హెచ్‌సియులో ఉద్రిక్తం: టార్గెట్ స్మృతి ఇరానీ, 'అప్పారావు అంశం మా పరిధిలో లేదు'

హైదరాబాద్: వేముల రోహిత్ ఆత్మహత్య, సోమవారం నాడు విద్యార్థుల చలో హెచ్‌సియు నేపథ్యంలో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఉద్రిక్తత కనిపిస్తోంది. బయటి విద్యార్థులను పోలీసులు లోనికి అనుమతించడం లేదు. ఐడీ కార్డులు చూపిస్తేనే లోనికి అనుమతించారు.

దాదాపు హెచ్‌సియుకు రెండు కిలోమీటర్ల దూరంలో బారీకేడ్లు ఏర్పాటు చేశారు. వర్సిటీలో విద్యార్థులు భారీ నిరసన ర్యాలీ చేపట్టారు. తమకు సభకు అనుమతించాలని, లేదంటే విధ్వంస కాండకు సిద్ధమని ఓ విద్యార్థి ఓ టీవీ ఛానల్‌తో మాట్లాడుతూ వ్యాఖ్యానించాడు.

ప్రధాన ద్వారం వద్ద ఉద్రిక్తత కనిపించింది. లోపలకు వెళ్లేందుకు కొందరు విద్యార్థులు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. విద్యార్థులను కలిసేందుకు మహారాష్ట్ర నుంచి ఇద్దరు మాజీ మంత్రులు వచ్చినప్పటికీ కలిసేందుకు పోలీసులు అనుమతించలేదు.

Rohith Vemula’s suicide: Agitating students to name Smriti Irani in FIR

ఇదిలా ఉండగా, ఆందోళన చేస్తున్న విద్యార్థులు కేంద్రమంత్రి స్మృతి ఇరానీ పేరును ఎఫ్ఐఆర్‌లో పెట్టాలని డిమాండ్ చేస్తున్నారు. వారు పలు డిమాండ్లు వినిపిస్తున్నారు. స్మృతి ఇరానీ పేరును ఎఫ్ఐఆర్‌లో పెట్టాలని, అప్పారావును తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు.

ఎఫ్ఐఆర్‌లో దత్తాత్రేయ, రామచంద్ర రావు, ఏబీవీపీ నేతల పేర్లు ఉన్నాయి. స్మృతి పేరు చేర్చాలని పట్టుబట్టడం వెనుక ఏమైనా ఉందా అనే చర్చ జరుగుతోంది. రాహుల్ గాంధీ వచ్చినప్పుడు ప్రధానంగా ఆమెనే టార్గెట్ చేశారు.

సమస్యను పరిష్కరించేందుకు కృషి: శ్రీవాత్సవ

హెచ్‌సియులో సాధారణ పరిస్థితులను కల్పించేందుకు ప్రయత్నాలు చేస్తున్నామని ఇంఛార్జ్ విసి శ్రీవాత్సవ చెప్పారు. వీసీ అప్పారావు తొలగింపు అంశం తమ పరిధిలో లేదని చెప్పారు. ఫ్యాకల్టీని మధ్యవర్తిగా సమస్య పరిష్కారం కోసం విద్యార్థులతో మాట్లాడుతున్నట్లు చెప్పారు.

హెచ్‌సియు ఆరెస్సెస్ అడ్డా: విహెచ్

హెచ్‌సియు ఆరెస్సెస్, ఏబీవీపీ అడ్డాగా మారిందని కాంగ్రెస్ పార్టీ నేత వి హనుమంత రావు మండిపడ్డారు. వీసీ అప్పారావు తాను నిమిత్తమాత్రుడనని చెప్పడమే ఇందుకు నిదర్శనం అన్నారు.

బిజెపి ఎమ్మెల్సీ రామచంద్ర రావు పైన అట్రాసిటీ కేసు పెట్టాలని డిమాండ్ చేశారు. వేముల రోహిత్ పైన మతతత్వ ముద్ర వేసే ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. రోహిత్ ఆత్మహత్య పైన ప్రధాని మోడీ ఆలస్యంగా స్పందించారన్నారు. ప్రధాని ముద్దుబిడ్డలు ఆరెస్సెస్‌లో ఉన్నారని ఎద్దేవా చేశారు.

హెచ్‌సీయూ కేసుపై విచారణ వాయిదా

విద్యార్థుల సస్పెన్షన్‌పై దాఖలైన పిటిషన్ పైన హైకోర్టు సోమవారం విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా విద్యార్థులపై సస్పెన్షన్‌ ఎత్తివేసినట్లు హెచ్‌సీయూ కోర్టుకు నివేదించింది.

తనకు రక్షణ కల్పించాలని ఆత్మహత్య చేసుకున్న రోహిత్‌ తల్లి వేసిన పిటిషన్‌పై కూడా న్యాయస్థానం విచారణ నిర్వహించింది. దీనిపై అదనపు సమాచారంతో కౌంటర్‌ దాఖలు చేసేందుకు సమయం ఇవ్వాలని తెలంగాణ హోంశాఖ న్యాయవాది కోరారు. దీంతో రెండు పిటిషన్లపై తదుపరి విచారణను ఫిబ్రవరి 12కు వాయిదా వేసింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+