RRR Movie: మాతృ భూమిపై అడుగు పెట్టగానే జైహింద్ అంటూ నినాదాలు చేసిన రాజమౌళి..!
ఆర్ఆర్ఆర్ టీంకు శంషాబాద్ లో అభిమానులు ఘనస్వాగతం పలికారు.
ప్రపంచ వేదికపై తెలుగోడి సత్తా చాటిన ఆర్ఆర్ఆర్(RRR) టీం సగర్వంగా ఇండియాకు తిరుగొచ్చింది. మూవీ డైరెక్టర్(Rajamouli), ఆయన భార్య రమ, సంగీత దర్శకుడు కీరవాణి(Keeravani), కార్తికేయ, కాలభైరవ శుక్రవారం హైదరాబాద్ చేరుకున్నారు. తెల్లవారుజామున 3 గంటలకు వీరు శంశాబాద్ ఎయిర్ పోర్టుకు చేరుకున్నారు. వీరికి అభిమానులు ఘనస్వాగతం పలికారు. రాజమౌళి మీడియాతో మాట్లాడలేదు.. కానీ ఆయన జైహింద్ అంటూ నినాదాలు చేసి వెళ్లిపోయారు. నాటు నాటు పాటకు ఆస్కార్ వచ్చిన తర్వాత ఇటీవలే జూ.ఎన్టీఆర్ అమెరికా నుంచి వచ్చిన సంగతి తెలిసిందే.
ఆర్ఆర్ఆర్ చిత్రంలోని నాటు నాటు పాటకు కీరవాణి, చంద్రబోస్ అకాడమీ అవార్డు అందుకున్నారు. దీంతో ఆస్కార్ అందుకున్న తొలి తెలుగు చిత్రంగా ఆర్ఆర్ఆర్ నిలిచింది. మరోవైపు నాటు నాటు పాటుకు ఆస్కార్ అందుకున్న తర్వాత రామ్ చరణ్ తొలిసారిగా ప్రధాని మోడీని కలిశారు. రామ్ చరణ్ ప్రధానితో పాటు ఇండియా క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ కలిసి ఇండియా టూడే కాన్ క్లేవ్ లో పాల్గొన్నారు.

నాటు నాటు పాకు ప్రపంచ గుర్తింపు రావడం పట్ల ప్రధానితో పాటు ప్రముఖలందరూ అభినందనలు తెలిపిన విషయం తెలిసిందే. ఆర్ఆర్ఆర్ చిత్రంలోని నాటు నాటు పాటకు జూ.ఎన్టీఆర్, రామ్ చరణ్ కలిసి చేసిన డ్యాన్స్ ప్రపంచాన్ని ఉర్రూతలూగిస్తుంది. ఈ పాటను చంద్రబోస్ రాయగా.. కీరవాణి సంగీతం అందించారు. రాహుల్ సిప్లిగంజ్, కాల భైరవ ఈ పాటను ఆలపించారు.
ఆస్కార్ తో హైదరాబాద్కు చేరుకున్న ఆర్ఆర్ఆర్ టీం..!!#RRR #RRRMovie #NaatuNaatuWinsOscar #NaatuNaatu #SSRajamouli #MMKeeravani #Oneindiatelugu pic.twitter.com/31AUxwq4vo
— oneindiatelugu (@oneindiatelugu) March 17, 2023
మన దేశం వారు ఎన్నో గొప్ప సినిమాలు చేశారని.. కానీ మనకు ఉత్తమ చిత్రంగా అవార్డు రాలేదని ఏఆర్ రెహమాన్ అన్నారు. మన దేశవారు ఉత్తమ చిత్రాలను పంపకుండా ఏవో చిత్రాలను పంపిస్తున్నారని అన్నారు. అందుకు మనకు ఆస్కార్లు రావడం లేదన్నారు.












Click it and Unblock the Notifications