గంటల్లో పెళ్లి: రోడ్డు ప్రమాదంలో వరుడితో సహా నలుగురి మృతి

Subscribe to Oneindia Telugu

సూర్యాపేట: మరికొద్ది గంటల్లో బంధు, మిత్రుల సమక్షంలో పెళ్లి పీటలెక్కాల్సిన ఆ పెళ్లి కొడుకును రోడ్డు ప్రమాదం రూపంలో వచ్చిన మృత్యువు తనవెంట తీసుకెళ్లింది. అతనితోపాటు మరో నలుగురు కూడా ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఎంతో సంబరంగా ఉండాల్సిన పెళ్ళి మండటం, నవవధువు, వరుడి కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

ఈ పెను విషాద ఘటన సూర్యాపేట జిల్లా మోతె మండల కేంద్రంలోని పెట్రోలు బంక్‌ సమీపంలో బుధవారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్‌లోని కూకట్‌పల్లి నుంచి ఖమ్మం జిల్లా చర్ల మండలానికి వస్తున్న పెళ్లి వాహనం విశ్రాంతి నిమిత్తం మార్గ మధ్యలో ఆగింది.

groom dead

ఇదే సమయంలో వెనుక నుంచి వస్తున్న లారీ వీరి వాహనాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో పెళ్లికొడుకు వెంకట శేషసాయినాథ్‌(21), అతని బంధువు దామోదర్‌రావు(35), అక్క‌డిక‌క్క‌డే ప్రాణాలు కోల్పోగా, స‌త్య‌నారాయ‌ణ‌(70), అఖిల్‌(2)లు ఆస్పత్రికి త‌ర‌లిస్తుండ‌గా మృతిచెందారు.

ఈ ఘటనలో గాయపడిన మరో 10మందిని సూర్యాపేటలోని ఆస్పత్రికి తరలించారు. బుధవారం రాత్రి 11 గంటలకు పెళ్లి జరగనున్న నేపథ్యంలో ఈ రోడ్డు ప్రమాదం రెండు కుటుంబాల్లో పెను విషాదాన్ని నింపింది.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
A groom and four others killed in road accident, which is occurred at Mothe in Suryapet district.
Please Wait while comments are loading...