కవితకు కోర్టు నుంచి స్వల్ప ఊరట: ఇంటి భోజనంతోపాటు వాటికి అనుమతి

న్యూఢిల్లీ: ఢిల్లీ లిక్కర్ కేసులో అరెస్టై తీహార్ జైల్లో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు అవసరమైన వసతులు కల్పించాలని రౌస్ ఎవెన్యూ కోర్టు తాజాగా, మరోసారి జైలు అధికారులను ఆదేశించింది. మరోవైపు, కొన్ని వస్తువులను స్వయంగా సమకూర్చుకునేందుకు అవకాశం ఇచ్చింది. జపమాల, పుస్తకాలు, పెన్నులు, ఇతర వస్తువులతోపాటు మెడిటేషన్ చేసుకునేందుకు అనుమతించింది.

అంతేగాక, ఇంటి నుంచి ఆహారం, పరుపు, దుప్పట్లు తెచ్చుకునేందుకు, ఆభరణాలు ధరించేందుకు, లేసులు లేని బూట్లకు అనుమతించాలని రౌస్ ఎవెన్యూ కోర్టు ఆదేశించింది. మార్చి 26న ఇచ్చిన ఉత్తర్వుల్లో ఏ అక్కటీ అనుమతించడం లేదని కవిత తరపు న్యాయవాదులు కోర్టు దృష్టికి తీసుకెళ్లారు.

Rouse Avenue Court allows kavitha to take home meal and wear ornaments

అయితే, కోర్టు ఉత్తర్వుల్లో పేర్కొన్న అన్నింటినీ తెచ్చుకునేందుకు అనుమతించినట్లు జైలు సూపరింటెండెంట్ న్యాయస్థానానికి తెలిపారు. దీనిపై స్పందించిన రౌస్ ఎవెన్యూ కోర్టు మరోసారి స్పష్టంగా లిఖితపూర్వకంగా ఆదేశాలు జారీ చేసింది.

కవిత బెయిల్ పిటిషన్ విచారణ వాయిదా

బీఆర్​ఎస్​ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మధ్యంతర బెయిల్ పిటిషన్లపై విచారణ ఏప్రిల్ 4కు వాయిదా పడింది. సుదీర్ఘ వాదనలు అనంతరం, ఈడీ దాఖలు చేసిన కౌంటర్‌కు రిజాయిండర్ దాఖలు చేసేందుకు కవిత తరపు న్యాయవాది అభిషేక్ సింఘ్వి సమయం కోరారు. ఈ మేరకు న్యాయస్థానం విచారణ వాయిదా వేసింది.

తన కుమారుడి పరీక్షల దృష్ట్యా ఏప్రిల్ 16వరకు బెయిల్ మంజూరు చేయాలని, మార్చి 26న ఆమె రౌస్ అవెన్యూ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కవిత పిటిషన్‌​పై సమాధానం చెప్పాలని.. రౌస్ అవెన్యూ సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం ఈడీకీ నోటీసులు జారీచేసింది. ఈడీ కస్టడీ మార్చి 26న ముగియటంతో అదేరోజు రౌస్​ అవెన్యూ కోర్టులో దర్యాప్తు సంస్థ అధికారులు ఆమెను హాజరుపరిచారు.

: కేసు దర్యాప్తు పురోగతిలో ఉందని, పలువురు నిందితులను ఇంకా ప్రశ్నిస్తున్నందున 15 రోజుల జ్యుడిషియల్ కస్టడీకి పంపాలని కోరారు. కవిత కుమారుడికి పరీక్షల షెడ్యూల్ విడుదల అయ్యిందని కోర్టుకు వెల్లడించిన ఆమె తరఫు న్యాయవాది, మధ్యంతర బెయిల్ మంజూరు చేయాలని కోరారు. ఇరువైపులా వాదనలు విన్న కోర్టు కవితకు 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది.

ఈ మేరకు ఏప్రిల్ 9 వరకూ ఈ రిమాండ్ కొనసాగనుండగా ఆమెను తిహార్ జైలుకు అధికారులు పంపించారు. ఈ నేపథ్యంలోనే కవిత దాఖలు చేసిన మధ్యంతర బెయిల్ పిటిషన్ పై న్యాయస్థానం విచారణ జరిపింది. ఈడీ కౌంటర్‌కు ఏప్రిల్ 3 సాయంత్రానికి రిజాయిన్డర్ దాఖలు చేస్తామని కవిత తరపు న్యాయవాదులు కోర్టుకు తెలిపారు. ఈ మేరకు తదుపరి విచారణ ఏప్రిల్ 4న మధ్యాహ్నం రెండున్నరకు రౌస్ అవెన్యూ కోర్టు విచారణ జరపనుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+