తెలంగాణలో మాస్క్ లేకుండా అడుగు బయట పెడితే.. జేబులు గుళ్లే: ఆ జోన్లలో ప్రైవేటు సంస్థలు ఓపెన్
హైదరాబాద్: ప్రాణాంతక కరోనా వైరస్ వ్యాప్తి చెందడాన్ని నివారించడానికి తెలంగాణలో ఈ నెల 29వ తేదీ వరకు లాక్‌డౌన్‌ను పొడిగించిన వేళ.. కేసీఆర్ సర్కార్ కఠిన నిబంధనలను అమలులోకి తీసుకొచ్చింది. కరోనా వైరస్ ప్రభావ రహిత ప్రాంతాల్లో సడలింపులను ఇచ్చింది. ఆరెంజ్ జోన్, గ్రీన్ జోన్లలో కొనసాగించాల్సిన కార్యకలాపాలకు సంబంధించిన మార్గదర్శకాలను విడుదల చేసింది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ దీనికి సంబంధించిన ఉత్తర్వులను జారీ చేశారు.
తెలంగాణలో అన్ని ప్రాంతాల్లోనూ మాస్క్‌లను ధరించడాన్ని ప్రభుత్వం తప్పనిసరి చేసింది. మాస్క్ లేకుండా రోడ్ల మీద తిరుగాడితే.. 1000 రూపాయల జరిమానాను విధిస్తామని హెచ్చరించింది. తాజాగా విడుదల చేసిన మార్గదర్శకాల్లో ఈ అంశాన్ని చేర్చింది. బయటకు వచ్చేవారు తప్పనిసరిగా మాస్క్ ధరించాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. ఇదివరకు తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లో మాస్క్ లేకుండా బయట తిరిగే వారికి కామారెడ్డిలో 500 రూపాయల ఫైన్‌ను విధించారు. ఈ మొత్తాన్ని పెంచాల్సి 1000కి ఉంటుంది.

గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) పరిధితో పాటు రాష్ట్రంలోని అన్ని గ్రీన్, ఆరెంజ్ జోన్లల్లో ఐటీ, ఐటీ ఆధారిత కార్యకలాపాలను కొనసాగించడానికి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. వందశాతం ఉద్యోగులతో పని చేయించుకోవచ్చని పేర్కొంది. తప్పనిసరిగా కరోనా వైరస్ సోకకుండా ముందుజాగ్రత్తలను పాటించాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. జీహెచ్ఎంసీ, రెడ్‌జోన్లలో 33 శాతం ఉద్యోగులను విధుల్లోకి తీసుకోవాల్సి ఉంటుందని పేర్కొంది.
తెలంగాణలో లాక్‌డౌన్ అమలులోకి తీసుకొచ్చిన తరువాత విధించిన 144 సెక్షన్, కర్ఫ్యూను కొనసాగిస్తామని ప్రభుత్వం పేర్కొంది. రాత్రి 7 గంటల నుంచి మరుసటి రోజు ఉదయం 7 గంటల వరకు కర్ఫ్యూ కొనసాగుతుందని, ఒకరికి మించి ఎవరూ గుమికూడొద్దని ఆదేశించింది. అత్యవసరంగా వైద్య సహాయాన్ని తీసుకోదల్చిన వారికి మినహాయింపు ఇచ్చింది. ఆసుపత్రులు, మెడికల్ షాపులు మినహా మరే ఇతర దుకాణాలను కూడా తెరవడానికి అనుమతించరు.
Recommended Video
-
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
తెలంగాణ కేబినెట్ సంచలన నిర్ణయాలు.. ఆ బిల్లులకు ఆమోదం












Click it and Unblock the Notifications