ఆర్టీసీ విలీనం బిల్లు ఆమోదం లో కొత్త ట్విస్ట్ - బైఠాయింపు, చర్చలకు ఆహ్వానం..!!
తెలంగాణ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని మంత్రివర్గం నిర్ణయించింది. దీనికి సంబంధించి బిల్లును సభలో ప్రవేశ పెట్టేందుకు గవర్నర్ అనుమతి కోరింది. కానీ, గవర్నర్ ఆమోదించ లేదు. దీని పైన వివరణ కోరుతూ రాజ్ భవన్ ప్రభుత్వానికి లేఖ రాసిది. ఇదే సమయంలో బిల్లు ఆమోదించాలని కోరుతూ ఆర్టీసి కార్మికులు రాజ్ భవన్ వద్ద బైఠాయించారు. ఈ సమయంలో కార్మిక సంఘాల నేతలను చర్చలకు రావాలని రాజ్ భవన్ ఆహ్వానించింది.
ప్రభుత్వ వివరణ కోరిన గవర్నర్ : తెలంగాణలో టీఎస్ఆర్టీసి బిల్లును గవర్నర్ ఇంకా ఆమోదించ లేదు. దీని పైన ప్రభుత్వం నుంచి అయిదు అంశాలపైన వివరణ కోరారు. 1958 నుండి ఆర్టీసీ లో కేంద్ర గ్రాంట్ లు, వాటా లు, లోన్లు, ఇతర సహాయం గురించి బిల్లు లో ఎలాంటి వివరాలు లేవుని ప్రభుత్వానికి పంపిన లేఖలో పేర్కొన్నారు.

రాష్ట్ర విభజన చట్టం షెడ్యూల్ IX ప్రకారం ఆర్టీసీ స్థితి ని మార్చడం పై సమగ్ర వివరాలు బిల్లు లో లేవని గుర్తు చేసారు. ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగుల తో సమానం గా పరిగణిస్తామని చెబుతున్న ప్రభుత్వం...వారి సమస్యల కు ఇండస్ట్రియల్ డిస్ప్యూట్స్ చట్టం, కార్మిక చట్టాలు వర్తిస్తాయా, వారి ప్రయోజనాలు ఎలా కాపాడబడ తాయి అని గవర్నర్ ప్రశ్నించారు.
రాజ్ భవన్ వద్ద కార్మికుల ఆందోళ : విలీనం డ్రాఫ్ట్ బిల్లు లో ఆర్టీసీ ఉద్యోగులు అందరికీ ప్రభుత్వ ఉద్యోగుల తో సమానం గా పెన్షన్ ఇస్తారా, వారి కి ప్రభుత్వ ఉద్యోగుల తో సమానం గా అన్ని ప్రయోజనాలు ఇవ్వడాని కి సంబంధించి స్పష్టమైన వివరాలు ఇవ్వాలని గవర్నర్ ప్రభుత్వాన్ని కోరారు.
ప్రభుత్వ ఉద్యోగుల లో కండక్టర్, కంట్రోలర్ లాంటి తదితర పోస్టులు లేనందున వారి ప్రమోషన్లు, వారి క్యాడర్ నార్మలైజేషన్ లాంటి విషయాల్లో ఆర్టీసీ ఉద్యోగుల కు న్యాయం, ఇతర ప్రయోజనాలు అందే విధంగా స్పష్టమైన వివరాలు ఇవ్వాలని గవర్నర్ ప్రభుత్వానికి సూచించారు. ఆర్టీసీ కార్మికుల భద్రత, భవిష్యత్ ప్రయోజనాల పై మరిన్ని స్పష్టమైన హామీలు కావాలని గవర్నర్ కోరారు. దీంతో, వీటి పైన స్పష్టత ఇచ్చేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది.

చర్చలకు ఆహ్వానించిన గవర్నర్ : ఇదే సమయంలో గవర్నర్ ఆర్టీసీ బిల్లు ఆమోదించాలని డిమాండ్ చేస్తూ కార్మిక సంఘాలు నిరసనకు దిగాయి. బస్సులను రెండు గంటల పాటు నిలిపివేసారు. హైదరాబాద్ లో ర్యాలీగా రాజ్ భవన్ వద్దకు చేరుకున్నారు. గవర్నర్ బిల్లు ఆమోదించాలంటూ నినాదాలు చేసారు. రాజ్ భవన్ ఎదుట బైఠాయించారు. ఈ సమయంలో గవర్నర్ స్పందించారు.
తాను కార్మికుల ప్రయోజనాలకు వ్యతిరేకం కాదని స్పష్టం చేసారు. గతంలో సమ్మె సమయంలోనూ తాను అండగా నిలిచానని గుర్తు చేసారు. కార్మికుల ఆందోళన నేపథ్యంలో కార్మిక సంఘాల నేతలను వీడియో కాన్ఫిరెన్స్ ద్వారా చర్చలకు రావాలని రాజ్ భవన్ నుంచి ఆహ్వానం అందింది. సామాన్యలకు ఇబ్బంది కలిగించే నిర్ణయాలు వద్దని కార్మిక సంఘాలకు గవర్నర్ సూచించారు.












Click it and Unblock the Notifications