రైతుబంధు చెక్కులను వెనక్కిచ్చిన హీరో మహేష్ బాబు దంపతులు, నిర్మాత

హైదరాబాద్: రైతుబంధు పథకం కింద వచ్చిన చెక్కులను ప్రముఖ సినీ నటుడు, ప్రిన్స్ మహేష్ బాబు దంపతులు తిరిగి ప్రభుత్వానికి అందించారు. మహేష్ బాబు కుటుంబంతో పాటు నిర్మాత రవిశంకర్ కూడా తిరిగి ఇచ్చారు. ఈ మేరకు మహేశ్వరం వ్యవసాయాధికారి కోటేశ్వర్ రెడ్డికి రూ.16 వేల చెక్కులను వారు అందించారు.

మహేశ్వరం మండలంలోని నాగారం పరిధిలో మహేష్ బాబుకు 39.2 గుంటల భూమి, నమ్రతశిరోద్కర్‌ పేరున 1.20 ఎకరాలు, నిర్మాత రవిశంకర్‌కు రెండు ఎకరాల భూమి ఉంది. శుక్రవారం నమ్రత శిరోద్కర్‌, రవిశంకర్లకు వ్యవసాయాధికారి కోటేశ్వర్ రెడ్డి రైతుబంధు చెక్కులను అందించారు. సదరు చెక్కులను తిరిగి ప్రభుత్వానికి అందించినట్లు వారు తెలిపారు.

Rythu Bandhu cheques returned by Mahesh babu and producer Ravi Shankar

శుక్రవారం బంజారాహిల్స్‌లోని తమ నివాసాల్లో మహేశ్వరం వ్యవసాయాధికారి కోటేశ్వర్ రెడ్డి, వీఆర్వో మహేశ్‌కు చెక్కులు అందించారు. ఈ సందర్భంగా రవిశంకర్ మాట్లాడారు. రైతుబంధు పథకం పేద రైతులకు బాగా ఉపయోగపడుతుందన్నారు. రైతుకు అయిదు లక్షల రూపాయల బీమా పథకం చారిత్రాత్మకమని కొడియాడారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+