Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

RS Praveen Kumar: ఎర్రబెల్లి దయాకర్ రావును ఎన్నికల్లో పోటీ చేయనివ్వొద్దు..

సీఎం కేసీఆర్, మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావును ఎన్నికల్లో పోటీ చేయకుండా కేంద్ర ఎన్నికల సంఘం నిషేధం విధించాలని డిమాండ్ బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ డిమాండ్ చేశారు. ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే గడువులోగా పథకాలన్నింటిని తమకు ఓట్లు వేసే వారికే విడుదల చేయాలని అని మంత్రి ఎర్రబెల్లి చెప్పడం దారుణమన్నారు. ఎర్రబెల్లి దయాకర్ రావు తన మంత్రి పదవిని దుర్వినియోగం చేశారని ప్రవీణ్ కుమార్ ఆరోపించారు.

ఎర్రబెల్లి వ్యాఖ్యల వెనకాల సీఎం కేసీఆర్ ఉన్నారని చెప్పారు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ లో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సమక్షంలో పలువురు నాయకులు బీఎస్పీలో జాయిన్ అయ్యారు. పోలీసులను చేతిలో పెట్టుకుని కేసీఆర్ పాలన కొనసాగిస్తున్నారని పేర్కొన్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో జగదీశ్ రెడ్డి తనకు అనుకూలమైన పోలీసులు నియమించుకున్నారని విమర్సించారు. వందల కోట్ల డబ్బులు పంచినా ఎవరూ పట్టుకోలేదన్నారు.

RS Praveen Kumar said that Errabelli Dayakar Rao should not be allowed to contest the election
స్వయంగా మంత్రుల కార్లలో వందల కోట్ల డబ్బులు తెచ్చి ఇంటింటికి పంచినా ఎవరూ పట్టించుకోలేదని చెప్పారు. మునుగోడు నియోజకవర్గాన్ని దత్తత తీసుకుంటానని చెప్పిన కేటీఆర్ పై కేసు పెట్టాలన్నారు. దండు మల్కాపురం గ్రామంలో 600 ఎకరాల కాందిశికుల భూమి పై మంత్రి జగదీష్ రెడ్డి, ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి కన్ను వేశారని విమర్శించారు. దత్తత తీసుకోవడం అంటే ఇదేనా అని ప్రశ్నించారు.

మరోవైపు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఓ కార్యక్రమంలో షాద్ నగర్ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ తల మీద మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కొట్టారు. ఇందుకు సంబంధంచిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఎర్రబెల్లి దయాకర్ రావు తల మీద కొట్టిన ఘటన మీద షాద్ నగర్ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ వివరణ ఇచ్చారు. ఎర్రబెల్లి తనను ఎంతో బాగా చూసుకుంటారని చెప్పారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+