గులాబీ వర్సెస్ కమలం.!మధ్యలో షర్మిళ.!ఆసక్తిగా మారిన తెలంగాణ రాజకీయం.!

హైదరాబాద్ : తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తికర ఘట్టాలు చోటుచేసుకుంటున్నాయి. టీఆర్ఎస్ బీజేపి వరి ధాన్యం కొనుగోలుతో మొదలైన వైరం ఒకరినొకరు విచారణ సంస్థలను రంగప్రవేశం చేయించి ప్రతీకారం తీర్చుకునేంత వరకూ వెళ్లింది. అంతటితో ఆగకుండా బీజేపి కేంద్ర ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వ లోపభూయిష్ట విధానాలపై నోటీసులు జారీ చేస్తుంటే, తెలంగాణ రాష్ట్రంలో బీజేపి నేతల కార్యక్రమాలకు అనుమతుల పేరుతో అడ్డంకులు సృష్టిస్తోందని గులాబీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్నారు కమలనాథులు. నువ్వా నేనా అంటున్నట్టు కొనసాగుతున్న కమలం, గులాబీ రాజకీయాల్లోకి వైయస్సార్ టీపి అధినేత్రి వైయస్ షర్మిళ ఊహించని ఎంట్రీ ఇచ్చింది.

పాదయాత్రలో పదనిసలు..

పాదయాత్రలో పదనిసలు..

తెలంగాణలో రాజకీయాలు భగ్గుమంటున్నాయి. అధికార గులాబీ ప్రభుత్వాన్ని తరుచుగా ఇరుకున పెట్టే కాంగ్రెస్ పార్టీని వెనక్కు నెట్టి బీజేపీ తన ప్రభావాన్ని చాటుకుంటుంది. రాజకీయ వ్యూహాలు, ప్రతివ్యూహాలే కాకుండా సీఎం చంద్రశేఖర్ రావు ప్రభుత్వానికి కంటి మీద కునుకు లేకుండా బీజేపి కార్యచరణ రూపొందిస్తోంది.

తెలంగాణ రాష్ట్రంలో ప్రతిపక్షపార్టీల ఎత్తుగడలకు అంతగా ప్రాముఖ్యతనివ్వని చంద్రశేఖర్ రావు బీజేపి తీసుకుంటున్న కార్యాచరణకు మాత్రం కాస్త జంకుతున్నట్టు తెలుస్తోంది. అందులో భాగంగానే కేంద్ర బీజేపి ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా ఇందిరా పార్కులో సీఎం చంద్రశేఖర్ రావు స్వయంగా దీక్షా కార్యక్రమంలో పాలుపంచుకుని అందరినీ ఆశ్చర్యానికి గురి చేసారు.

నువ్వా నేనా..

నువ్వా నేనా..

అంతటితో ఆగకుండా తెలంగాణలో బీజేపి ప్రజాధరణకు పోటీగా తమ కార్యక్రమాలను కూడా చంద్రశేఖర్ రావు మార్చుకుంటున్నారు. బీజేపి గట్టి పోటీ ఇచ్చే క్రమంలో తన పరిధిని విస్తరించుకునేందుకు టీఆర్ఎస్ గా కొనసాగుతున్న పార్టీని భారత్ రాష్ట్ర సమితిగా రూపొందించారు. అంతే కాక తెలంగాణలో ప్రజా మహాసంగ్రామ యాత్ర పేరుతో బండి సంజయ్ తలపెట్టిన యాత్రకు శాంతిభద్రతల పేరుతో అనుమతులను నిరాకరిస్తూ బీజేపికి ఇబ్బందికర పరిస్థితులను కల్పించే ప్రయత్నం చేస్తున్నట్టు చర్చ జరుగుతోంది. ఈ పరిణామాలతో బీజేపి వర్సెస్ టీఆర్ఎస్ రాజకీయాలు తారా స్తాయిలో వాడివేడిగా కొసాగుతున్నాయి. సరిగ్గా ఇదే సమయంలో వైయస్సార్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైయస్ షర్మిళ తెర మీదకు వచ్చారు.

పాదయాత్రకు పర్మిషన్ చిచ్చు..

పాదయాత్రకు పర్మిషన్ చిచ్చు..

తెలంగాణలో పాదయాత్రల సీజన్ కొనసాగుతున్నట్టు తెలుస్తోంది. మొన్నటి వరకూ రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర, అంతకు ముందు బండి సంజయ్ నాలుగవ విడత పాదయాత్ర, ఇక ఇప్పటికే కొనసాగుతున్న షర్మిళ మహాప్రస్తానం పాద యాత్రతో తెలంగాణ రాజకీయం ఊపుమీద ఉన్నట్టు చర్చ జరుగుతోంది. కాగా బండి సంజయ్ ఐదవ విడత పాదయాత్రను నిజామాబాద్ జిల్లా భైంసా నుండి ప్రారంభమయ్యేలే రూపకల్పన చేసారు బీజేపి యాత్రా ప్రముఖులు. అంత వరకూ బాగానే ఉన్నప్పటికీ యాత్ర కొన్ని గంటల ముందు శాంతిభద్రతల అంశంతలెత్తే అవకాశం ఉన్నందున అనుమతులు ఇవ్వలేకపోతున్నామని పోలీసులు తేల్చి చెప్పడంతో పాటు బండి సంజయ్ ని అదుపులోకి తీసుకున్నారు.

తెలంగాణ ప్రభుత్వ నిరంకుశ వైఖరిని ఖండిస్తున్నామంటూనే న్యాయ స్దానం నుండి అనుమతులు తెచ్చుకుని పాద యాత్ర చేస్తామని బీజేపి స్పష్టం చేసింది. సరిగ్గా ఇదే సమయంలో షర్మిళ పాదయాత్రలో కూడా పదనిసలు చోటుచేసుకున్నాయి.

కమలంతో ఢీ అంటున్న కారు..

కమలంతో ఢీ అంటున్న కారు..

ఉమ్మడి వరంగల్ జిల్లాలో షర్మిళ యాత్రకు ప్రతిష్టంభన నెలకొంది. సీఎం చంద్రశేఖర్ రావు తో పాటు స్థానిక ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డిని వైయస్ షర్మిళ ఘాటుగా విమర్శించారు. అనేక ఆరోపణలు ఎక్కుపెట్టారు. దీంతో ఆగ్రహానికి గురైన గులాబీ శ్రేణులు నర్సంపేట సమీనంలో షర్మిళ ఫ్లెక్సీలకు నిప్పంటించడంతో పాటు ఆమె సేదతీరే వాహనాన్ని కూడా తగలబెట్టే ప్రయత్నం చేసారు. దీంతో పరిస్ధితి అదుపుతప్పే ప్రమాదం ఉందని భావించిన పోలీసులు వైయస్ షర్మిళను అదుపులోకి తీసుకుని లోటస్ పాండ్ లోని తన నివాసంలో విడిచిపెట్టారు. దీంతో హోరా హోరీగా సాగుతున్న కమలం-గులాబీ రాజకీయాల్లోకి షర్మిళ ఊహించని ఎంట్రీ ఇచ్చినట్టు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+