భూపాలపల్లి జిల్లాలో ఆర్టీసీ బస్సు బోల్తా....30 మందికి గాయాలు

తెలంగాణ రాష్ట్రం భూపాలపల్లి జిల్లాలో మరో ఆర్టీసీ బస్సు ప్రమాదం జరిగింది. ఆర్టీసీకి చెందిన హైర్ బస్సు జిల్లాలోని గోదావరిఖని నుండి భూపాలపల్లి వెళుతున్న మార్గంలో జిల్లాలోని మల్హర్ మండలం పీవీనగర్ వద్ద బస్సు బోల్తాపడింది. బస్సులో సుమారు 63 మంది ప్రయాణిస్తున్నట్టు సమాచారం.

RTC bus accident ,30 passengers wereinjured in Bhupalapalli district

కాగా సుమారు 30 మంది ప్రయాణికులకు తీవ్రగాయాలు అయ్యాయి. క్షతాగాత్రులను దగ్గరలోని ఆసుపత్రికి తరలించారు.

RTC bus accident ,30 passengers wereinjured in Bhupalapalli district

ఇందులో తీవ్ర గాయలు అయిన వారికి మెరుగైన చికిత్స కోసం వరంగల్‌కు తరలిస్తున్నట్టు సమాచారం. బస్సు డ్రైవర్ నిర్షక్ష్యంతో ఒక్కసారిగా బస్సు బోల్తాపడినట్టు తెలుస్తోంది. బస్సు స్పీడుగా వెళ్తున్న నేపథ్యంలో డ్రైవర్ గుట్కావేసుకునేందుకు ప్రయత్నించాడని అయితే అక్కడే స్పీడ్ రావడంతో బస్సు ఒక్కసారిగా బోల్తాపడిందని ప్రయాణికులు చెబుతున్నారు.

RTC bus accident ,30 passengers wereinjured in Bhupalapalli district

కాగా బస్సు డ్రైవర్ పరారీలో ఉన్నారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు తగిన చర్యలు చేపడుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+