Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

వేముల రోహిత్ దళితుడు కాదు, వడ్డెర కులస్థుడే: తెలంగాణ పోలీస్

హైదరాబాద్: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో (హెచ్‌సియు)లో ఆత్మహత్య చేసుకున్న వేముల రోహిత్ వడ్డెర కులానికి చెందినవాడేనని పోలీసులు స్పష్టం చేశారు. హైకోర్టుకు కొద్ది రోజుల క్రితం నివేదిక సమర్పించారు. అందులో రోహిత్ వడ్డెర కులస్తుడని పేర్కొన్నారు.

గుంటూరు జిల్లా గురజాలలో ఉన్న రోహిత్‌ తండ్రి నాగమణికుమార్‌, తండ్రి తరఫు బంధువులు, గ్రామ సర్పంచ్, రోహిత్ తల్లి రాధిక బంధువులు, రోహిత్‌ సోదరుడు రాజచైతన్య కుమార్‌కు తహసీల్దారు ఇచ్చిన కుల ధ్రువీకరణ పత్రం ఆధారంగా రోహిత్‌ వడ్డెర కులానికి చెందినట్లుగా భావిస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.

గుంటూరులోని రోహిత్‌ చదివిన పాఠశాల రికార్డుల్లో కులం గురించిన ఆధారాలు లభించలేదని, ఇంటర్‌, డిగ్రీ రికార్డుల్లో మాత్రం ఎస్సీ మాలగా నమోదై ఉందన్నారు. రాధికను తాను దత్తత తీసుకున్నట్లు అంజనీ దేవి చెప్పిన విషయంపై ఇంకా విచారణ జరపాల్సి ఉందన్నారు. ఇంకా కొందర్ని విచారించాల్సి ఉందన్నారు.

రోహిత్ దళితుడు కాదని తెలంగాణ ప్రభుత్వం కేంద్ర హోం మంత్రిత్వ శాఖకు పంపించిన నివేదికలోనూ స్పష్టం చేసింది. రోహిత్ ఆత్మహత్యకు పురిగొలిపారనే ఆరోపణలతో వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ అప్పారావు, కేంద్ర కార్మిక మంత్రి బండారు దత్తాత్రేయ, ఎమ్మెల్సీ రామచంద్రరావులపై ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం కింద కేసులు నమోదు కావడంతో కేసులో రోహిత్ కులానికి ప్రాధాన్యత సంతరించుకున్న విషయం తెలిసిందే.

Rohith Vemula was not a Dalit, says Telangana Police

రోహిత్ అసలు దళితుడే కానపుడు కేంద్రమంత్రి, వీసీలపై ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం కింద కేసు నమోదు చేయడం సరికాదని, రోహిత్ దళితుడు కాడని వచ్చిన ఆరోపణలపై స్పందించిన కేంద్రం ఈ వ్యవహారంపై దర్యాప్తు జరిపి నివేదిక ఇవ్వాల్సిందిగా తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించింది.

ఆ మేరకు తెలంగాణ రాష్ట్ర రెవిన్యూ అధికారులు రోహిత్ తండ్రి వేముల మణికుమార్, తల్లి రాధిక, మణికుమార్ బంధువులు, రోహిత్ సోదరుడు, రోహిత్ అమ్మమ్మల వివరణలతో పాటు నీటిపారుదల శాఖలో తండ్రి గతంలో సమర్పించిన పత్రాలను సైతం సేకరించి వాస్తవాలను తెలుసుకున్నారు.

1989 జనవరి 30న పుట్టినట్టు ఎస్సీ కులానికి చెందిన వాడని పేర్కొంటూ రోహిత్‌కు జారీ చేసిన సర్టిఫికేట్ పైన ఎమ్మార్వో సత్యనారాయణ మూర్తి సంతకం చేశారు. గురజాల వడ్డెర వీధిలో డోర్ నెంబర్ 6-79తో ఈ సర్టిఫికేట్ పొందారు.

అయితే గతంలో మిగిలిన వారి సర్టిఫికేట్లలో వడ్డెర కులాన్నే ప్రస్తావించినట్టు తెలంగాణ పోలీసులు కేంద్ర హోంశాఖకు పంపిన నివేదికలో పేర్కొన్నట్టుగా తెలుస్తోంది. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వం హైకోర్టుకు సైతం ఒక అఫిడవిట్ దాఖలు చేసినట్టుగా తెలుస్తోంది.

మొత్తానికి రికార్డుల ప్రకారం రోహిత్ కుటుంబం ఎస్సీ కులానికి చెందిన వారే అయినా, వాస్తవికంగా వడ్డెర కులానికి చెందిన వారని ప్రభుత్వం తన నివేదికలో పేర్కొంది. ఇదిలా ఉండగా, తాము ఎస్సీలు నివసించే ప్రాంతంలోనే జీవించామని, కనుక తాము ఎస్సీలుగానే పరిగణించబడతామని రాధిక కుటుంబం వాదిస్తోందట.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+