వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

గులాబీ సీజ‌న‌ల్ ఆఫ‌ర్..! క్లియ‌రెన్స్ సేల్ దిశ‌గా తెలంగాణ కాంగ్రెస్...!!

|
Google Oneindia TeluguNews

తెలంగాణ‌లో తెలుగుదేశం క‌థ దాదాపు క్లైమాక్స్ కు చేరుకుంది. ఇక మిగిలిన మ‌రో రాజ‌కీయ పార్టీ కాంగ్రెస్ ప‌రిస్థితి కూడా దాదాపు అదే బాట‌లో ప‌య‌నిస్తోంది. వ‌న‌మా, సుధీర్‌రెడ్డి, జ‌గ్గారెడ్డి ముగ్గురు ఎమ్మెల్యేలు కూడా కారు ఎక్కేందుకు సిద్ధ‌ప‌డ్డారు. ఇన్నేళ్లు, హ‌స్తం గూటిలో ప‌ద‌వులు అనుభ‌వించి కాంగ్రెస్ పార్టీకి చేవెళ్ల చెల్లెమ్మ లా పేరుతెచ్చుకున్న స‌బితా ఇంద్రారెడ్డి ఇప్పుడు ముఖ్య‌మంత్రి చంద్ర‌శేఖ‌ర్ రావుకు ప్ర‌గ‌తి భ‌వ‌న్ చెల్లెమ్మ‌గా మారారు. ఇదంతా గులాబీ బాస్ న‌డుపుతున్న మంత్రాంగమే కాకుండా పార్టీలో చేర‌బోతున్న వారికి బంప‌ర్ ఆఫ‌ర్లు ఇస్తున్నందుకు ఆక‌ర్శితుల‌వుతున్న‌ర‌నే చ‌ర్చ జ‌రుగుతోంది.

గులాబీ పార్టీలోకి క్యూ క‌డుతున్న కాంగ్రెస్ ఎమ్మెల్యేలు.!అభివ్రుద్దిని చూసే వ‌స్తున్నారంటున్న టీఆర్ఎస్.!

గులాబీ పార్టీలోకి క్యూ క‌డుతున్న కాంగ్రెస్ ఎమ్మెల్యేలు.!అభివ్రుద్దిని చూసే వ‌స్తున్నారంటున్న టీఆర్ఎస్.!

ప్ర‌తి ప‌క్ష పార్టీల‌ను బ‌ల‌హీన ప‌ర‌చ‌డం వెనుక కేవ‌లం తెలంగాణ‌పై ప‌ట్టు చిక్కించుకోవాల‌నే ల‌క్ష్య‌మే కాకుండా, జాతీయ‌ రాజ‌కీయాల్లో తాను ఏ విధంగా చతుర‌త ప్ర‌ద‌ర్శించ‌గ‌నో చాటిచెప్పే ఉద్దేశం కూడా చంద్ర‌శేఖ‌ర్ రావుకు ఉంద‌టున్నాయి పార్టీ వ‌ర్గాలు. మోదీ హ‌వా త‌గ్గిందని, రాహుల్ ఇంకా పుంజుకోలేదు కాబ‌ట్టి రేపు కేంద్రంలో సంకీర్ణ ప్ర‌భుత్వాలే పెద్ద‌దిక్కని, దీనికి కేసీఆర్ మార్గ‌ద‌ర్శ‌నం చేయ‌గ‌ల‌డని గులాబీ వ‌నంలో చ‌ర్చ జ‌రుగుతోంది.

 పార్టీలో చేరిన వారికి ప‌ద‌వులు..! గులాబీ పార్టీ బంపర్ ఆఫ‌ర్లు..!!

పార్టీలో చేరిన వారికి ప‌ద‌వులు..! గులాబీ పార్టీ బంపర్ ఆఫ‌ర్లు..!!

దాంతోపాటే నేత‌ల‌నూ ఆక‌ర్శించేందుకు తాయిలాలు కూడా స‌ర్దుబాటు చేసార‌నే చ‌ర్చ కూడా జ‌రుగుతోంది. ఇప్పుడు నోట్ల‌క‌ట్ట‌లు కూడా రాజ‌కీయ నేత‌ల‌ను ఆక‌ర్శించేదుకు ప్ర‌ధాన పాత్ర పోషిస్తున్న‌ట్టు తెలుస్తోంది. రాజ‌కీయాల‌ను న‌డిపించే నిచ్చెన‌లుగా కూడా నిధులు మారాయి. ప్ర‌త్య‌ర్థి శిబిరాన్ని బ‌ల‌హీన‌ప‌రిచేందుకు అస్త్రంగా మారాయి. నియోజ‌క‌వ‌ర్గాల అభివృద్ధి, అభిమానుల కోరిక మేర‌కు తాము పార్టీ మారుతున్నామంటూ కొత్త పార్టీలోకి చేరిన ప్ర‌తి ఒక్క నేత చెప్పే రొటీన్ స‌మాధానం ఇదే.

ఇక్కడి నుంచి బరిలోకి రేవంత్... టీకాంగ్రెస్ లోక్‌సభ అభ్యర్థుల తొలిజాబితా విడుదలఇక్కడి నుంచి బరిలోకి రేవంత్... టీకాంగ్రెస్ లోక్‌సభ అభ్యర్థుల తొలిజాబితా విడుదల

టీఆర్ఎస్ హోళీ ఆఫ‌ర్..! ఖాళీ అవుతున్న కాంగ్రెస్..!

టీఆర్ఎస్ హోళీ ఆఫ‌ర్..! ఖాళీ అవుతున్న కాంగ్రెస్..!

కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్‌లోకి మారుతున్న ఎమ్మెల్యేలు కూడా ఇదే అంశాన్ని ప‌లు సంద‌ర్బాల్లో చెబుతున్నారు. కానీ వాస్త‌వానికి అస‌లు కార‌ణం వేరే ఉందట‌. చోటుమారిన వారికి.. కండువా క‌ప్పించుకున్న వారికి.. స్థానాన్ని బ‌ట్టి ఒక్కోక‌రికి కోట్ల‌లో తాయిలాలు స‌మ‌ర్పిస్తున్న‌ట్టు స‌మాచారం. దాంతోపాటు, న‌గ‌రంలో కోరుకున్న చోట‌, భారీ బంగ్లా క‌ట్టుకునేందుకు 1000 గ‌జాల ఖ‌రీదైన స్థ‌లం కూడా ఇస్తామంటున్నార‌ట అమాత్యుల వారు.

 టీఆర్ఎస్ బ‌లోపేతం..! తిరుగులేని శ‌క్తిగా అవ‌త‌ర‌ణ‌..!!

టీఆర్ఎస్ బ‌లోపేతం..! తిరుగులేని శ‌క్తిగా అవ‌త‌ర‌ణ‌..!!

పైగా ఐదేళ్ల‌పాటు అధికారంలో ఉండే స‌ర్కారుతో ఏది కావాల‌న్నా చేయించుకోవ‌చ్చ‌నే వెసులుబాటు కూడా క‌ల్పిస్తున్నార‌ట నేత‌లు. కాంట్రాక్టులు.. ప‌నులు.. బ‌దిలీలు.. ముడుపులు.. అబ్బో.. ఏది కావాలంటే అది.. మీ ఇష్టం అంటూ భ‌రోసా.. బ‌ల‌మైన హామీ రావ‌ట‌మే ఇందుకు కార‌ణ‌మ‌నే ఆరోప‌ణ‌లున్నాయి. ఏదైనా.. దీపం ఉన్న‌పుడే ఇల్లు చ‌క్క‌బెట్టుకోవాల‌నే సామెత‌.. రాజ‌కీయ‌నేత‌ల‌కు తెలిసినంత‌గా ఇంకెవ‌రికీ తెలియ‌దేమో.. అందుకే గులాబీ పార్టీ ఇస్తున్న సీజ‌న‌ల్ ఆఫ‌ర్ల‌ను మిస్స‌వ్వ‌కుండా చూసుకుంటోతంది కాంగ్రెస్ పార్టీ.

English summary
Telangana story of Telangana reached almost climax. The rest of the political party is still on the same track. Vanama, Sudhir Reddy and Jaggareddi were also ready to leave the congress party.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X