వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రైల్వే కోచ్ ఫ్యాక్టరీ: కెసిఆర్‌తో రుయా(ఫొటోలు)

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: రాష్ట్రంలో మరో ప్రఖ్యాత పరిశ్రమ ఏర్పాటుకు రంగం సిద్ధమవుతోంది. తెలంగాణలో అత్యాధునిక రైల్వే కోచ్‌ల తయారీ ఫ్యాక్టరీని ఏర్పాటు చేసే ఆలోచన ఉందని రుయా గ్రూప్ ఆఫ్ కంపెనీస్ చైర్మన్ పవన్ కుమార్ రుయా తెలిపారు. గురువారం మధ్యాహ్నం సిఎం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావును పవన్‌కుమార్ రుయా కలిశారు.

రాష్ట్రంలో పరిశ్రమలు స్థాపించాలని ఉత్సాహంతో ఉన్నట్లు ఆయనకు చెప్పారు. రైలు కోచ్‌ల తయారీ రంగంలో ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన యూరప్‌కు చెందిన కంపెనీతో కలిసి ఫ్యాక్టరీ నెలకొల్పాలని ఆలోచిస్తున్నట్లు ఆయన చెప్పారు. అదే సమయంలో హైదరాబాద్ పరిధిలో ఒక స్మార్ట్ సిటీని కూడా అభివృద్ధి చేయాలనే ఆలోచన ఉందని ఆయన సీఎంకు తెలియజేశారు.

Ruia Group plans rail coach unit in Telangana

రుయా కంపెనీ చైర్మన్ చేసిన ప్రతిపాదనలు, విజ్ఞప్తికి ముఖ్యమంత్రి కేసీఆర్ స్పందిస్తూ.. ప్రపంచంలోనే అతి పెద్దదైన మెట్రోరైల్ హైదరాబాద్‌లో ఉందని, దానిని మరింత విస్తృతపరుస్తున్నామని పేర్కొన్నారు. రుయా కంపెనీ ఆలోచనలకు అనుగుణంగా, ఏర్పాటు చేయాలనుకునే పరిశ్రమలకు కావాల్సిన సహాయ సహకారాలు అందించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు.

Ruia Group plans rail coach unit in Telangana

హైదరాబాద్‌లో పరిశ్రమల ఏర్పాటుకు అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నామని, కంపెనీ ఇక్కడికి వస్తే.. వారి పరిశ్రమలకు సానుకూలత ఉంటుందని చెప్పారు. ఇందుకు సంబంధించిన అధికారులకు ఆదేశాలిస్తూ.. రుయా కంపెనీ ప్రతిపాదనలపై పూర్తిగా చర్చించాలని, కంపెనీకి కావాల్సినవాటిని గుర్తించాలని సూచించారు.

English summary
Ruia Group is interested in setting up a plant for manufacturing railway coaches in Telangana, its chairman Pawan Kumar Ruia conveyed to Chief Minister K. Chandrashekhar Rao on Thursday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X