OG టికెట్ ధరలను వెంటనే తగ్గించండి.. రాష్ట్ర ప్రభుత్వం జీవో జారీ..
తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించిన ఓజీ సినిమా టికెట్ ధరలను థియేటర్లు, మల్టీప్లెక్స్ లు తక్షణమే తగ్గించాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వం జీవో విడుదల చేసింది. పెంచిన ధరలను వెంటనే తగ్గించాలని సింగిల్ స్క్రీన్స్ తో పాటుగా మల్టీప్లెక్స్ యాజమాన్యాలకు ఆదేశాలు జారీ చేసింది. సెప్టెంబర్ 25 పవర్ స్టార్ పవన్ కల్యాణ్ మూవీ విడుదలైన సంగతి తెలిసిందే.
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ , యంగ్ డైరెక్టర్ సుజీత్ కాంబోలో వచ్చిన 'ఓజీ' మూవీ పాజిటివ్ టాక్ తో బాక్సాఫీస్ ముందు దూసుకెళ్తోంది. ఫుల్ యాక్షన్ ప్యాకెడ్ గా రూపొందించిన ఈ గ్యాంగ్ స్టర్ యాక్షన్ డ్రామా ఫ్యాన్స్ కు ఫుల్ మీల్స్ అని చెబుతున్నారు. ఒక్కో సీన్ ఒక్కో ఎలివేషన్ అని టాక్ నడుస్తోంది. కేవలం ఈ సినిమా ఫ్యాన్స్ కు మాత్రమే కాకుండా సినిమా చూసిన ప్రతీ సినీ ప్రేక్షకుడికి కూడా మెప్పించేలా ఉంది. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ తొలిసారి శక్తివంతమైన గ్యాంగ్ స్టర్ పాత్రలో మెప్పించారు. ఆడియన్స్ తో పాటు సినీ ఇండస్ట్రీ ప్రముఖులు ఈ చిత్రాన్ని ప్రశంసలతో శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
బ్రేకింగ్ న్యూస్
— Telugu Scribe (@TeluguScribe) September 29, 2025
OG సినిమా టికెట్ ధరలను థియేటర్లు, మల్టీప్లెక్స్‌లు తక్షణమే తగ్గించాలని ఆదేశిస్తూ జీవో జారీ చేసిన తెలంగాణ ప్రభుత్వం https://t.co/WkICKpqYaR pic.twitter.com/ntZ5s1ITEU
ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను రాబడుతోంది. ఓజీ మూవీకి ఇప్పటివరకు రూ. 250 కోట్లకుపైగా కలెక్షన్లు వచ్చినట్లు సమాచారం. ప్రస్తుతం పండగ సెలవులు కావడంతో ఈ మూవీకి మరిన్ని కలెక్షన్లు పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అయితే తాజాగా ఓజీ సినిమా టికెట్ ధరలను థియేటర్లు, మల్టీప్లెక్స్ లు తక్షణమే తగ్గించాలని తెలంగాణ ఆదేశాలు జారీ చేసింది. పెంచిన ధరలను వెంటనే తగ్గించాలని సింగిల్ స్క్రీన్స్ తో పాటుగా మల్టీప్లెక్స్ యాజమాన్యాలకు ఆదేశాలు జారీ చేసింది. ఈ సినిమా టికెట్ ధరల పెంపును తెలంగాణ హైకోర్టును సస్పెండ్ చేయడాన్ని, ఆ తర్వాత పరిణామాలను జీవోలో పొందుపరిచింది.

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఓజీ మూవీ ప్రపంచవ్యాప్తంగా సెప్టెంబర్ 25న విడుదల అయింది. అయితే సినిమా విడుదలకు ముందు.. ప్రీమియర్ షోలతో సెప్టెంబరు 25 నుంచి అక్టోబరు 4 వరకు టికెట్ రేట్లు పెంచుకునేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చిన విషయం తెలిసిందే.












Click it and Unblock the Notifications