రూ.6కోట్ల విదేశీ సిగరెట్లు: కంటైనర్‌లో తరలిస్తుండగా.. సీజ్ చేసిన అధికారులు

Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: విదేశాల నుంచి అక్రమంగా దిగుమతి చేస్తున్న సిగరెట్లను నగరానికి చెందిన డీఆర్‌ఐ అధికారులు సీజ్‌ చేశారు. అరబ్‌, తదితర దేశాల నుంచి విదేశీ సిగరెట్ల అక్రమ రవాణా జరుగుతోందనే సమాచారంతో డీఆర్‌ఐ పోలీసులు అప్రమత్తమయ్యారు.

rs 6crore worth foreign cigars seized in hyderabad

ఈ నేపథ్యంలో శంషాబాద్‌, రంగారెడ్డి జిల్లాలోని పలు ప్రాంతాల్లో నిఘా పెట్టగా.. ఓ కంటైనర్‌లో తరలిస్తున్న విదేశీ సిగరెట్లను గుర్తించారు. అందులో బాక్సులన్నింటిలో విదేశీ సిగరెట్లు ఉన్నట్లు గుర్తించారు. వీటి విలువ రూ.6.33కోట్లు ఉంటుందని అంచనా. సిగరెట్లు ఉన్నాయన్న అనుమానం రాకుండా బాక్సులను ప్రత్యేకంగా ప్యాకింగ్ చేసినట్లు తెలుస్తోంది.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Directorate of Revenue Intelligence police seized Rs6 crore worth foreign cigars in Hyderabad.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి