అంబర్ పేటలో దారుణ హత్య: తాడుతో గొంతు బిగించి చంపేశారు (ఫోటోలు)

హైదరాబాద్: అంబర్ పేటలో దారుణం చోటు చేసుకుంది. ఇంట్లో ఒంటరిగా ఉన్న ఓ వృద్ధురాలి నగల కోసం గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేసి ఎనిమిది తులాల ఆభరణాలు దోచుకెళ్లారు. అంబర్‌పేట పోలీసుస్టేషన్ ఇన్‌స్పెక్టర్ రవీందర్‌రెడ్డి కథనం ప్రకారం వివరాలిలా ఉన్నాయి.

కోహెడ గ్రామానికి చెందిన మూల కిష్టయ్య, సుగుణ(60) దంపతులు గత పది సంవత్సరాలుగా అంబర్‌పేట మున్సిపల్ కాలనీలో నివసిస్తున్నారు. వీరికి ఇద్దరు కుమార్తెలు రాధిక, సందీప. మూల కిష్టయ్య హెడ్‌మాస్టర్‌గా పనిచేసి పదవీ విరమణ చేసిన అనంతరం దాదాపు 7 ఏళ్ల క్రితం మృతి చెందాడు.

భర్త కిష్టయ్య మృతి చెందడంతో సుగుణ తన కూతురు రాధికతో పాటు మున్సిపల్ కాలనీలో ఉంటోంది. మరో కూతురు ఆస్ట్రేలియాలో నివసిస్తోంది. రాధిక హైటెక్ సిటీలోని ప్రైవేట్ సంస్ధలో హెచ్‌ఆర్‌గా పనిచేస్తోంది.

మంగళవారం ఉదయం రాధిక విధులకు హాజరుకావడానికి హైటెక్ సిటీకి వెళ్తుండగా, సుగుణ తాను పింఛన్ తీసుకునేందుకు బ్యాంక్‌కు వెళ్లి వస్తానని కూతురుకు చెప్పింది. కూతురు వెళ్ళిన కొద్ది సేపటికి సుగుణ తనకు తెలిసిన గోల్నాకకు చెందిన ఆటో డ్రైవర్ షరీఫ్‌ను ఇంటికి పిలిపించి అతని ఆటోలో ఫించన్ తీసుకోవడానికి వనస్ధలిపురంలోని బ్యాంక్ వెళ్లి తిరిగి ఆటోలో వచ్చింది.

అంబర్ పేటలో దారుణ హత్య: తాడుతో గొంతు బిగించి చంపేశారు

అంబర్ పేటలో దారుణ హత్య: తాడుతో గొంతు బిగించి చంపేశారు

ఆ సమయంలో ఇంట్లో పనిమనిషి సంధ్య తాను వెళ్ళుతున్నానని సుగుణకు చెప్పి వెళ్లిపోయింది. ఇదేఅదనుగా భావించిన అగంతకులు ఇంట్లోకి ప్రవేశించి సుగుణ ముఖంపై దిండుతో అదిమి, తాడుతో గొంతుకు బిగించి ఊపిరి ఆడకుండా చేసి హత్య చేశారు.

అంబర్ పేటలో దారుణ హత్య: తాడుతో గొంతు బిగించి చంపేశారు

అంబర్ పేటలో దారుణ హత్య: తాడుతో గొంతు బిగించి చంపేశారు

ఆమె ఒంటిపై ఉన్న ఎనిమిది తులాల బంగారు ఆభరణాలను, రెండు సెల్‌ఫోన్లను దోచుకున్నారు. రాత్రి 7.30గంటల సమయంలో ఇంటికి వచ్చిన రాధిక కిటికీలో నుంచి చూడగా మంచంపై సుగుణ పడిపోయిన కనిపించింది. ఆమె చుట్టుపక్కల వారికి విషయం చెప్పింది.

అంబర్ పేటలో దారుణ హత్య: తాడుతో గొంతు బిగించి చంపేశారు

అంబర్ పేటలో దారుణ హత్య: తాడుతో గొంతు బిగించి చంపేశారు

108 అంబులెన్స్‌ను పిలిపించగా సిబ్బంది చూసి సుగుణ మృతి చెందినట్టు తెలిపారు. ఆమె వెంటనే అంబర్‌పేట పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో ఈస్ట్‌జోన్ టాన్క్‌ఫోర్స్ డీసీపీ కోటిరెడ్డి, మలక్‌పేట ఏసీపీ సుధాకర్, ఇన్‌స్పెక్టర్ రవీందర్‌రెడ్డి ఘటనాస్థలికి వచ్చి పరిశీలించారు.
 అంబర్ పేటలో దారుణ హత్య: తాడుతో గొంతు బిగించి చంపేశారు

అంబర్ పేటలో దారుణ హత్య: తాడుతో గొంతు బిగించి చంపేశారు

కేసు నమోదు చేసిన పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు ప్రారంభించారు. సుగుణను ఆటో డ్రైవర్ షరీఫ్ తన ఇద్దరు స్నేహితులతో కలిసి హత్య చేసినట్లు పోలీసులు దర్యాప్తులో వెల్లడైంది. షరీఫ్‌ను అదుపులోకి విచారిస్తున్నారు. సుగుణ ఎక్కడి వెళ్లిన షరీఫ్‌ను పిలిపించి అతని ఆటోలో వెళ్లేదని తేలింది.

 అంబర్ పేటలో దారుణ హత్య: తాడుతో గొంతు బిగించి చంపేశారు

అంబర్ పేటలో దారుణ హత్య: తాడుతో గొంతు బిగించి చంపేశారు

ఇంట్లో ఒంటరిగా ఉన్న సుగుణను గమనించిన షరీఫ్ బంగారు నగల కోసం పథకం ప్రకారం ఆమె దారుణంగా హత్య చేసినట్లు తేలింది. కేసును అంబర్‌పేట ఇన్‌స్పెక్టర్ రవీందర్‌రెడ్డి దర్యాప్తు చేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+