హైదరాబాద్ లో ఘోర రోడ్డు ప్రమాదం: ఇద్దరు విద్యార్థులు స్పాట్ డెడ్

నగరంలోని బోయినపల్లి తాడ్ బండ్ చౌరస్తా వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బైక్ మీద వెళుతున్న ముగ్గురు యువకులు అదుపుతప్పి లారీ కింద పడిపోగా, వారిలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు.

హైదరాబాద్: నగరంలోని బోయినపల్లి తాడ్ బండ్ చౌరస్తా వద్ద ఘోర రోడ్డు ప్రమాదం

జరిగింది. బాలానగర్ వైపు వెళ్ళే ముస్లిం మతస్థుల స్మశానం మలుపు సమీపంలో ఈ

దుర్ఘటన చోటు చేసుకుంది.

అమితమైన వేగంతో దూసుకొచ్చిన బైక్ ఒక్కసారిగా అదుపు డివైడర్ ను ఢీకొనడంతో

బైక్ పై ప్రయాణిస్తున్న ముగ్గరు విద్యార్థులు కిందపడిపోయారు. అదే సమయంలో

వెనుక నుంచి వచ్చిన లారీ వారి మీదగా వెళ్ళింది.

Road Accident

శనివారం సాయంత్రం జరిగిన ఈ దుర్ఘటనలో ఇద్దరు విద్యార్థులు అక్కడికక్కడే మృతి

చెందారు. మరణించిన యువకుల పేర్లు... అనిరుధ్(19), విశ్వ(19)గా తెలుస్తోంది.

ప్రమాదంలో మరో యువకుడు అఖిల్ కూడా తీవ్రంగా గాయపడగా, అతడ్ని

అత్యవసర చికిత్స నిమిత్తమై సమీపంలోని ఆసుపత్రికి తరలించారు.

ప్రమాదానికి గురైన మోటార్ బైక్ టీఎస్ 03 ఈఏ 1993గా గుర్తించారు. స్థానికుల

సమాచారం మేరకు ప్రమాద స్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని

దర్యాప్తు చేస్తున్నారు. అయితే ప్రమాదంలో మరణించిన యువకులు ఏ ప్రాంతానికి

చెందిన వారన్నది ఇంకా తెలియరాలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+