వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సైరస్ మిస్త్రీ తర్వాత..: టాటా సన్స్ రేసులో 'తమిళ' తెలుగువాడు రామాదురై

|
Google Oneindia TeluguNews

ముంబై: సైరస్ మిస్త్రీని టాటా సన్స్ చైర్మన్ పదవి నుంచి తప్పించిన తర్వాత ఆ పదవికి పలువురి పేర్లు వినిపిస్తున్నాయి. తాజాగా, రేసులో ఎస్ రామాదురై కూడా ఉన్నారు. నిన్నటి దాకా కేబినెట్‌ మంత్రి హోదాతో నేషనల్‌ స్కిల్‌ డెవల్‌పమెంట్‌ ఏజెన్సీ చైర్మన్‌గా ఉన్న రామదురై హఠాత్తుగా తన పదవికి రాజీనా చేశారు.

ఇది మార్కెట్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. టిసిఎస్‌ సిఇఒగా, వైస్‌ చైర్మన్‌గా పని చేసిన సుబ్రమణియన్‌ రామదురైని రతన్ టాటాకు సన్నిహితుల్లో ఒకరిగా చెబుతారు. నేషనల్‌ స్కి ల్‌ డెవలప్‌మెంట్‌ ఏజెన్సీ చైర్మన్‌ పదవితో పాటు నేషనల్‌ స్కి ల్‌ డెవల్‌పమెంట్‌ కార్పొరేషన్‌ సారధ్యం బాధ్యతల కు కూడా రామదురై రా జీనామా చేశారని తెలుస్తోంది.

వస్తున్న వార్తల మేరకు.. సెప్టెంబరు చివరి వారంలో ఆరోగ్య కారణాలను చెబుతూ జంటపదవులకు రామదురై రాజీనామా చేశారని, ప్రధాని కార్యాలయం రాజీనామాలకు సూత్రప్రాయంగా ఆమోదం తెలిపిందని అంటున్నారు. రామదురై స్థానంలో స్కిల్‌ డెవల్‌పమెంట్‌ ఏజెన్సీ చైర్మన్‌ బాధ్యతలను స్కిల్‌ డెవల్‌పమెంట్‌ అండ్‌ ఎంటర్ ప్రీన్యుర్‌షిప్‌ మంత్రిత్వ శాఖ కార్యదర్శి రోహిత నందన్‌ తాత్కాలికంగా చేపడుతారని తెలిసింది.

S Ramadorai resigns as Chairman of NSDC & NSDA, may head to Tata Sons

టిసిఎస్‌ నిర్మాత

రామదురైకి పారిశ్రామిక, వాణిజ్య రంగాల్లో మంచిపేరు ఉంది. అయితే ఆయన ప్రధాన కార్యక్షేత్రం టిసిఎస్‌. ఈ కంపెనీతో ఆయనకు 42 ఏళ్ల అనుబంధం ఉంది. 1996లో టిసిఎస్‌ సిఇఒగా బాధ్యతలు స్వీకరించిన రామదురై 2009 వరకు ఆ పదవిలో కొనసాగారు.

ఆయన సిఇఒగా ఉన్న పుష్కరకాలంలో స్థానిక ఐటి కంపెనీల్లో ఒకటిగా ఉన్న టిసిఎస్‌ అంతర్జాతీయ ఐటి దిగ్గజంగా అవతరించింది. సంస్థ రాబడులు 15.5 కోట్ల డాలర్ల నుంచి 600 కోట్ల డాలర్లకు చేరాయి. ఆయన హయాంలోనే 2004లో టిసిఎస్‌ పబ్లిక్‌ ఇష్యూకు కూడా వచ్చింది.

2009లో పదవీ విరమణ చేసిన వెంటనే రతన్ టాటా చొరవ వల్ల టిసిఎస్‌ వైస్‌ చైర్మన్‌గా రామదురై నియమితులయ్యారు. ఈ పదవిలో 2014 అక్టోబర్‌ వరకు ఉన్నారు. ప్రస్తుతం బిఎస్‌ఇ, ఎయిర్‌ ఆసియా చైర్మన్‌గా ఉన్న రామదురై హిందుస్తాన్‌ యూనిలీవర్‌, ఏషియన్‌ పెయింట్స్‌, పిరమాల్‌ ఎంటర్‌ప్రైజెస్‌ బోర్డుల్లో ఇండిపెండెంట్‌ డైరెక్టర్‌గా కూడా ఉన్నారు. మరికొన్ని టాటా కంపెనీల్లోను డైరెక్టర్‌గా ఉన్నారు.

మన్మోహన్ సింగ్‌ ప్రభుత్వం 2011లో రామాదురైని స్కిల్‌ డెవల్‌పమెంట్‌ కోసం ఏర్పాటు చేసిన జాతీయ కౌన్సిల్‌లో ప్రధాని సలహాదారుగా కేబినెట్‌ హోదాలో నియమించింది. ఈ కౌన్సిల్‌ను అనంతర కాలంలో నేషనల్‌ స్కిల్‌ డెవల్‌పమెంట్‌ ఏజెన్సీగా మార్చారు.

బీజేపీ ప్రభుత్వం వచ్చాక కూడా ఆయన కొనసాగారు. ఇప్పుడు హఠాత్తుగా రాజీనామా చేశారు. దీంతో పలు ఊహాగానాలు తెరలేచాయి. టాటా సన్స్‌ చైర్మన్‌ పదవి నుంచి సైరస్‌ మిస్త్రీని తొలగించిన నేపథ్యంలో కొత్త చైర్మన్‌పై భారీ ఎత్తున ప్రచారం జరుగుతోంది.

ఈ సందర్భంగా రతన్ టాటా సన్నిహితుల పేర్లు తెరపైకి వస్తున్నాయి. రతన్‌ సవతి సోదరుడు నోయెల్‌ టాటా పేరు కూడా మీడియాలో నలుగుతోంది. ఇదిలా ఉండగా, తమిళనాడులో స్థిరపడిన తెలుగు కుటుంబాలకు చెందిన రామదురై 1945లో నాగపూర్‌లో జన్మించారు. ఆయన తండ్రిగారు తమిళనాడు అకౌంటెంట్‌ జనరల్‌గా పని చేశారు. రామదురై సమర్ధతపై రతన్ టాటాకు ఎంతో విశ్వాసం. సుదీర్ఘకాలం పాటు టాటా గ్రూప్‌తో ఉండటం వల్ల సంస్థ పని సంస్కృతి, సంప్రదాయాల గురించి కూడా అవగాహన ఉంది.

English summary
Former Tata Consultancy Services vice-chairman S Ramadorai has resigned as the Chairman of National Skill Development Agency (NSDA) in the rank of a Cabinet Minister and also the as the chief of National Skill Development Corporation (NSDC).
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X