హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

షాక్: రూ.10కోట్ల పన్ను ఎగ్గొట్టిన ఐమాక్స్, సాకులొద్దంటూ టీ సర్కారు వార్నింగ్

హైదరాబాద్ నగరానికి ప్రత్యేక ఆకర్షణలలో ఒకటైన ప్రసాద్స్ ఐమాక్స్ ప్రభుత్వానికి పన్ను ఎగ్గొడుతున్నట్లు తెలిసింది.

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: నగరానికి ప్రత్యేక ఆకర్షణలలో ఒకటైన ప్రసాద్స్ ఐమాక్స్ ప్రభుత్వానికి పన్ను ఎగ్గొడుతున్నట్లు తెలిసింది. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా పదేళ్ల నుంచి రూ.10కోట్ల మేర పన్ను ఎగవేసినట్లు ఓ తెలుగు మీడియా దీనిపై ఓ కథనం ప్రచురితం చేసింది. అయితే, గత ప్రభుత్వాలతో చేసుకున్న ఒప్పందం మేరకు తాము ఇప్పుడు నడుచుకుంటున్నామని ప్రసాద్స్ ఐమాక్స్ చెబుతుండటం గమనార్హం.

చర్యలు తప్పవు..

చర్యలు తప్పవు..

ఆ వివరాల్లోకి వెళితే.. ప్రభుత్వానికి పన్ను కట్టకుండా ఎగవేతకు పాల్పడుతున్న సంస్థలపై తెలంగాణ పర్యాటక, సాంస్కృతిక శాఖ ఓ కన్నేసింది. ఈ క్రమంలోనే 2008 నుంచి ఇప్పటివరకు ఉన్న బకాయిలను వడ్డీతో సహా చెల్లించాలని, లేకపోతే కఠిన చర్యలు తప్పవని హెచ్చరిస్తూ ఐమాక్స్‌కు ఫైనల్ నోటీసును జారీ చేసింది. లేనిపక్షంలో న్యాయపరమైన చర్యలు తీసుకుంటామని కూడా లేఖలో హెచ్చరించింది.

బాబు హయాంలో లీజు ఒప్పందం

బాబు హయాంలో లీజు ఒప్పందం

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబునాయుడు ఉన్న సమయంలో హైదరాబాద్‌లోని ట్యాంక్‌బండ్ దిగువన ప్రసాద్ మీడియా కార్పొరేషన్‌కు సుమారు రెండెకరాల స్థలాన్ని ప్రభుత్వం కేటాయించింది. 2000 సంవత్సరంలో జరిగిన ఈ ఒప్పందంలో 33 సంవత్సరాల లీజుకు స్థలాన్ని ఇస్తున్నట్లు ప్రభుత్వం పేర్కొంది. ఈ స్థలంలో రూ.60కోట్లతో మల్టీప్లెక్స్ నిర్మిస్తామని, పర్యాటకులకు అనుగుణంగా ఏర్పాట్లు చేస్తామని లీజు సమయంలో ఆ సంస్థ ప్రభుత్వానికి హామీ ఇచ్చింది.

నెలకు 30 నుంచి 40లక్షలు..

నెలకు 30 నుంచి 40లక్షలు..

ఆనాడు ఇక్కడ రెండెకరాల భూమిని లీజుకు తీసుకోవడానికి పెద్దపెద్ద దేశీయ ఎంటర్‌టైన్‌మెంట్ సంస్థలు పోటీపడ్డాయి. మిగిలిన పోటీదారులకన్నా ప్రసాద్ ఎంటర్‌టైన్‌మెంట్ సంస్థ లీజు మొత్తాన్ని ఎక్కువ ఇస్తామని చెప్పింది. నెలకు రూ.12 లక్షలతోపాటు మొత్తం మల్టీప్లెక్స్‌కు వచ్చే నికర ఆదాయంలో 15 శాతాన్ని ప్రతినెలా చెల్లించేందుకు ఒప్పుకుంది. దీనికి అనుగుణంగా ఆ సంస్థ నెలనెలా రూ.12 లక్షలు లీజు మొత్తంతోపాటు, నికర ఆదాయంలో(పన్నులు మినహాయించి) 15 శాతాన్ని కూడా చెల్లిస్తూ వస్తోంది. ఇలా చెల్లిస్తున్న 15 శాతానికిగాను సగటున ప్రతినెలా 35-40 లక్షల రూపాయలు తెలంగాణ పర్యాటక శాఖకు వస్తున్నాయి. మల్టీప్లెక్స్‌కు రద్దీపెరిగిన సందర్భాల్లో రూ.80 లక్షలు కూడా వచ్చాయి.

2008 నుంచే మొదలైందీ ఎగవేత?

2008 నుంచే మొదలైందీ ఎగవేత?

2008వ సంవత్సరం వరకు అంతా సవ్యంగానే నడిచింది. 2008లో ప్రసాద్ మల్టీప్లెక్స్ యాజమాన్యం చెల్లించే ఆదాయపన్నును కూడా మినహాయించుకొని ప్రభుత్వానికి లీజు మొత్తాన్ని, ప్రాఫిట్ షేర్‌ను కడుతోంది. వాస్తవానికి ఆ సంస్థకు వచ్చే ఆదాయంపై వారు ఆదాయపన్ను వ్యక్తిగతంగా చెల్లించుకోవాలి. ప్రభుత్వానికి చెల్లించే మొత్తంపై ప్రసాద్ మల్టీప్లెక్స్ ఆదాయపన్ను మినహాయించుకోవడం ఒప్పంద విరుద్ధం. అయితే అగ్రిమెంటులో పన్నులన్నీ అని ఉందని, అలాంటప్పుడు ఆదాయపన్ను కూడా అందులోకే వస్తుందంటూ సంస్థ వాదిస్తోంది. దేశంలో ఏ సంస్థ కూడా ఇలా ఆదాయపన్నును మినహాయించడంలేదని, ఎవరి ఆదాయంపై వారు పన్ను చెల్లించుకుంటారని, ఇక్కడ అగ్రిమెంట్‌లో పన్నులు అంటే వినోద పన్ను, వ్యాట్ వంటివి మాత్రమేనని ప్రభుత్వం ఎంత చెప్పినా, ప్రసాద్ మల్టీపెక్స్ యాజమాన్యం వినిపించుకోలేదు. ప్రభుత్వం స్పష్టత ఇచ్చినప్పటికీ ఆదాయపన్నును మొత్తం ఆదాయం నుంచే మినహాయిస్తోంది. దీనివల్ల పర్యాటక శాఖకు గడిచిన పదేళ్లలో రూ.పదికోట్లు వరకు నష్టం కలిగినట్లుగా అధికారులు గుర్తించారు. దీంట్లో రూ.ఆరున్నరకోట్లు అసలు కాగా, రూ.మూడున్నరకోట్లు వడ్డీ. ఈ సొమ్మును తక్షణం చెల్లించాలని ఆదేశించినా, ఐమాక్స్ యాజమాన్యం నుంచి ఎలాంటి స్పందనా లేదు. పర్యాటక శాఖ కార్యదర్శి బుర్రవెంకటేశం ఆ సంస్థతో మాట్లాడారు. దేశంలో ఎక్కడా ఆదాయపన్నును లీజు ఇచ్చిన వారి ఆదాయం నుంచి మినహాయించారని వివరించినా ఆ సంస్థ పట్టించుకోవడం లేదు. దీంతో ఇటీవలే ఫైనల్ నోటీసును పర్యాటక శాఖ.. ఐమాక్స్ యాజమాన్యానికి పంపింది. సరైన స్పందన రాకపోతే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించింది.

భూ కేటాయింపే అక్రమమా?

భూ కేటాయింపే అక్రమమా?

హైదరాబాద్ నగరం నడిబొడ్డున ఐమాక్స్ మల్టీప్లెక్స్‌కు స్థలం కేటాయింపు నిబంధనలకు విరుద్ధమన్న ఆరోపణలున్నాయి. అంతేగాక, దీనిని చెరువు శిఖంలో నిర్మించారు. 2000 సంవత్సరంలోనే ఆనాటి ప్రభుత్వం ప్రసాద్ మల్టీప్లెక్స్‌కు స్థలం కేటాయించింది. అయితే, 2003 వరకు వివాదాలు నడిచాయి. 2003 నుంచి అగ్రిమెంట్ అమలులోకి వచ్చింది. స్థలంలో ప్రసాద్ సంస్థ తన కార్యకలాపాలను పూర్తిస్థాయిలో ప్రారంభించింది. ఇక్కడ కూడా 2000 సంవత్సరం నుంచే లీజును ఆ సంస్థ ప్రభుత్వానికి చెల్లించాల్సి ఉండేది. కానీ, వివాదాల నేపథ్యంలో ఆ సంస్థ కార్యకలాపాలు ప్రారంభించిన 2003 నుంచే లీజు, ప్రాఫిట్ షేరింగ్ ఇచ్చేలా అగ్రిమెంట్‌లో మార్పులు చేశారు. ఇదే విషయాన్ని నాటి కాంగ్రెస్ పార్టీ నేత, ఖైరతాబాద్ ఎమ్మెల్యే పి జనార్దన్‌రెడ్డి శాసనసభలోనూ లేవనెత్తారు. ఐమాక్స్‌కు స్థల కేటాయింపు నిబంధనలకు విరుద్ధమని వాదించారు. దీనిపై అప్పటి స్పీకర్ సురేష్‌రెడ్డి సభాసంఘాన్ని వేయగా, ప్రసాద్ మల్టీప్లెక్స్‌తో చేసుకున్న ఒప్పందం, భూ కేటాయింపులను రద్దు చేయాలని సభాసంఘం ప్రభుత్వానికి సిఫారసు చేసింది. భూ కేటాయింపు సుప్రీంకోర్టు సూచనలను బేఖాతర్ చేసేలా ఉన్నాయని కూడా చెప్పింది. దీనిపై ప్రభుత్వం తక్షణం చర్యలు తీసుకోవాలని కూడా సూచించింది. అయితే, ఆనాటి పాలకులు సభాసంఘం ఇచ్చిన నివేదికను బుట్టదాఖలు చేశారు. దీంతో ఐమాక్స్ తన కార్యకలాపాలను ఎలాంటి ఆటంటకాలు లేకుండా కొనసాగిస్తోంది. పర్యాటక శాఖ నోటీసుతో ఐమాక్స్ యాజమాన్యం స్పందించకపోతే.. ప్రభుత్వం కఠన చర్యలు తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

English summary
It is said that Rs 10 crores of tax not paid by the prasads imax to telangana government.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X