వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తిప్పలు తప్పవా : ప్రజాకూటమి ఓటమితో చంద్రబాబుకు గడ్డు కాలమే...!

|
Google Oneindia TeluguNews

Recommended Video

Telangana Election Results : TRS Victory Impact on Chandrababu Naidu | Oneindia Telugu

తెలంగాణలో ప్రజా కూటమి ఓటమితో టీడీపీ అధినేత ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు గడ్డు కాలం స్టార్ట్ అయ్యిందా...? తెలంగాణలో ఎన్నికలను ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని ప్రచార బాధ్యతలు నిర్వర్తించిన చంద్రబాబుకు చేదు అనుభవం ఎదురైంది. ఇప్పటి వరకు కాస్తో కూస్తో ఉన్న టీడీపీ క్యాడర్ కూడా వచ్చిన ఫలితాలతో టీఆర్ఎస్ వైపు చూస్తున్నట్లు సమాచారం. తెలంగాణలో ప్రజాకూటమి విజయం పై ధీమాగా ఉన్న చంద్రబాబు టీఆర్ఎస్ సునామీ ముందు నిలవలేకపోయారు. ఇక తెలంగాణ ఎన్నికల్లో ఘోరంగా దెబ్బతినడంతో ఆ ప్రభావం కచ్చితంగా ఏపీలో చూపిస్తుందనే చర్చ జోరుగా సాగుతోంది. మరి ఇంట గెలవలేకపోయిన చంద్రబాబు బయట ఏమాత్రం నెట్టుకొస్తారో అనేదానిపై డిబేట్లు ఇటు ప్రాంతీయంగా అటు జాతీయ స్థాయిలో జరుగుతున్నాయి.

తెలంగాణలో ప్రభావం చూపని బాబు జాతీయ స్థాయిలో చక్రం తిప్పుతారా..?

తెలంగాణలో ప్రభావం చూపని బాబు జాతీయ స్థాయిలో చక్రం తిప్పుతారా..?

తెలంగాణలో అసెంబ్లీ ఫలితాలు వచ్చాయి. సింహం సింగిల్‌గా వచ్చి సీట్లు కొట్టుకుపోయింది. ప్రజాకూటమి కలిసి వచ్చినా ప్రజలు మాత్రం కేసీఆర్ వైపే నిలిచారు. ఈ ఎన్నికలను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని రాహుల్ గాంధీతో కలిసి ప్రచారం చేసిన చంద్రబాబుకు చేదు అనుభవం ఎదురైంది. అయితే జాతీయ స్థాయిలో బీజేపీ వ్యతిరేక పార్టీలను ఏకతాటిపైకి తీసుకొచ్చి చక్రం తిప్పగలరా అనే ప్రశ్న తెరపైకి వస్తోంది. సొంత ఇంటిని చక్కబెట్టలేని వాడు బయట ఎలా చక్రం తిప్పుతారు అనే చర్చ ప్రారంభమైంది. ఇక తెలంగాణలో ఒక యుద్ధం ఓడిపోయిన చంద్రబాబు ఇక జాతీయ స్థాయిలో జరిగే యుద్ధంలో గెలవాల్సి ఉంది.

టీఆర్ఎస్ భారీ విజయం, గులాబీ సంబరాలు (ఫోటోలు)

బాబు సూచన మేరకే కాంగ్రెస్ అభ్యర్థుల ఖరారు..?

బాబు సూచన మేరకే కాంగ్రెస్ అభ్యర్థుల ఖరారు..?


అక్టోబర్ చివరి నెలలో చంద్రబాబు ఢిల్లీకి వెళ్లి జాతీయస్థాయి నేతలను కలిశారు. బీజేపీని మట్టికరిపించేందుకు తన చిరకాల ప్రత్యర్థి అయిన కాంగ్రెస్‌తో కూడా చేతులు కలిపేందుకు సిద్ధం అని చెప్పారు. ఏపీకి ప్రత్యేక హోదా సాధించడంలో చంద్రబాబు విఫలమయ్యారనే విమర్శలు ఏపీ కాంగ్రెస్ చేస్తున్న నేపథ్యంలోనే తెలంగాణలో హస్తం పార్టీతో కలిసి పొత్తు పెట్టుకున్నారు. అప్పటి వరకు హోదా కోసం చంద్రబాబుపై విమర్శనాస్త్రాలు సంధించిన కాంగ్రెస్ పార్టీ ఒక్కసారిగా యూటర్న్ తీసుకుని అస్త్రాలను బీజేపీపైకి వదలడం ప్రారంభించింది. అంతేకాదు టీఆర్ఎస్‌, బీజేపీని ఓడించడం ద్వారా తాను నడుపుతున్న బీజేపీ వ్యతిరేక శక్తులు కూటమికి మానసికంగా బలం చేకూరుతుందనే సంకేతాలు పంపే ప్రయత్నం చేశారు. అయితే బొమ్మ బ్లాక్ అయ్యింది. తెలంగాణ ఫలితాలతో టీడీపీ మైండ్ బ్లాక్ అయ్యింది.

కూటమి పాలిటిక్స్ చంద్రబాబుకు కొత్తేమి కాదు. 1996లో యునైటెడ్ ఫ్రంట్‌కు కన్వీనర్‌గా వ్యవహరించారు. అంతకుముందు 1989లో జనతాదళ్ నేతృత్వంలో ఏర్పడినా నేషనల్ ఫ్రంట్‌కు ఎన్టీఆర్ మద్దతు తెలిపారు. చంద్రబాబు కాంగ్రెస్‌తో చేతులు కలపేందుకు ఇచ్చిన వివరణ క్లియర్‌గా ఉన్నప్పటికీ అది చాలలేదు. అంతేకాదు చంద్రబాబు తెలంగాణలో సర్వే చేయించాకే ఆయన సూచనల మేరకే ప్రజాకూటమి అభ్యర్థులను బరిలోకి దింపడం జరిగిందని సమాచారం. ఇక తెలంగాణలో ఘోర పరాభవం ఎదుర్కొన్న చంద్రబాబు నాయుడు జాతీయ స్థాయిలో చక్రం తిప్పడం అంటే ఎవరూ నమ్మలేని పరిస్థితి తలెత్తింది. అంటే చంద్రబాబుకు ఇక గడ్డుకాలమే నడుస్తుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. తెలంగాణ ఓటమితో ఏపీలో చంద్రబాబు పరిస్థితి మరింత దిగజారుతుందనడంలో సందేహం లేదు. ఓ వైపు జగన్‌ మరో వైపు పవన్ కళ్యాణ్‌లు చంద్రబాబుకు నిద్ర పట్టనివ్వడం లేదు. పదే పదే చంద్రబాబును అటాక్ చేయడం... పైగా తెలంగాణ ఎన్నికల్లో ప్రజాకూటమి ఓటమి చెందడంతో చంద్రబాబుకు కష్టాలు ప్రారంభం అయ్యాయని పొలిటికల్ అనలిస్టులు చెబుతున్నారు.

చివరిగా కాంగ్రెస్‌తో బాబు దోస్తీ...వర్కౌట్ అవుతుందా..?

చివరిగా కాంగ్రెస్‌తో బాబు దోస్తీ...వర్కౌట్ అవుతుందా..?

ఇక ఇంత ఘోర పరాభవం చూశాక కూడా చంద్రబాబుతో కలిసి వెళ్లాలా లేదా అనే నిర్ణయం ఇప్పుడు కాంగ్రెస్ కోర్టులో ఉంది. ప్రతిసారీ చంద్రబాబు ఏదో ఒక పార్టీతోనే కలిసి ఎన్నికల్లో పోటీచేశారు. అయితే ఈసారి ఆయనకున్న ఒకే ఒక ఆశ కాంగ్రెస్. బీజేపీతో వైరం ఏర్పడటం, జనసేన పక్కకు రావడంతో చంద్రబాబుకు కాంగ్రెస్ తప్ప మరో పార్టీ కనిపించలేదు. ఇప్పుడు తెలంగాణలో వచ్చిన ఫలితాలతో చంద్రబాబు కాంగ్రెస్‌ను విడిచి వేరే పార్టీతో జట్టుకట్టే పరిస్థితి లేదు. ఒకవేళ మరో పార్టీతో వెళదామన్నా తనకు లాభం చేకూర్చే పార్టీ ఇక ఏదీ మిగలలేదని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. అయితే చంద్రబాబు జాతీయంగా ప్రముఖ పాత్ర పోషించే అవకాశం ఉంటుదని అనలిస్టులు చెబుతున్నారు.

ఏపీలో చంద్రబాబుకు గడ్డుపరిస్థితి

ఏపీలో చంద్రబాబుకు గడ్డుపరిస్థితి

తాజాగా తెలంగాణలో ప్రజాకూటమి ఓటమితో చంద్రబాబుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. చంద్రబాబు వల్లే కాంగ్రెస్ ఓడిపోయిందనే వాదన వినిపిస్తోంది. కాంగ్రెస్ ఒంటరిగా పోటీ చేసినా ఆశించిన స్థానాలకంటే కాస్త ఎక్కవగా వచ్చేవని మాట వినిపిస్తోంది. ఇక రాజధాని అమరావతి పూర్తిస్థాయిలో నిర్మాణం కాకపోవడం ఏపీలో అడుగంటుతున్న అభివృద్ధి, పలు ప్రాంతాల్లో కరువులాంటి అంశాలు 2019 ఎన్నికల్లో బాబుకు మైనస్ కానున్నాయి. ఇప్పటికే చంద్రబాబుపై ప్రజల్లో వ్యతిరేకత ఉన్నట్లు అత్యంత విశ్వసనీయ సమాచారం. ఇక బీజేపీ వ్యతిరేక శక్తులను ఏకం చేసే పనిలో బిజీగా అయిపోయి రాష్ట్ర పాలనను గాలికొదిలేశారని విపక్షాలు దుమ్మెత్తిపోస్తున్నాయి. మొత్తానికి తెలంగాణ ఫలితాలు బాబు ఫేట్‌ను మారుస్తాయా లేదా అనేది కాలమే సమాధానం చెప్పాలి.

English summary
Andhra Pradesh Chief Minister Chandrababu Naidu on Tuesday lost out on one of the biggest prestige battles for him. Unable to match up to the silent KCR wave in Telangana, the Mahakutami, an alliance that Naidu scripted, lost what could have been the stepping stone to an anti-BJP allied force.While the alliance’s campaigning was relentless, enough to unsettle KCR, Naidu still could not pull off a win. And now, Naidu has to fight yet another battle to stay relevant.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X