Thummala Nageswara Rao: తుమ్మల నాగేశ్వర రావు పార్టీ మారుతారా..!

బీఆర్ఎస్ నుంచి సీనియర్ నేత తుమ్మల నాగేశ్వర రావు సీట్ రాకపోవడంతో ఆయన అనుచరులు ఆగ్రహంతో ఉన్నారు. ఎమ్మెల్యే జాబితాలో తన పేరు లేకపోవడంపై తుమ్మల కూడా అసంతృప్తింగా ఉన్నట్లు తెలుస్తోంది. నిన్నటి వరకు హైదరాబాద్ లోనే ఉన్న తుమ్మల శుక్రవారం ఖమ్మంకు వెళ్లారు. దీంతో ఆయనకు నాయకన్ గూడెం వద్ద అనుచరులు భారీగా స్వాగతం పలికారు. భారీ ర్యాలీ నిర్వహించారు. టికెట్ రాకపోవడంతో పార్టీ మారాలని అనుచురులు ఆయనపై ఒత్తిడి చేస్తున్నట్లు తెలిసింది.

పార్టీ మారడంపై తుమ్మల నాగేశ్వర రావు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని తెలుస్తోంది. ఆయన శుక్రవారం ముఖ్య నేతలు, అనుచరులతో భేటీ అయ్యారు. తన అనుచరులు అభిప్రాయాలు తీసుకున్నారు. సీఎం కేసీఆర్ 2014లో తుమ్మల నాగేశ్వరరావును అప్పటి టీఆర్ఎస్ లోకి ఆహ్వానించారు. ఆ తర్వాత తుమ్మలను ఎమ్మెల్సీ చేసి ఆర్అండ బీ, స్త్రీ శిశు సంక్షేమ శాక మంత్రిగా బాధ్యతలు అప్పగించారు. 2016లో జరిగిన పాలేరు ఉపఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థి రాంరెడ్డి సుచరితపై తుమ్మల విజయం సాధించారు.

Rumors are rife that BRS leader Tummala Nageswara Rao is planning to switch parties

తుమ్మల 2018లో జరిగిన ఎన్నికల్లో పాలేరు నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థి ఉపేందర్ రెడ్డి చేతిలో ఓటమిపాలయ్యాడు. కొద్ది రోజుల తర్వాత ఉపేందర్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరారు. దీంతో అప్పటి నుంచి తుమ్మల కాస్త అసంతృప్తిగానే ఉన్నట్లు తెలిసింది. ఈసారి టికెట్ తనకే వస్తుందని ఆయన భావించారు. కానీ సీఎం కేసీఆర్ తుమ్మలకు నాగేశ్వరరావు టికెట్ కేటాయించలేదు. సిట్టింగ్ ఎమ్మెల్యే ఉపేందర్ రెడ్డికి కేసీఆర్ టికెట్ ఇచ్చారు.

టికెట్ రాకపోవడంపై తుమ్మల వర్గం గత మంగళవారం ఖమ్మం రూరల్ మండలం సత్యనారాయణపురంలో భేటీ అయ్యారు. తుమ్మల నాగేశ్వర రావును కాంగ్రెస్ లో చేరాలని అనుచురులు ఒత్తిడి చేస్తున్నట్లు సమాచారం.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+