తెలంగాణ రైతులకు భారీ శుభవార్త.. ఒక్కొక్కరి అకౌంట్ లోకి రూ. 90,000.. ఇలా చెక్ చేసుకోండి

తెలంగాణలోని రైతులకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటోంది. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రైతు భరోసా నిధులను సకాలంలో అందించి అన్నదాతలకు ఆసరాగా నిలుస్తోంది రేవంత్ సర్కార్. వానాకాలం సీజన్ మొదలు కావడంతో రైతు భరోసా నిధులను శరవేగంగా రైతుల ఖాతాల్లోకి జమ చేస్తుంది. జూన్ 16 నుంచి రైతు భరోసా నిధుల పంపిణీని సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. జూన్ 23న 15 ఎకరాలు ఉన్న రైతులకు రైతు భరోసా నిధులు అందనున్నాయి.

రైతులకు పెట్టుబడి సాయం అందించేందుకు రైతు భరోసా పథకం తీసుకొచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం. ఈ పథకం కింద ప్రతి ఎకరాకు రూ. 6వేలు పెట్టుబడి సాయం రైతులకు అందిస్తుంది రేవంత్ సర్కార్. ఈ ఏడాది వానాకాలం సీజన్ కు సంబంధించిన నిధులను జూన్ 16 న సీఎం రేవంత్ రెడ్డి బటన్ నొక్కి ప్రారంభించారు. ప్రొఫెసర్ జయశంకర్​వ్యవసాయ విశ్వవిద్యాలయంలో రైతు నేస్తం కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన సీఎం రేవంత్ రెడ్డి బటన్ నొక్కి రైతు భరోసా నిధులను విడుదల చేశారు. అయితే కేవలం ఆరు రోజుల్లోనే రూ. 7,700 కోట్లు పంపిణీ చేసినట్లు తెలంగాణ ప్రభుత్వం తాజాగా ప్రకటించింది.

జూన్ 23 న ఏకంగా 15 ఎకరాలు వరకు ఉన్న రైతులకు రైతు భరోసా నగదును అకౌంట్లలో జమ చేయనుంది రాష్ట్ర ప్రభుత్వం. ఈ క్రమంలో 15 ఎకరాలు ఉన్న రైతుకు రూ. 90,000 రైతు భరోసా నగదు జమ కానుంది. ఇందుకోసం తాజాగా రూ. 513 కోట్లను విడుదల చేసినట్లు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు తెలిపారు. ఇప్పటి వరకూ రూ.8,284 కోట్ల నగదును 67.01 లక్షల మంది రైతుల అకౌంట్లలో జమ చేసినట్లు తుమ్మల పేర్కొన్నారు.

Rythu Bharosa Cash Deposited on June 23 for Farmers with Up to 15 Acres

ఇక జూన్ 24 తో రైతులకు రైతు భరోసా నిధులు అందజేతను తెలంగాణ ప్రభుత్వం పూర్తి చేయనుంది. దీంతో రాష్ట్రంలో రైతు భరోసా సంబరాలను నిర్వహించాలని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు జూన్ 24 న అన్ని రైతు భరోసా కేంద్రాల్లో సంబరాలు నిర్వహించాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆదేశాలు జారీ చేశారు. కేవలం 9 రోజుల్లోనే దాదాపు రూ. 9వేల కోట్ల రైతు భరోసా నిధులను విడుదల చేశామని భట్టి అన్నారు. ఇప్పటి వరకూ కోటీ 39 లక్షలకు పైగా ఎకరాలకు రైతు భరోసా అందించామని తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+