వారిని శిక్షించండి: రోహిత్ మృతిపై స్మృతి ఇరానీని టార్గెట్ చేసిన రాహుల్
హైదరాబాద్: హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయంలో జరిగిన రోహిత్ ఆత్మహత్యకు కేంద్రమంత్రులు, వర్సిటీ వైస్ ఛాన్సులర్‌లే కారణమని ఏఐసీసీ ఉపాధ్యక్షులు రాహుల్ గాంధీ మంగళవారం నాడు ఆరోపించారు. హెచ్‌సియులో విద్యార్థులతో భేటీ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.
విశ్వవిద్యాలయాలలో పక్షపాత ధోరణి ఏమాత్రం సరైనది కాదన్నారు. విద్య తద్వారా జ్ఞానం సంపాదించుకునేందుకే విశ్వవిద్యాలయాలు ఉండాలని చెప్పారు. అభిప్రాయాలను వ్యక్తపరిచే స్వేచ్ఛ, హక్కు విద్యార్థులకు ఉండాలని చెప్పారు. విద్యార్థుల గొంతు నొక్కే ప్రయత్నాలు చేయవద్దన్నారు.

రోహిత్ మృతి చాలా బాధాకరమన్నారు. ఈ ఆత్మహత్యకు కేంద్రమంత్రి స్మృతి ఇరానీ, వైస్ ఛాన్సులర్ అప్పారావులు బాధ్యత వహించాలన్నారు. విద్యార్థి చనిపోతే వారి కుటుంబాన్ని పరామర్శించే సమయం, నైతిక బాధ్యత వీసీకి లేదా అని ప్రశ్నించారు. నేను రాజకీయం చేసేందుకు హైదరాబాద్ రాలేదన్నారు.
నేను రాజకీయ నాయకుడిగా ఇక్కడకు రాలేదని చెప్పారు. రోహిత్ విషయంలో వీసీ, ఢిల్లీలోని కేంద్రమంత్రి సక్రమంగా వ్యవహరించలేదని మండిపడ్డారు. రోహిత్ కుటుంబానికి నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. రోహిత్ ఆత్మహత్యకు కారణమైన వీసీ, కేంద్రమంత్రిని కఠినంగా శిక్షించాలన్నారు.












Click it and Unblock the Notifications