రోహిత్ ఆత్మహత్యలో కొత్త కోణం: ఏబీవీపీ నేత అబద్దం చెప్పారా?

హైదరాబాద్: హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయంలో రోహిత్ వేముల ఆత్మహత్య ఘటనపై ఏబీవీపీ నేత సుశీల్ చెబుతున్న 'ఘర్షణ' అబద్దమంటూ జాతీయ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఉగ్రవాదుల ఉరి విషయమై ఏఎస్ఏ, ఏబీవీపీ కార్యకర్తల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది.

ఈ సందర్భంగా రోహిత్ సహా ఏఎస్ఏ కార్యకర్తలు తనను ఒక్కడిని చేసి తీవ్రంగా కొట్టారని, దీంతో తీవ్రంగా గాయపడ్డ తాను ఆసుపత్రిలో చికిత్స చేయించుకున్నానని ఏబీవీపీ నేత సుశీల్ కుమార్ చెప్పాడు.

అయితే అతడు చెప్పిన మాట వాస్తవం కాదని జాతీయ మీడియాలో పలు కథనాలు ప్రచురితమయ్యాయి. సుశీల్ కుమార్ చికిత్స చేయించుకున్నట్లుగా చెబుతున్న మదీనాగూడలోని అర్చనా హాస్పిటల్స్ వైద్య నివేదకను ఆ కథనాల్లో ప్రస్తావనకు వచ్చింది.

Rohith suicide: ABVP leader claimed stomach pain after ‘assault,’ was operated for appendicitis

మెడికల్ రిపోర్టును చేజిక్కించుకున్న సదరు మీడియా సంస్థలు.. సుశీల్ అబద్దం చెబుతున్నాడని పేర్కొన్నాయి. అపెండిసైటిస్ కారణంగా ఆసుపత్రిలో ఆపరేషన్ చేయించుకున్న సుశీల్ కుమార్ శరీరంపై గాయాలేమీ లేవని సదరు నివేదకను ఊటంకిస్తూ వార్తలు రాశాయి.

తనను ఒక్కడిని చేసి కొట్టారని ఏబీవీపీ నేత సుశీల్ కుమార్ ఆరోపించారు. దీనిపై ఇప్పటికే పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఇలాంటి సమయంలో సుశీల్ చెప్పింది అబద్దమంటూ జాతీయ మీడియాలో వార్తలు రావడం చర్చనీయాంశమైంది.

గత ఏడాది ఆగస్టు 4వ తేదీన తనను హాస్టల్ గదిలో ఏఎస్ఏ విద్యార్థులు ఒక్కడిని చూసి కొట్టారని సుశీల్ చెప్పారు. ఆ తర్వాత అతను ఆసుపత్రిలో ఆగస్టు 7న చేరారు. నాటి వైస్ ఛాన్సులర్ శర్మతో పాటు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ సీనియర్ మెడికల్ ఆఫీసర్ కూడా సుశీల్‌ను పరామర్శించారు.

ఆ తర్వాత ఆగస్టు 8న మెడికల్ ఆఫీసర్ మాట్లాడుతూ... అతని పైన దాడి జరిగిందా లేదా కచ్చితంగా తెలియదని, అయితే రిపోర్టులో మాత్రం బహిర్గతంగా ఎలాంటి గాయాలు కాలేదని ఉందని చెప్పారని తెలుస్తోంది. నిర్ధారణకు రాలేకపోతున్నట్లు చెప్పారని తెలుస్తోంది. ఎడమ భుజంపై చిన్న గాయం ఉందని చెప్పారని సమాచారం.

గత ఏడాది ఆగస్టు 4న అతను ఆసుపత్రిలో జాయిన్ అయ్యాడని, కడుపులో నొప్పి ఉందని చెప్పాడని, అతనిని రెండు రోజుల పాటు ఆసుపత్రిలో ఉంచామని, ఆ తర్వాత హఠాత్తుగా భరించలేని కడుపు నొప్పి వచ్చినట్లు చెప్పాడని ఆసుపత్రి డాక్టర్ రిపోర్టులో చెప్పాడని తెలుస్తోంది.

ఇదిలా ఉండగా, 24X7 ఉండే యూనివర్సిటీ హెల్త్ సెంటర్‌లో ఎందుకు చేరలేదని అడిగితే, తనను ఏఎస్ఏ విద్యార్థులు తనను హెల్త్ సెంటర్‌కు వెళ్లనీయలేదని ఏబీవీపీ నేత సుశీల్ చెప్పాడని వార్తలు వస్తున్నాయి. అలాగే దాడి చేస్తారనే వచ్చినట్లు చెప్పారని తెలుస్తోంది.

ఏఎస్ఏ విద్యార్థులు సుశీల్‌ను కొట్టగా తాను చూడలేదని, తన ఎదుట ఏమీ జరగలేదని డిప్యూటీ సెక్యూరిటీ అధికారి దిలీప్ సింగ్ చెప్పినట్లుగా తెలుస్తోంది. (క్యాంపస్‌లో అర్ధరాత్రి గొడవ జరుగుతుందని తెలుసుకొని తెలుసుకొని దిలీప్ సింగ్.. సుశీల్ హాస్టల్ గదికి వెళ్లిన సెక్యూరిటీ ఆఫీసర్. తాను వెళ్లే సమయానికి ఏఎస్ఐ, సుశీల్ మధ్య వాగ్వాదం జరిగిందని అతను చెప్పాడని తెలుస్తోంది.)

ఆ రోజు సుశీల్‌ను సెక్యూరిటీ జీప్ ఎక్కించుకున్నామని, కొందరు ఏఎస్ఐ సభ్యులు అతనిని జీపు నుంచి కిందకు లాగే ప్రయత్నం చేశారని, ఆ సమయంలో అతని ఎడమ భుజంకు గాయం కావొచ్చని, అతని చొక్కా చినిగిందని దిలీప్ సింగ్ చెప్పారని తెలుస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+