సోనియాకు ఆహ్వానం, రూ. 500 బోనస్..: తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలివే
తెలంగాణ కేబినెట్ సమావేశం ముగిసింది. కేంద్ర ఎన్నికల సంఘం అనుమతి ఇవ్వడంతో సోమవారం జరిగిన తెలంగాణ కేబినెట్ భేటీ, దాదాపు నాలుగు గంటల చర్చల అనంతరం ముగిసింది. రాష్ట్ర సచివాలయంలో మధ్యాహ్నం 3 గంటలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన ప్రారంభమైన సమావేశానికి మంత్రులు హాజరయ్యారు. ఈ భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.
ప్రధానంగా జూన్ 2న రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు ఘనంగా నిర్వహించాలని కాంగ్రెస్ సర్కారు నిర్ణయించింది. ఈ వేడుకలకు కాంగ్రెస్ అగ్రనాయకురాలు సోనియాగాంధీని ఆహ్వానించాలని నిర్ణయించారు. ధాన్యం కొనుగోళ్లు, ఖరీఫ్ సాగు ప్రణాళిక, మేడిగడ్డ బ్యారేజీ మరమ్మతులు, విద్యా సంవత్సరం ప్రారంభానికి ముందే బడులు, కళాశాలల్లో చేపట్టాల్సిన పనులు తదితర అంశాలపై కేబినెట్ చర్చించింది.

ధాన్యం కొనుగోళ్లపై పూర్తి బాధ్యత కలెక్టర్లకే అప్పగించారు. రైతులకు నష్టం జరగకుండా చివరి గింజ వరకూ కొనాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు.కేబినెట్ భేటీ తీసుకున్న నిర్ణయాలను మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, శ్రీధర్ బాబు మీడియాకు వెల్లడించారు. మేడిగడ్డపై ఎన్డీఎస్ఏ ఇచ్చిన మధ్యంతర నివేదికపైనా చర్చినట్లు మంత్రి పొంగులేటి తెలిపారు. కాళేశ్వరం విషయంలో ఎన్డీఎస్ఏ సూచనలకు అనుగుణంగా వ్యవహరిస్తామని చెప్పారు.
కేబినెట్ భేటీ కీలక నిర్ణయాలివే
సన్నవడ్లకు క్వింటాల్‌కు రూ. 500 బోనస్
అకాల వర్షాలతో తడిసిన ధాన్యాన్ని కూడా మద్దతు ధరకే సేకరించాలని
నిర్ణయం.
ఎంఎస్పీ కంటే ఒక్క రూపాయి కూడా తక్కువ చెల్లించకూడదని నిర్ణయం
రాష్ట్రానికి అవసరమైన సన్న బియ్యం అంతా రాష్ట్రంలోనే సేకరిస్తామని మంత్రులు వెల్లడించారు.
నకిలీ విత్తనాల విక్రయదారులపై కఠిన చర్యలు
ప్రభుత్వ పాఠశాలల ఆధునికీకరణకు రూ. 600 కోట్లు కేటాయింపు
అమ్మ ఆదర్శ పాఠశాలల పనులపై మంత్రి శ్రీధర్ బాబు అధ్యక్షతన కేబినెట్ సబ్ కమిటీ
కాళేశ్వరం ప్రాజెక్టులో మరమ్మతులు చేయాలని నిర్ణయం. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల ప్రాజెక్టులపై నిపుణుల కమిటీ సూచనలను అమలు చేయాలని నిర్ణయం.
కాగా, రైతు రుణమాఫీ, ఆంధ్రప్రదేశ్ - తెలంగాణ మధ్య విభజన అంశాలపై కూడా చర్చించాలని భావించినప్పటికీ.. జూన్ 4 వరకు ఆ అంశాలు పక్కన పెట్టాలని ఈసీ ఆంక్షలు విధించిన విషయం తెలిసిందే. జూన్ 4లోగా చేపట్టాల్సిన ఎమెర్జెన్సీ పనులపై మాత్రమే నిర్ణయాలు తీసుకోవాలని స్పష్టం చేసింది. రాష్ట్రంలో లోక్‌సభ ఎన్నికల నిర్వహణలో పాల్గొన్న అధికారులు కేబినెట్ భేటీకి హాజరు కావొద్దని కూడా కేంద్ర ఎన్నికల సంఘం పేర్కొంది. దీంతో ఈసీ చెప్పినట్లుగానే కేబినెట్ సమావేశం నిర్వహించారు.
-
శర్వానంద్ 'బైకర్' ఫస్ట్ రివ్యూ.. దేశంలోనే తొలి ప్రయత్నం.. -
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్ -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి?












Click it and Unblock the Notifications