వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రోశయ్య అంత్యక్రియలు పూర్తి - చివరి దాకా బాధ్యత తీసుకున్న కేవీపీ : ప్రముఖు తుది వీడ్కోలు..!!

By Chaitanya
|
Google Oneindia TeluguNews

తెలుగు రాజకీయ భీష్ముడి అంతిమ యాత్ర ముగిసింది. ఉమ్మడి ఏపీ మాజీ ముఖ్మమంత్రి...మాజీ గవర్నర్ కొణిజేటి రోశయ్య కు ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు. కొంపల్లిలోని ఫాంహౌజ్‌లోని ఆయన వ్యవసాయ క్షేత్రంలో అంత్యక్రియలు తెలంగాణ ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు. అంత్యక్రియలకు భారీగా పార్టీలకతీతంగా రాజకీయ ప్రముఖులు, ప్రజాప్రతినిధులు తరలివచ్చి తుది వీడ్కోలు పలికారు. ఏపీ ప్రభుత్వం తరఫున మంత్రి మంత్రులు బొత్స సత్యనారాయణ, వెల్లంపల్లి శ్రీనివాస్‌, పేర్ని నాని, బాలినేని శ్రీనివాస్‌ హాజరయ్యారు.

Recommended Video

Konijeti Roasaih : The Ajatshatru In Indian Politics | End Of An Era || Oneindia Telugu
ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు

ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు


అంతకు ముందు గాంధీభవన్‌లో కొద్ది సేపు రోశయ్య పార్థీవ దేహాన్ని ఉంచగా.. కాంగ్రెస్‌ సీనియర్‌ నేత మల్లికార్జున ఖర్గేతో పాలు పలువురు సీనియర్‌ నాయకులు నివాళులర్పించారు. అనంతరం అక్కడి నుంచి నేరుగా కొంపల్లిలోని ఫాంహౌస్‌ వరకు అంతిమయాత్ర నిర్వహించారు. సాంప్రదాయ ప్రకారం అంత్యక్రియలు నిర్వహించారు. ఏడు దశాబ్దాల రాజకీయ జీవితంలో రోశయ్య అజాత శత్రువుగా నిలిచారు. ఆయన మరణ వార్త తెలిసిన వెంటనే ఆస్పత్రి వద్దకు చేరుకున్న కాంగ్రెస్ సీనియర్ నేత మాజీ ఎంపీ కేవీపీ రామచంద్రరావు.. ఆ సమయం నుంచి అంత్యక్రియలు పూర్తయ్యే వరకూ దగ్గరే ఉన్నారు.

కేవీపీ..వీహెచ్ ఇద్దరూ అక్కడే

కేవీపీ..వీహెచ్ ఇద్దరూ అక్కడే


ఆస్పత్రి నుంచి ఇంటి వద్దకు తీసుకొచ్చిన సమయంలోనూ ... ఆ తరువాత పార్టీ నేతలతో కలిసి నివాళి అర్పించారు. సుప్రీం చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ వచ్చిన సమయంలోనూ...టీడీపీ అధినేత చంద్రబాబు నివాళి అర్పించేందుకు వచ్చిన సమయంలోనూ ఆయనే అక్కడ కీలకంగా వ్యవహరించారు. చంద్రబాబును సైతం బాగున్నారా బాబు అంటూ పలకరించారు. ఇద్దరూ కొద్ది సేపు ఏకాంతంగా చర్చించుకున్నారు. ఇక, గాంధీ భవప్ కు రోశయ్య పార్దివ దేహాన్ని తరలించటం.. అక్కడ నివాళి కార్యక్రమం తరువాత... కొంపల్లిలో అంత్యక్రియలు పూర్తయ్యే వరకూ సైతం కేవీపీ అక్కడే ఉన్నారు.

తరలి వచ్చిన ప్రముఖులు..నివాళి

తరలి వచ్చిన ప్రముఖులు..నివాళి

ఆయనతో పాటుగా మాజీ ఎంపీ వీహెచ్ సైతం రోశయ్యకు తుది వీడ్కోలు పలికే వరకూ అన్ని కార్యక్రమాల్లోనూ భాగస్వామ్యం తీసుకున్నారు. వైఎస్సార్ ప్రభుత్వంలో పెద్దన్నయ్యగా రోశయ్య వ్యవహరించి...అన్నింటా మార్గదర్శకం చేసేవారంటూ కేవీపీ ఒక దశలో రోశయ్య గురించి మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సైతం రోశయ్య నివాసానికి వచ్చి నివాళి అర్పించారు. ఏపీ..తెలంగాణ మంత్రులతో పాటుగా పలువురు ప్రముఖులు సైతం రోశయ్యకు అంజలి ఘటించారు. రెండు తెలుగు ప్రభుత్వాలు మూడు రోజుల పాటు సంతాప దినాలు ప్రకటించాయి.

English summary
Rosaiah funeral was held at his farm house in Kompally with Telangana government. Many leaders paid tirbutes to former.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X