు. ఓ కారు డ్రైవర్ అజాగ్రత్తగా కారు నడపడంతో ఈ ప్రమాదం చోటుచేసుకొంది. మూడు కిలోమీటర్ల దూరం మహిళ మృతదేహన్ని కారు ఈడ్చుకెళ్ళింది. స్థానికులు వెంబడించడంతో నిందితులు కారును వదిలి పారిపోయారు.
మహబూబ్ నగర్ జిల్లా అడ్డాకుల శివారులో జరిగిన ప్రమాదంలో మహిళ చనిపోయింది. ఆమె మృతదేహన్ని కారు సుమారు మూడు కిలోమీటర్లపాటు ఈడ్చుకెళ్ళింది. అయినా నిందితులు అలానే వెళ్ళిపోతుండడంతో స్థానికులు వారిని వెంబడించి పట్టుకొన్నారు.

మహబూబ్ నగర్ రూరల్ మండలానికి చెందిన గాజులపేట గ్రామానికి చెందిన తూర్పు మహేశ్వరమ్మ, సిద్ది లింగం దంపతులు వనపర్తిలో ఉన్న తన కూతురు ఇంటికి టివిఎస్ మోపెడ్ పై వెళ్థున్నారు. అయితే అడ్డాకుల దాటగానే వీరు ప్రయాణిస్తున్న టివిఎస్ ను వెనుక నుండి కారు ఢీకొట్టింది.
వేగంగా ఉన్న కారు టివిఎస్ ను ఢీకొట్టడంతో టివిఎస్ వెనుక కూర్చొన్న మహేశ్వరమ్మ కారు ముందు భాగంలో చిక్కుకుపోయింది. సుమారు రెండు కిలోమీటర్ల దూరం వెళ్ళిన తర్వాత కూడ కారు డ్రైవర్ విషయాన్ని గుర్తించలేదు. దీంతో స్థానికులు కారును వెంబడించారు. కారును వెంబడించడంతో నిందితులు కారును వదిలి పారిపోయారు.
ఈ ఘటనలో మహేశ్వరమ్మ అక్కడికక్కడే చనిపోగా, సిద్ది లింగం చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నారు.ఆయనను మహబూబ్ నగర్ ఆసుపత్రికితరలించారు.












Click it and Unblock the Notifications